ప్రధాన మంత్రి కార్యాలయం

జాపాన్ ను, పాపువా న్యూ గినీ ని మరియు ఆస్ట్రేలియా ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

Posted On: 16 MAY 2023 5:00PM by PIB Hyderabad

జాపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియొ ఆహ్వానించిన మీదట జాపాన్ అధ్యక్షత న జరుగనున్న జి-7 సమిట్ లో పాలుపంచుకొనేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2023వ సంవత్సరం లో మే నెల 19వ తేదీ మొదలుకొని 21వ తేదీ ల మధ్య జాపాన్ లోని హిరోశిమా ను సందర్శించనున్నారు. శిఖర సమ్మేళనం లో ప్రధాన మంత్రి పాల్గొని శాంతి, స్థిరత్వం మరియు సతత భూ గ్రహం సమృద్ధి అంశాల పైన; ఆహారం, ఎరువు మరియు శక్తి సంబంధి భద్రత; ఆరోగ్యం; మహిళలు పురుషుల సమానత్వం, జలవాయు పరివర్తన మరియు పర్యావరణం; రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లతో పాటు గా అభి మృద్ధిపరంగా సహకారం అనే అంశాల పైన భాగస్వామ్య దేశాల తో మాట్లాడనున్నారు.



ప్రధాని శ్రీ కిశిదా ఫుమియొ తో ప్రధాన మంత్రి ద్వైపాక్షిక సమావేశం లో పాల్గొననున్నారు. శిఖర సమ్మేళనం సందర్భం లోనే ఆ సమ్మేళనం లో పాలుపంచుకొనే ఇతర నేతల లో కొందరి తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.


ప్రధాన మంత్రి అటు తరువాత పాపువా న్యూ గినీ లోని పోర్ట్ మోర్స్ బీ కి వెళ్తారు. అక్కడ ఆయన ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి III సమిట్) తాలూకు మూడో శిఖర సమ్మేళనానికి పాపువా న్యూ గినీ యొక్క ప్రధాని తో కలసి సంయుక్త ఆతిథేయి గా వ్యవహరిస్తారు. 2014వ సంవత్సరం లో మొదలుపెట్టినటువంటి ఎఫ్ఐపిఐసి లో భారతదేశం మరియు 14 పసిఫిక్ ఐలండ్ స్టేట్స్ (పిఐసిస్) లకు ప్రమేయం ఉంది. ఆ పద్నాలుగు పసిఫిక్ ఐలండ్ స్టేట్స్ ఏవేవి అంటే వాటి లో కుక్ ఐలండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేశియా, ఫిజీ, కిరిబాతీ, నావురు, నీయూ, పలావు, పాపువా న్యూ గినీ, రిపబ్లిక్ ఆఫ్ మార్శల్ ఐలండ్స్, సమోవా, సోలొమన్ ఐలండ్స్, టోంగా, తువాలు మరియు వానువతు లు ఉన్నాయి.


ప్రధాన మంత్రి పాపువా న్యూ గినీ లో అనేక ద్వైపాక్షిక చర్చ ల లో పాలుపంచుకోనున్నారు గవర్నర్ జనరల్ సర్ శ్రీ బాబ్ డాదే తో మరియు ప్రధాని శ్రీ జేమ్స్ మారప్ తో విడివిడి గా ఆయన మాట్లాడుతారు. భారతదేశం ప్రధాన మంత్రి పాపువా న్యూ గినీ ని సందర్శించనుండడం ఇది మొదటి సారి.

 

తదనంతరం, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22వ తేదీ నుండి 24వ తేదీ మధ్య ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీస్ ఆహ్వానించినందున ఆస్ట్రేలియా లోని సిడ్ నీ ని సందర్శించనున్నారు. క్వాడ్ లీడర్స్ సమిట్ లో ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు. ప్రధాన మంత్రి తో పాటు యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ జూనియర్, జాపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియొ లు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ శిఖర సమ్మేళనం ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఘటన క్రమాలపై నేత లు వారి అభిప్రాయాల ను వెల్లడించడం తో పాటు గా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, దాపరికానికి తావు లేనటువంటి మరియు అన్ని వర్గాల కు ప్రాతినిధ్యం ఉండేటటువంటి ఇండో-పసిఫిక్ కు సంబంధించిన వారి దృష్టికోణాల ను వెల్లడి చేస్తారు.

 

ప్రధాన మంత్రి తన సందర్శన లో భాగం గా, ప్రధాని శ్రీ అల్బనీస్ తో 2023 మే నెల 24వ తేదీ నాడు ఒక ద్వైపాక్షిక సమావేశం లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా కు చెందిన సిఇఒ లతో మరియు వ్యాపార రంగ ప్రముఖుల తో భేటీ అవుతారు. అంతేకాకుండా అక్కడ ఉంటున్న భారతీయ సముదాయం 2023 మే నెల 23 వ తేదీ నాడు ఏర్పాటు చేసే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

***



(Release ID: 1925244) Visitor Counter : 91