ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు శ్రీ రే డేలియో తో సమావేశమైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 JUN 2023 8:28AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా కు చెందిన ఇన్వెస్టరు, రచయిత మరియు హెజ్ ఫండ్ ‘‘బ్రిజ్ వాటర్ అసోసియేట్స్’’ యొక్క సహ వ్యవస్థాపకుడైన శ్రీ రే డేలియో తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

ఆర్థిక వృద్ధి కి ప్రోత్సాహాన్ని అందించడం కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న సంస్కరణల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ డేలియో తో జరిపిన సంభాషణ లో ప్రముఖం గా పేర్కొన్నారు. ఆ సంస్కరణల లో, నియమాల పాలన భారాన్ని తగ్గించడం మరియు పెద్ద సంఖ్య లో ఉన్న చట్టపరమైన నిబంధన ల ను నేరాల కోవ నుండి తప్పించడం వంటివి భాగం గా ఉన్నాయి. శ్రీ డేలియో భారతదేశం లో మరిన్ని పెట్టుబడుల ను పెట్టాలంటూ ప్రధాన మంత్రి ఆహ్వానం పలికారు.

 

***


(रिलीज़ आईडी: 1934165) आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam