నాడు పోస్టు చేయడమైనది:
27 JUL 2023 6:14PM by PIB Hyderabad
సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సాహసులైన జవాన్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశభద్రతపై వారి అచంచల నిబద్ధత ఎంతో ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ధీరులైన సిబ్బందికి నా శుభాకాంక్షలు! వారి ధైర్యం, నిబద్ధత, నిస్వార్థ సేవాభావనలను దేశం ఎంతగానో అభినందిస్తున్నది. దేశభద్రతపై వారి అచంచల అంకితభావం ఎంతయినా ప్రశంసనీయం. @crpfindia” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.