ప్రధాన మంత్రి కార్యాలయం

విశ్వకర్మ యోజన ను గురించిన మరియు  చిరుధాన్యాల ను గురించిన  చైతన్యాన్నివ్యాప్తి చేస్తున్నటువంటి ‘కుమ్హార్’ సముదాయానికి చెందిన మహిళా నవ పారిశ్రామికవేత్త


మీ యొక్క సామూహికమాతృ శక్తి మిమ్ముల ను క్రొత్త శిఖరాల కు చేర్చుతుంది: ప్రధాన మంత్రి

Posted On: 27 DEC 2023 2:22PM by PIB Hyderabad

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు.

దేశవ్యాప్తం గా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారులు అయిన వేల కొద్దీ ప్రజలు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ లకు చెందిన సభ్యులు మరియు స్థానిక స్థాయి ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

రాజస్థాన్ లోని కోటా ప్రాంత నివాసి, స్వనిధి పథకం లబ్ధిదారుల లో ఒకరు అయిన సప్నా ప్రజాపతి గారు కూడా మహమ్మారి కాలం లో మాస్కుల ను తయారు చేయడం లో తన వంతు భూమిక ను నిర్వర్తించారు. ఆమె తన వ్యాపారం లో చాలా వరకు డిజిటల్ ట్రాన్సాక్శన్స్ జరపడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. చైతన్యాన్ని వ్యాప్తి చేయడం లో పాలుపంచుకోవలసింది గా ఆమె ను స్పీకర్ మరియు స్థానిక పార్లమెంటు సభ్యుడు అయినటువంటి శ్రీ ఓమ్ బిర్‌లా ప్రోత్సహించారు. సప్నా గారు సభ్యురాలు గా ఉన్నటువంటి సమూహం చిరుధాన్యాల (శ్రీ అన్న)తో వివిధ పదార్థాల ను తయారు చేయడం తో పాటుగా వాటి వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.

విశ్వకర్మ పథకాన్ని గురించి న వివరాల ను ప్రధాన మంత్రి ‘కుమ్హార్’ సముదాయాని కి చెందిన నవ పారిశ్రామికవేత్తల కు తెలియ జేశారు. ‘‘మీ అందరి సామూహిక మాతృ శక్తి మిమ్ముల ను సరిక్రొత్త శిఖరాల కు తీసుకు పోతుంది. మరి నేను మీ సోదరీమణుల ను అందరి ని కోరేది ఏమిటి అంటే అది మీరు అందుకొంటున్న పథకాల తాలూకు ప్రయోజనాల ను మీ తోటి వారు కూడా దక్కించుకోవచ్చును అని వారి కి తెలియ జేస్తూ, మోదీ కీ గ్యారంటీ కీ గాడీ ని గొప్ప గా విజయవంతం చేయండి అనేదే.’’ అని ఆయన అన్నారు.

 

***



(Release ID: 1990973) Visitor Counter : 82