ప్రధాన మంత్రి కార్యాలయం
సౌరాష్ట్ర తమిళ్ సంగమంతో సానుకూల వాతావరణ సృష్టి: ప్రధానమంత్రి
Posted On:
15 APR 2023 10:09AM by PIB Hyderabad
సౌరాష్ట్ర తమిళ సంగమం వేడుకల కోసం తమిళనాడులోని మదురై నుంచి ప్రత్యేక రైలులో బయల్దేరిన తొలి బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:
“పుత్తాండు ప్రత్యేక పర్వదినం నేపథ్యంలో మదురై నుంచి వెరావల్‌కు ఒక ప్రత్యేక ప్రయాణం ప్రారంభమైంది. ఈ దిశగా విశిష్ట సౌరాష్ట్ర-తమిళ సంగమం #STSangamam వంటి వేడుక అత్యంత సానుకూల వాతావరణం సృష్టించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అలాగే మరొక ట్వీట్‌లో ఈ ఉత్తేజపూరిత, ఉత్సాహభరిత వాతావరణం ప్రశంసనీయమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సౌరాష్ట్ర తమిళ సంగమం వేడుకల వాతావరణం నడుమ అక్కడికి ప్రయాణం గురించి ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“అద్భుతం! సౌరాష్ట్ర-తమిళ సంగమం #STSangamamపై ఉత్సాహం అంతకంతకూ ఇనుమడిస్తోంది” అని హర్షం వ్యక్తం చేశారు.
(Release ID: 1917068)
Visitor Counter : 169
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam