ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రభుత్వం లక్షద్వీప్ లో అమలుచేస్తున్న వివిధ పథకాల యొక్క లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 03 JAN 2024 1:49PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం ద్వారా లక్షద్వీప్ లో అమలవుతున్న వివధ పథకాల యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను పాల్గొన్న సమావేశం తాలూకు దృశ్యాల ను శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘భారత ప్రభుత్వం లక్షద్వీప్ లో అమలు చేస్తున్న వివిధ పథకాల యొక్క లబ్ధిదారుల తో సమావేశం కావడం ఆనందాన్ని కలిగించింది. మహిళల సమూహం వారి యొక్క స్వయం సహాయ సమూహం (ఎస్‌హెచ్‌జి) ఏ విధం గా ఒక ఉపాహారశాల ను ప్రారంభించే దిశ లో పాటుపండిందీ, తద్ద్వారా వారు వారి సొంత కాళ్ళ మీద నిలబడగలిగిందీ వివరించింది. ఒక వయోవృద్ధ వ్యక్తి తనకు సోకిన హృదయకోశ రుగ్మత కు చికిత్స ను పొందడం లో ఆయుష్మాన్ భారత్ ఏ విధం గా తనకు సాయ పడిందీ తెలియ జేశారు. పిఎమ్-కిసాన్ వల్ల ఒక మహిళా రైతు జీవనం లో మార్పు వచ్చిన సంగతి ని గురించి ఆమె చెప్పారు. ఉచిత ఆహార పదార్థాల ను గురించి, దివ్యాంగుల కు లభిస్తున్నటువంటి ప్రయోజనాల ను గురించి, పిఎమ్-ఆవాస్ ను గురించి, కిసాన్ క్రెడిట్ కార్డుల ను గురించి, ఉజ్జ్వల యోజన ను గురించి, ఇంకా పలు పథకాల ను గురించి మరి కొందరు ఈ సమావేశం లో మాట్లాడారు. అభివృద్ధి తాలూకు ఫలాలు అతి సుదూర ప్రాంతాల లో సైతం ప్రజల లో భిన్న వర్గాల కు అందుతూ ఉండడాన్ని గమనించడం నిజం గా సంతృప్తి ని కలిగించింది.’’ అని తెలిపారు.

 

***

DS/TS


(Release ID: 1992718) Visitor Counter : 303