ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం నౌకాదళం కోసం తదుపరి తరం ఆఫ్శోర్ పట్రోల్ వెసల్స్ పదకొండిటి ని మరియు తదుపరి తరానికి చెందిన మిసైల్ వెసల్స్ఆరింటి ని సేకరించడాని కి గాను ఇండియన్ శిప్ యార్డ్ లతో కలసి 19,600 కోట్ల రూపాయలవిలువైన ఒప్పందాల పై సంతకాలు చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ


ఇది భారతదేశ నౌకాదళాన్ని బలోపేతంచేయడం తో పాటు ఆత్మనిర్భరత ను సాధించాలన్న మన లక్ష్యాన్ని సాధించడాని కి కూడాను  అండదండల ను అందిస్తుందన్న ప్రధాన  మంత్రి

Posted On: 31 MAR 2023 9:11AM by PIB Hyderabad

భారతదేశం నౌకాదళం కోసం తదుపరి తరాని కి చెందినటువంటి ఆఫ్ శోర్ పట్రోల్ వెసల్స్ పదకొండిటి తో పాటు తదుపరి తరానికి చెందిన మిసైల్ వెసల్స్ ఆరింటి ని సేకరించడానికి గాను దాదాపు గా 19,600 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో కూడిన ఒప్పంద పత్రాల పైన 2023 మార్చి నెల 30వ తేదీ నాడు ఇండియన్ శిప్ యార్డు లతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ సంతకాలు చేసింది అంటూ రక్షణ మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది.

ఆర్ఎమ్ఒ ఇండియా చేసిన ట్వీట్ కు, ప్రధాన మంత్రి జవాబిస్తూ -

‘‘ఇది భారతదేశం నౌకా దళాన్ని బలోపేతం చేయడం తో పాటు ఆత్మనిర్భరత ను సాధించాలి అనేటటువంటి మన లక్ష్యాని కి అండదండల ను కూడా అందిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

*****

DS/ST(Release ID: 1912496) Visitor Counter : 157