ప్రధాన మంత్రి కార్యాలయం
‘వికసిత్ భారత్ @ 2047: వాయిస్ ఆఫ్ యూథ్’ లో చేరండి అంటూ అందరికి విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
‘వికసిత్ భారత్ @ 2047: వాయిస్ ఆఫ్ యూథ్’ ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 DEC 2023 10:05AM by PIB Hyderabad
అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించే దిశ లో మన యువజనుల ను నిమగ్నం చేసేందుకు ఉద్దేశించినటువంటి ‘వికసిత్ భారత్ @ 2047: వాయిస్ ఆఫ్ యూథ్’ కార్యక్రమం లో పాలుపంచుకోవలసింది గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికి విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ తాలూకు మన కల ను సాకారం చేయడం కోసం భారతదేశం యొక్క యువ శక్తి పాటుపడుతుందన్న పూర్ణ విశ్వాసం తనకు ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు న ఉదయం 10 గంటల 30 నిమిషాల కు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘వికసిత్ భారత్ తాలూకు మన కల ను సాకారం చేయడం కోసం భారతదేశం యొక్క యువ శక్తి పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ రోజు న ఉదయం పూట 10:30 గంటల కు ‘వికసిత్ భారత్ @ 2047: వాయిస్ ఆఫ్ యూథ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను ప్రసంగించనున్నాను. అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించే దిశ లో మన యువజనుల ను నిమగ్నం చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం గా ఉంది. మీరందరు పెద్ద సంఖ్య లో దీనిలో చేరండి అంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1985413)
आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam