ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్2022 లో మహిళల ఆర్చరి కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలవడం పట్లసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
05 OCT 2023 11:21AM by PIB Hyderabad
హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో మహిళల ఆర్చరి కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో జ్యోతి సురేఖ వెన్నమ్ గారు, పర్ ణీత్ కౌర్ గారు మరియు అదితి గోపీచంద్ గారు లు పసిడి పతకాన్ని గెలిచిన సందర్భం లో వారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో -
‘‘భారతదేశాని కి చెందిన మహిళా ధనుర్విద్య కౌశలం సంబంధి క్రీడాకారిణులు కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని గెలిచారు. జ్యోతి సురేఖ వెన్నమ్ గారు, పర్ ణీత్ కౌర్ గారు మరియు అదితి గోపీచంద్ గారు లకు ఇవే అభినందన లు. వారి యొక్క సాటిలేనటువంటి ఆటతీరు, తదేక శ్రద్ధ మరియు అంకిత భావం లు మన దేశ ప్రజలు ఎంతగానో గర్వించేటట్లు గా చేశాయి. ఈ గెలుపు క్రీడాకారిణుల యొక్క అసాధారణమైనటువంటి నేర్పు కు మరియు టీమ్ వర్కు కు ప్రమాణం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1964548)
Read this release in:
Punjabi
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil