ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
ప్రభుత్వంలోని వేరు వేరు విభాగాలు మరియు సంస్థల లోక్రొత్త గా నియమించుకొన్న వ్యక్తుల కు దాదాపు గా 70,000 నియామాక లేఖల ను పంపిణీ చేశారు
‘‘ప్రస్తుతం భారతదేశం వృద్ధి యాత్ర లో భాగస్వామి కావాలని యావత్తు ప్రపంచం తపిస్తున్నది’’
‘‘ప్రస్తుతం,భారతదేశం తన రాజకీయ స్థిరత్వాని కి గాను పేరు ను తెచ్చుకొన్నది; అంటే నేటి ప్రపంచం లో దీనికి ఎంతో విలువ ఉందన్నమాటే;ఇవాళ, భారతదేశం ప్రభుత్వాన్ని ఒక నిర్ణయాత్మకమైన ప్రభుత్వం గా గుర్తింపు ను పొందింది. ప్రస్తుతం, ప్రభుత్వం తన ప్రగతిశీలమైన ఆర్థిక మరియు సామాజిక నిర్ణయాల కుగాను ప్రసిద్ధి ని పొందింది’’
‘‘ప్రభుత్వ పథకాలుపౌరుల యొక్క సంక్షేమం పైన అనేక విధాలైన ప్రభావాన్ని కలుగజేస్తాయి’’
‘‘ఉద్యోగాల కు ‘రేటు కార్డు’ రోజులు గతించిపొయాయి, ప్రస్తుత ప్రభుత్వం యువత యొక్క భవిష్యత్తు ను ‘రక్షించడం’ పై శ్రద్ధ ను వహిస్తున్నది’’
‘‘ప్రజల లో విభజనను తీసుకురావడానికై భాష ను దుర్వినియోగపరచడం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వం భాష నుబ్రతుకుదెరువుకు ఒక బలమైన మాధ్యం గా తీర్చిదిద్దుతున్నది’’
‘‘ప్రభుత్వంప్రస్తుతం తన సేవల ను పౌరుల ముంగిట కు తీసుకు పోవడం ద్వారా వారి చెంతకు చేరుకొంటున్నది’’
Posted On:
13 JUN 2023 11:52AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన జాతీయ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించారు. అంతేకాక ప్రభుత్వం లో వేరు వేరు విభాగాలు మరియు సంస్థల లో క్రొత్త గా ఉద్యోగం లో నియమించిన వ్యక్తుల కు ఇంచుమించు 70,000 నియామక లేఖల ను కూడా ఆయన పంపిణీ చేశారు. దేశవ్యాప్తం గా క్రొత్త గా ఉద్యోగాల లో నియమించినటువంటి వారు ప్రభుత్వం లో ఆర్థిక సేవల విభాగం, తపాలా విభాగం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, రెవిన్యూ విభాగం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, అణు శక్తి విభాగం, రేల్ వే మంత్రిత్వ శాఖ, ఆడిట్ ఎండ్ అకౌంట్స్ విభాగం, అణు శక్తి విభాగం మరియు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తదితర వివిధ విభాగాల లో చేరనున్నారు. ప్రధాన మంత్రి ప్రసంగం వేళ లో దేశ వ్యాప్తం గా 43 ప్రదేశాల ను సంధానించడం జరిగింది.
సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు న 70,000 కు పైచిలుకు వ్యక్తుల కు నియామక లేఖల ను అందజేసిన క్రమం లో జాతీయ రోజ్ గార్ మేళా ప్రస్తుత ప్రభుత్వానికి నూతన గుర్తింపు వలె మారిపోయింది అన్నారు. బిజెపి మరియు ఎన్ డిఎ ల పాలన లో ఉన్న రాష్ట్రాలు సైతం ఇదే తరహా రోజ్ గార్ మేళా లను క్రమం తప్పక నిర్వహిస్తూ ఉండడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం తాలూకు అమృత కాలం ఇప్పుడిప్పుడే ఆరంభమైంది అని శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, ప్రభుత్వ సేవ లో చేరుతున్న వారి కి ఇది చాలా సార్థకమైన ఘడియ. ఎలాగ అంటే రాబోయే 25 సంవత్సరాల లో భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశం గా రూపొందించే దిశ లో తోడ్పాటు ను అందించే అవకాశాన్ని వారు దక్కించుకొన్నారు కదా అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘వర్తమానం తో పాటు, మీరు దేశం యొక్క భవిష్యత్తు కు సర్వస్వాన్ని ఇవ్వవలసిందే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ క్రొత్త గా ఉద్యోగం లో నియామకం పొందిన వ్యక్తుల కు మరియు వారి కుటుంబ సభ్యుల కు అభినందనల ను వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థ లో ఉపాధి అవకాశాలు మరియు స్వతంత్రోపాధి సంబంధి అవకాశాలు అంది వస్తుండడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ముద్ర పథకం, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా ల వంటి వాటి ని గురించి ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యువతీ యువకులు కొలువుల ను సృష్టించే వారు గా మారుతున్నారు అని ఆయన అన్నారు. యువతీ యువకుల కు ప్రభుత్వ నౌకరీల ను అందించేటటువంటి ప్రచార ఉద్యమం ఇంతకు ముందు ఎన్నడు ఎరుగనంతటిది అని ప్రధాన మంత్రి అన్నారు. ఎస్ఎస్ సి, యుపిఎస్ సి మరియు ఆర్ఆర్ బి వంటి సంస్థ లు క్రొత్త క్రొత్త వ్యవస్థ ల ద్వారా మరిన్ని ఉద్యోగాల ను కల్పిస్తున్నాయి. ఈ సంస్థ లు భర్తీ ప్రక్రియ ను సులభతరమైంది గాను, పారదర్శకమైనటువంటిది గాను మరియు సరళతరమైంది గాను మలచడం పట్ల శ్రద్ధ ను తీసుకొంటున్నాయి. అవి ఉద్యోగ నియామకం తాలూకు వ్యవధి ని ఒకటి, రెండు సంవత్సరాల నుండి కొద్ది నెలల కు తగ్గించివేశాయి అని ఆయన అన్నారు.
‘‘ప్రస్తుతం భారతదేశం యొక్క వృద్ధి యాత్ర లో భాగస్వామి కావాలని యావత్తు ప్రపంచ దేశాలు ఆసక్తి ని కనబరుస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశమన్నా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అన్నా ప్రపంచం లో నమ్మకం ఏర్పడింది అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ ను సరిక్రొత్త శిఖరాల కు తీసుకు పోతోంది అని ఆయన అన్నారు. ఆర్థిక మాంద్యం, ప్రపంచ వ్యాప్త మహమ్మారి మరియు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి యుద్ధం కారణం గా సరఫరా వ్యవస్థ లో తలెత్తిన అంతరాయం లు సహా, నేటి కాలం లో ఎదురైన సవాళ్ళ ను గురించి ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. అనేక బహుళ జాతి సంస్థ లు తయారీ కోసం వాటి మార్గాన్ని భారతదేశాని కి మళ్ళించుకొంటున్న వైనాన్ని, అలాగే దేశం లో వృద్ధి చెందుతున్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిలవ ను గురించి ప్రధాన మంత్రి సోదాహరణం గా పేర్కొన్నారు. దేశం లోకి తరలి వచ్చిన విదేశీ పెట్టుబడులు ఉత్పత్తి లో పెంపుదల కు, విస్తరణ కు, క్రొత్త పరిశ్రమల ఏర్పాటు కు, అలాగే ఎగుమతుల లో వృద్ధి కి తోడ్పడుతున్నాయి, తద్ద్వారా ఉద్యోగ కల్పన అవకాశాలు త్వరితగతి న అధికం అవుతాయి అని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ప్రైవేటు రంగం లో లక్షల కొద్దీ ఉద్యోగ అవకాశాల ను సృష్టించడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, దేశం యొక్క జిడిపి కి 6.5 శాతాని కంటే అధికం గా తోడ్పాటు ను అందించినటువంటి ఆటోమొబైల్ రంగాన్ని గురించి న ఉదాహరణ ను ఇచ్చారు. ప్రయాణికుల వాహనాలు, వాణిజ్య వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలు, ఇంకా త్రిచక్ర వాహనాలు వేరు వేరు దేశాల కు ఎగుమతి అవుతూ ఉండడం అంతకంతకూ పెరుగుతూ ఉన్న విషయాన్ని పట్టి చూస్తే భారతదేశం లో ఆటోమోటివ్ ఇండస్ట్రీ యొక్క వృద్ధి ని గురించి అర్థం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు. పది సంవత్సరాల క్రితం 5 లక్షల కోట్ల రూపాయల విలువ తో ఉన్న ఈ పరిశ్రమ ప్రస్తుతం 12 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు స్థాయి కి చేరుకొంది అని ఆయన వెల్లడించారు. ‘‘ఇలెక్ట్రిక్ మొబిలిటీ యొక్క విస్తరణ కూడా భారతదేశం లో చోటు చేసుకొంటున్నది. పిఎల్ఐ పథకం ఆటో మోటివ్ ఇండస్ట్రీ కి సైతం సాయ పడుతోంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆ కోవ కు చెందిన రంగాలు భారతదేశం లో లక్షల మంది యువత కు ఎన్నో ఉపాధి అవకాశాల ను కల్పిస్తున్నాయి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఒక దశాబ్దం కిందటి తో పోల్చి చూసినప్పుడు, భారతదేశం మరింత స్థిరమైనటువంటి, సురక్షితం అయినటువంటి మరియు బలమైనటువంటి దేశం గా ఉంది అని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. ఇదివరకటి కాలాల్లో కుంభకోణాలు, ప్రజా ధన దుర్వినియోగం అనేవి పాలన తాలూకు గుర్తింపు చిహ్నాలు గా ఉన్నాయన్న సంగతి ని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘ప్రస్తుతం భారతదేశం తన రాజకీయ స్థిరత్వాని కి గాను ప్రసిద్ధి ని పొందింది. దీని కి ప్రస్తుత ప్రపంచం లో ఎంతో విలువ ఉంది. ఇవాళ భారతదేశం ప్రభుత్వాన్ని ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వం గా చూస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం తన ప్రగతిశీలమైనటువంటి ఆర్థిక మరియు సామాజిక నిర్ణయాల కు గాను పేరు ను తెచ్చుకొన్నది’’ అని ఆయన అన్నారు. జీవించడం లో సౌలభ్యం, మౌలిక సదుపాయాల నిర్మాణం మరియు వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం ల పరం గా జరిగిన కార్యాల ను గ్లోబల్ ఏజెన్సీ లు గుర్తిస్తున్నాయి అని ఆయన అన్నారు.
భారతదేశం భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల కల్పన లో భారీ పెట్టుబడుల ను పెట్టింది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. సామాజికపరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సురక్షితమైనటువంటి త్రాగునీటి లభ్యత కు జల్ జీవన్ మిశన్ ద్వారా పూచీ పడిన విషయాన్ని ఒక ఉదాహరణ గా పేర్కొన్నారు. జల్ జీవన్ అభియాన్ కోసం సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల ను ఖర్చు చేయడమైంది అని ఆయన తెలిపారు. ఈ పథకం ఆరంభం అయినప్పుడు సరాసరి ని పట్టి చూశారంటే గనక 100 గ్రామీణ జనావాసాల లో 15 గ్రామీణ జనావాసాలు నల్లా నీటి సౌకర్యాన్ని కలిగి ఉన్నవి కాస్తా ప్రస్తుతం ప్రతి 100 కుటుంబాల లో 62 నల్లా నీటి ని అందుకొంటున్నాయి అన్నారు. ఇంకా, ఈ కార్యం శీఘ్రగతి న కొనసాగుతున్నదన్నారు. ప్రతి ఒక్క కుటుంబాని కి నల్లా నీరు అందుతున్న జిల్లాలు 130 గా ఉన్నాయి. ఈ పరిణామం కాలాన్ని ఆదా చేసింది. అంతేకాకుండా జలాధారిత వ్యాధుల బారి నుండి స్వేచ్ఛ లభించింది. స్వచ్ఛమైన జలం ఇంచుమించు 4 లక్షల అతిసార సంబంధి మరణాల ను అరికట్టడం తో పాటుగా జల నిర్వహణ కోసం మరియు వ్యాధుల కు చికిత్స కోసం వెచ్చించినటువంటి 8 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా కావడానికి సైతం దోహద పడినట్లు అధ్యయనాలు చాటిచెప్పాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రభావం ఎన్ని విధాలు గా ఉంటుందో అభ్యర్థులు గ్రహించాలి అని ఆయన కోరారు.
వంశవాద రాజకీయాల వల్ల వాటిల్లే నష్టాల ను గురించి మరియు నియామకం ప్రక్రియ లో బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతాలను గురించి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ఒక రాష్ట్రం లో బయటపడినటువంటి ‘కొలువుల కోసం నగదు కుంభకోణం’ అంశాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఆ తరహా వ్యవస్థ వల లో పడవద్దంటూ యువత ను హెచ్చరించారు. వెలికి వచ్చిన వివరాల ను గురించి ఆయన వెల్లడిస్తూ, ఒక ఉపాహారశాల లో ఆహార పదార్థాల ధరల పట్టిక ను పోలి ఉండేలా ఫలానా ఉద్యోగాని కి ఫలానా రేటు అని పేర్కొంటూ ఒక సూచీ ని ఏ విధం గా తయారు చేసిందీ వివరించారు. దేశం లో రైల్ వే శాఖ మంత్రి గా వ్యవహరించిన ఒక వ్యక్తి ఒక ఉద్యోగాన్ని ఇచ్చినందుకు బదులు గా కొంత భూమి ని ఏ విధం గా సంపాదించుకొన్నదీ చాటిన ‘కొలువుల కు గాను భూమి ని హస్తగతం చేసుకొన్న కుంభకోణం’ ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ఈ కేసు ను సిబిఐ దర్యాప్తు చేస్తోంది, మరి ఈ కేసు న్యాయస్థానాల లో పెండింగు పడింది అని ఆయన వ్యాఖ్యానించారు. వంశవాద రాజకీయాల లో నిమగ్నం అవుతూ, కొలువు ల పేరిట దేశ యువత ను దోపిడీ చేస్తున్న అటువంటి రాజకీయ పక్షాల విషయం లో యువత జాగ్రత గా ఉండాలి అని ప్రధాన మంత్రి హెచ్చరిక ను చేశారు. ‘‘ఒక ప్రక్కన నౌకరీ ల కోసం ‘రేటు కార్డు’ ను ముందుకు చాచేటటువంటి రాజకీయ పార్టీలు మన దేశం లో ఉంటే, మరొక ప్రక్కన యువత యొక్క భవిష్యత్తు ను పదిలం గా కాపాడుతున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఉన్నది. యువత భవిష్యత్తు ను ‘రేటు కార్డు’ శాసిస్తుందా, లేక తగిన జాగ్రత చర్యల పట్ల మొగ్గు చూపాలా అనేది ఇప్పుడిక దేశమే నిర్ణయిస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఇతర రాజకీయ పక్షాలు భాష పేరిట ప్రజల ను విభజించేందుకు చూస్తున్నాయని, ప్రభుత్వం బ్రతుకుదెరువు కు సంబంధించిన ఒక బలమైనటువంటి మాధ్యం గా భాష ను మలచుతున్నదని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మాతృభాష లో ఉద్యోగ నియామక పరీక్షల ను నిర్వహించడానికి పెద్దపీట ను వేయడం యువతీ యువకుల కు ప్రయోజనాల ను అందిస్తోందని ఆయన అన్నారు.
ప్రస్తుత కాలం లో శరవేగం గా మునుముందుకు కదులుతున్న భారతదేశం లో ప్రభుత్వ వ్యవస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేటటువంటి విధానం చాలా వేగం గా మార్పుల కు లోనవుతున్నాయని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. దేశం లో సామాన్య పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన కాలం అంటూ ఒకటి ఉండింది అని ఆయన గుర్తు చేశారు. అదే వర్తమానం లో అయితే ప్రభుత్వం తన సేవల ను పౌరుల గుమ్మం లోకి తీసుకు పోతూ వారి నివాసాల చెంతకు చేరుకొంటోంది అని ఆయన అన్నారు. ప్రజల అపేక్షల ను, ప్రభుత్వ కార్యాలయాలు మరియు విభాగాలు సేవల ను అందిస్తున్నటువంటి ప్రాంతం యొక్క అవసరాల ను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నం జరుగుతోందని, మరి ప్రజల పట్ల సూక్ష్మ స్పందన ను కలిగి ఉండడం జరుగుతోందని ఆయన అన్నారు. మొబైల్ ఏప్స్ ద్వారా డిజిటల్ సర్వీసు లను అందజేయడం గురించిన ఉదాహరణ ను శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించి, ప్రభుత్వ సదుపాయాల ను అందుకోవడాన్ని ఆ సర్వీసు లు సులభతరం చేశాయని, మరి ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ ను నిరంతరాయం గా బలోపేతం చేయడం జరుగుతోందని తెలియ జేశారు.
క్రొత్త గా ఉద్యోగం లో నియామకం జరిగిన అభ్యర్థులు దేశ పౌరుల పట్ల సంపూర్ణమైనటువంటి సూక్ష్మగ్రాహ్యత తో శ్రమించాలి అని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో సూచించారు. ‘‘మీరు ఈ సంస్కరణల ను తప్పక మరింత ముందుకు తీసుకు పోవాలి. ఈ విషయాలన్నింటితో పాటు, మీరు మీ లోపలి నేర్చుకొనే తత్వాన్ని సదా కొనసాగించు కోవాలి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలే వినియోగదారుల సంఖ్య ఒక మిలియన్ స్థాయి ని మించిపోయిన ఐజిఒటి ఆన్ లైన్ పోర్టల్ ను గురించి కూడా ఆయన ప్రస్తావించి, ఆ ఆన్ లైన్ పోర్టల్ లో అందుబాటు లో ఉన్న పాఠ్యక్రమాల సంపూర్ణ ప్రయోజనాన్ని స్వీకరించండంటూ వారి కి విజ్ఞప్తి ని చేశారు. ‘‘ ‘అమృత కాలం’లో రాబోయే 25 సంవత్సరాల యాత్ర లో అభివృద్ధి చెందిన భారతదేశం తాలూకు దార్శనికత ను సాకారం చేసే దిశ లో మనం అందరం కలసికట్టు గా ముందంజ వేద్దాం.. రండి’’ అని పిలుపునిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
పూర్వరంగం
ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చే విషయం లో ప్రధాన మంత్రి యొక్క వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక ముందడుగు గా ఉంది. ఉద్యోగాల కల్పన ను రోజ్ గార్ మేళా పెంపొందింప జేస్తుంది అనే ఆశ ఉంది. దీనితో పాటు యువతీ యువకుల కు సాధికారిత కల్పన లో మరియు దేశాభివృద్ధి లో పాలుపంచుకొనే అవకాశాల ను వారికి అందించడం లో రోజ్ గార్ మేళా ఒక ఉత్ప్రేరకం వలె ఉండగలదన్న భావన కూడా ఉన్నది.
క్రొత్త గా ఉద్యోగాల లో నియామకం జరిగిన వారు ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా వారంతట వారు గా శిక్షణ ను పొందే అవకాశాన్ని దక్కించుకొంటున్నారు. ‘కర్మయోగి ప్రారంభ్’ అనేది ప్రభుత్వం లో వేరు వేరు విభాగాల లో క్రొత్త గా నియామకం జరిగిన వారి కి ఉద్దేశించిన ఆన్ లైన్ మాడ్యూల్. ఇది ఐజిఒటి కర్మయోగి (iGOT Karmayogi) పోర్టల్ లో లభ్యం అవుతుంది. దీనిలో భాగం గా 400 కు పైచిలుకు ఇ-లర్నింగ్ పాఠ్యక్రమాల ను ‘ఎక్కడయినా ఏ డివైస్ నుండి అయినా’ నేర్చుకొనే విధం గా అందుబాటు లో కి తీసుకు రావడమైంది.
***
DS/TS
(Release ID: 1932079)
Visitor Counter : 161
Read this release in:
Bengali
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam