ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాశీ విశ్వనాథ క్షేత్రం.. బిహు వేడుకలపై పౌరుల వ్యాఖ్యలకు ప్రధానమంత్రి స్పందన

प्रविष्टि तिथि: 16 APR 2023 10:04AM by PIB Hyderabad

   కాశీ విశ్వనాథ క్షేత్రం నుంచి బిహు పర్వదిన వేడుకలదాకా పలు అంశాలపై పౌరుల వ్యాఖ్యలమీద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు.

ఈ మేరకు కాశీ విశ్వనాథ క్షేత్రానికి తన తండ్రిని తీసుకెళ్లే అవకాశం లభించడంపై ఒక పౌరుని ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:

 “అద్భుతం” అని ప్రధాని పేర్కొన్నారు.

   అలాగే అస్సాంలో బిహు పండుగ వేడుకలపై కొద్దిరోజుల కిందట ఒక పౌరుడి ట్వీట్‌కు జవాబిస్తూ పంపిన సందేశంలో:

“అవును... ఘనంగా జరిగిన ఈ వేడుకలను నేనెన్నటికీ మరువలేను. ఆ కార్యక్రమంతోపాటు పర్వదిన ఉత్సవాలపై ఇవిగో మరికొన్ని చిత్రాలు” అంటూ ప్రధానమంత్రి కొన్ని దృశ్యాలను ప్రజలతో పంచుకున్నారు.


(रिलीज़ आईडी: 1917147) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam