ప్రధాన మంత్రి కార్యాలయం

ఆంధ్ర ప్రదేశ్ లోని ఎఐఐఎమ్ఎస్ మంగళగిరి యొక్క కార్యసాధన ను గుర్తించిన ప్రధాన మంత్రి

Posted On: 05 APR 2023 11:13AM by PIB Hyderabad

 

ఆంధ్ర ప్రదేశ్ లోని ఎఐఐఎమ్ఎస్ మంగళగిరి 10 లక్షల మంది కి పైచిలుకు అవుట్ పేషెంట్ లకు సూచనల ను ఇచ్చినటువంటి గొప్ప కార్యాన్ని సాధించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాల లో భాగం గా ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం లో ఒక డాక్టరు తోను, టెలి-కన్సల్టేశన్స్ ద్వారా లబ్ధి ని పొందినటువంటి ఒక వ్యక్తి తోను ఇదే అంశాన్ని గురించి తాను మాట్లాడిన సంగతి ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో తెలియ జేశారు.

 

 

ఆంధ్ర ప్రదేశ్ లోని ఎఐఐఎమ్ఎస్ మంగళగిరి 10 లక్షల మంది అవుట్ పేషెంట్ ల కన్సల్టేశన్స్ ను పూర్తి చేయడాన్ని గురించి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

 

‘‘ఈ సంస్థ సాధించినటువంటి ఒక మంచి కార్యసిద్ధి ఇది. ఇటీవల #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమాల పరంపర లో భాగం గా ఇటీవల జరిగిన ఒక ‘మనసు లో మాట’ కార్యక్రమం లో నేను ఇదే అంశాన్ని చర్చించాను. అంతేకాకుండా ఒక డాక్టరు తో మరియు టెలి-కన్సల్టేశన్స్ ద్వారా లబ్ధి ని పొందినటువంటి ఒక వ్యక్తి తో నేను జరిపిన సంభాషణ ను గురించి కూడా ఆ కార్యక్రమం లో ప్రస్తావించాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/ST



(Release ID: 1913749) Visitor Counter : 171