ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ తో ప్రధాని భేటీ

Posted On: 24 JUN 2023 7:27AM by PIB Hyderabad

ఆల్ఫాబెట్,  గూగుల్ సంస్థల సీఈవో సుందర పిచ్చాయ్ తో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న  వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు.   కృత్రిమ మేథ, ఫిన్ టెక్, సైబర్ సెక్యూరిటీ  ఉత్పత్తులు, సేవలు, మొబైల్ పరికరాల తయారీ  తదితర రంగాలలో మరింత సహకారానికి అవకాశాలు ఆన్వేషించాలని ఈ సందర్భంగా సుందర పిచ్చాయ్ ని ప్రధాని కోరారు.

గూగుల్, భారతదేశంలోని  విద్యా సంస్థల  మధ్య సహకారం ద్వారా ఆర్ అండ్ డీ , నైపుణ్యాభివృద్ధికి అవకాశాల మీద కూడా ఇద్దరూ చర్చించారు.

 

*******


(Release ID: 1935025) Visitor Counter : 146