ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022ఆసియా క్రీడల, పురుషుల స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలే పోటీలలో కాంస్యపతకం గెలుచుకున్న క్రీడాకారులను అభినందించిన ప్రధానమంత్రి.

प्रविष्टि तिथि: 02 OCT 2023 12:25PM by PIB Hyderabad

హాంగ్జోవులో జరుగుతున్న  ఏసియన్ గేమ్స్ 2022 ,పురుషుల స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలే పోటీలలో  కాంస్య పతకం గెలుచుకున్న ఆనందకుమార్ వెల్ కుమార్, సిద్ధాంత్ రాహుల్ కాంబ్లే, విక్రమ్ రాజేంద్ర ఇంగ్లేలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.

సామాజిక మాధ్యమ వేదిక , ఎక్స్ లో ఒక సందేశం పోస్ట్ చేస్తూ ప్రధానమంత్రి,

‘‘ అధ్బుతమైన టీమ్ వర్క్ మన దేశానికి మరో కాంస్య పతకాన్ని సాధించిపెట్టింది.

ఆనందకుమార్ వేల్ కుమార్, సిద్ధాంత్ రాహుల్ కాంబ్లే, విక్రమ్ రాజేంద్ర ఇంగ్లేలు పురుషుల 3000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్ రిలే పోటీలలో గెలుపొందారు. వీరు సాధించిన విజయానికి భారతదేశం ఆనందిస్తోంది. ఎంతో గర్వపడుతోంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1963359) आगंतुक पटल : 116
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam