ప్రధాన మంత్రి కార్యాలయం
స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి
ఇందులో ప్రధానమంత్రితో కలిసిన అంకిత్ బయాన్ పురియా
Posted On:
01 OCT 2023 2:31PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు నేడు జాతి యావత్తు స్వచ్ఛత ఉద్యమంలో పాల్గొది. ప్రతీ ఒక్కరూ ఒక గంట సేపు స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది భారతదేశానికి మెరుగైన భవిష్యత్తును అందించడానికి సహాయకారి అవుతుంది.
ఫిట్ నెస్ ప్రబోధకుడు అంకిత్ బయాన్ పురియాతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి తన ఎక్స్ పోస్ట్ లో మన నిత్య జీవనంలో స్వచ్ఛత, శరీర దారుఢ్యం ప్రాధాన్యత గురించి అంకిత్ తో సంభాషించడం కనిపించింది. ప్రధానమంత్రి తన రోజువారీ జీవనశైలి గురించి కూడా వివరిస్తూ అంకిత్ ప్రారంభించిన ఫిట్ నెస్ నిధి గురించి కూడా అడిగారు.
ప్రధానమంత్రి ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసిన సందేశంలో
‘‘నేడు జాతి యావత్తు స్వచ్ఛతపై దృష్టి సారించింది. అంకిత్ బయాన్ పురియా, నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. కేవలం స్వచ్ఛత కాకుండా ఫిట్ నెస్, సంక్షేమం కూడా మేం ఇందులో జోడించాం. ఇదంతా స్వచ్ఛత ప్రభావం, స్వస్థ్ భారత్ ప్రకంపన @baiyanpuria’’ అన్నారు.
***
DS/ST
(Release ID: 1963551)
Visitor Counter : 122
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam