ప్రధాన మంత్రి కార్యాలయం
దశాబ్ది కాలం క్రితం ‘‘అత్యంత సునిశితమైన ఐదు’’ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన భారతదేశం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా పరివర్తన చెందడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది : ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
21 DEC 2023 8:52PM by PIB Hyderabad
ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికతో తన ఇంటర్వ్యూను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా పంచుకున్నారు.
‘‘@FT కి ఇచ్చిన ఈ విస్తారమైన ఇంటర్వ్యూలో స్థానిక, ప్రపంచ ప్రాధాన్యం గల అనేక అంశాలపై నును మాట్లాడాను.
on.ft.com/3NDFBiR
భారతదేశ అభివృద్ధి యానం గురించి, రికార్డు వేగంతో భారతదేశం ఏ విధంగా వృద్ధి చెందింది, స్టార్టప్ లు ఏ విధంగా అద్భుతంగా పెరిగాయి, ప్రజా ఉద్యమాలతో ప్రజల జీవితాలు ఎలా మెరుగుపడ్డాయి...ఇలా ఎన్నో అంశాలు ప్రస్తావించాను. దశాబ్ది కాలం క్రితం ‘‘అత్యంత సునిశితమైన ఐదు’’ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిన భారతదేశం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా పరివర్తన చెందడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని ప్రపంచం ఒక ఆశాకిరణంగా, ప్రపంచ సుసంపన్నతలో కీలక భాగస్వామిగా చూస్తోంది.’’
అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1989559)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam