ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దొంగరవాణా చేసినకళాకృతుల ను తిరిగి ఇస్తున్నందుకు యుఎస్ఎ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 19 JUL 2023 12:43PM by PIB Hyderabad

భారతదేశం లో వివిధ ప్రాంతాల కు మరియు సంప్రదాయాల కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి 105 కళాకృతులు, ఏవైతే అక్రమ రవాణా కు గురి అయ్యాయో యుఎస్ఎ నుండి తిరిగి వెనుక కు వస్తున్నాయి.


భారతదేశం లో వేరు వేరు ప్రాంతాల కు మరియు సంప్రదాయాల కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 105 కళా రూపాలు ఏవైతే అక్రమ తరలింపున కు గురి అయ్యాయో వాటిని మాతృభూమి కి తిరిగి ఇస్తున్నందుకు గాను యుఎస్ఎ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను తెలియ జేశారు.

వాశింగ్ టన్ డిసి లో భారత రాయబారి కార్యాలయం చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

"ఇది భారతదేశం లో ప్రతి ఒక్కరి కి సంతోషాన్ని కలిగిస్తుంది. దీనికి గాను యుఎస్ఎ కు ఇవే కృతజ్ఞత లు. ఈ అమూల్యమైన కళాకృతుల కు సంస్కృతి పరం గా మరియు ధర్మం పరం గా ఎంతో ప్రాముఖ్యం ఉంది. అవి స్వదేశాని కి తిరిగి వస్తుండడం మన వారసత్వాన్ని మరియు ఘనమైన చరిత్ర ను పరిరక్షించడం కోసం మనం చాటుకొంటున్నటువంటి నిబద్ధత కు ఒక నిదర్శనం అని చెప్పాలి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.


***


DS/ST


(रिलीज़ आईडी: 1940864) आगंतुक पटल : 187
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam