ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జపాన్ కు చెందిన ప్రముఖులతో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 20 MAY 2023 12:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ కు చెందిన పలువురు ప్రముఖులను, హిరోషిమాలో జరుగుతున్న జి–7 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా కలుసుకున్నారు. ప్రధానమంత్రి కలుసుకున్న వారిలో డాక్టర్ తొమియో మిజోకమి, శ్రీమతి హిరోకో తకయామ తదితరులు ఉన్నారు. వారు తమ తమ రంగాలలో అద్భుత కృషి చేశారు.

డాక్టర్ తొమియో మిజొకమి, ఒసాకా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఫారిన్ స్టడీస్లో ప్రొఫెసర్ ఎమిరటస్ గా ఉ న్నారు. వారు ప్రముఖ రచయితే కాకుండా భాషా శాస్త్రవేత్త, హిందీ, పంజాబీ భాషలలో వారు నిపుణులు.  2018లో వారికి, పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జపాన్లో భారతీయ సాహిత్యం , సంస్కృతిని విశేషంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు వారిని ఈ పురస్కారంతో గౌరవించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన జ్వాలాముఖి  గ్రంథాన్ని బహుకరించారు. జపాన్లో హిందీ భాష నేర్చుకోవడానికి పునాది వేసిన ఎందరో రచయితల రచనలు 1980 నుంచి ఇందులో ఉన్నాయి.

శ్రీమతి హిరొకొ తకయామా, హిరోషిమాలో జన్మించిన పశ్చిమ దేశాల తరహా పెయింటింగ్ కళాకారిణి.ఆమెకు రెండు దశాబ్దాలకు పైగా  భారత్తో మంచి అనుబంధం ఉంది. అమె ఇండియాలో ఎన్నో ఎగ్జిబిషన్లు, వర్క్షాప్లు నిర్వహించారు. శాంతినికేతన్ లోని విశ్వభారతీ విశ్వవిద్యాలయానికి ఆమె విజిటింగ్ ప్రొఫెసర్గా వస్తుంటారు. ఆమె ఈ సందర్బంగా ప్రధానమంత్రికి తన ఆయిల్ పెయింటింగ్ ఆఫ్ లార్డ్ బుద్ధను బహుకరించారు. దీనిని ఆమె 2022 లో రూపొందించారు. ఇటువంటి సమాలోచనలు పరస్పర అవగాహనను మరింతగా పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయని ప్రధానమంత్రి అన్నారు. పరస్పర గౌరవానికి, ఇరుదేశాలమధ్య బలమైన బంధానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఇండియా– జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక బంధం మరింత బలపడడానికి, అంతర్జాతీయ భాగస్వామ్య సంబంధాలు బలపడడానికి ఇలాంటి మరిన్ని సమావేశాల నిర్వహణకు గల అవకాశాల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.

 

***

 




(Release ID: 1926206) Visitor Counter : 125