ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మిక్ జాగర్ కు ప్రధానమంత్రి స్వాగతం

प्रविष्टि तिथि: 18 NOV 2023 1:15PM by PIB Hyderabad

పాశ్చాత్య సంగీత దిగ్గజం మిక్ జాగర్ పోస్టుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్పందించారు. 

 

భారతదేశాన్ని సందర్శించడం తనకెంతో ఆనందంగా ఉందంటూ జాగర్ ఆ పోస్టులో సంతోషం వెలిబుచ్చారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి ఆయన గీతాన్ని ఉదాహరిస్తూ 'ఎక్స్' ద్వారా పంపిన ఒక సందేశంలో:

 

"మనం ఆశించిన ప్రతి ఒక్కటీ మనకు దక్కదు' కానీ, ప్రతి అన్వేషకుడికీ భారతదేశమంతటా ఉత్సాహం,  సంతోషం, సంతృప్తి మెండుగా లభిస్తాయి. ఆ మేరకు భారతీయ సంస్కృతి, ప్రజల నుంచి మీకెంతో ఆనందం లభించడం ముదావహం. తరచూ భారతదేశాన్ని సందర్శిస్తూండండి" అని స్వాగతించారు.

 

***

DS/AK


(रिलीज़ आईडी: 1977980) आगंतुक पटल : 135
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam