ప్రధాన మంత్రి కార్యాలయం

బెంగళూరు కు చెందిన హృదయ వ్యాధి నిపుణుడుమరియు అతడి పుత్రుడు లు నడుం కట్టిన రీసైకిలింగ్ ప్రయాసల ను ప్రశంసించిన ప్రధానమంత్రి

Posted On: 07 MAR 2023 2:15PM by PIB Hyderabad

బెంగళూరు లోని సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీ దీపక్ కృష్ణమూర్తి మరియు అతని కుమారుడు లు రీసైకిలింగ్ మరియు ‘వ్యర్థం నుండి సంపద’ ను సృష్టించే విషయం లో జాగరూకత ను వ్యాప్తి చేయడం కోసం నడుంకట్టి చేసినటువంటి ప్రయాసల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను వ్యక్తం చేశారు.

రీసైకిలింగ్, ఇంకా ‘వ్యర్థాల నుండి సంపద’ ను సృష్టించే విషయం లో మరింత అధికమైన అవగాహన ను ఏర్పరచేటటువంటి ఈ విధమైన ప్రయాసల ను వెల్లడించవలసింది గా ఇతరుల కు కూడా శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

ప్రతి విద్యా సంవత్సరం ముగింపు లో తన కుమారుడు అమితంగా శ్రమించి అతడి నోట్ బుక్స్ లో ఉపయోగించని ఖాళీ కాగితాల ను బయటకు తీస్తాడని, మరి తానేమో వాటిని సేకరించి తన చిత్తు పనుల కోసం మరియు ప్రాక్టీసు కోసం ఉపయోగిస్తున్నానని వైద్యుడు తెలియ జేశారు.

సదరు వైద్యుడి యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ -

‘‘ఇది ఒక చక్కటి బృంద ప్రయాస, దీని లో మన స్థిర జీవనాని కి ఒక పెద్ద సందేశం ఇమిడివుంది. మీకు మరియు మీ కుమారుని కి ఇవే అభినందన లు.

రీసైకిలింగ్ మరియు వ్యర్థాల నుండి సంపద ను సృష్టించే దిశ లో మరింత అధికమైన అవగాహన ను ఏర్పరచే ఇదే తరహా ప్రయాసల ను గురించి వెల్లడించండి అంటూ ఇతరుల కు సైతం నేను విజ్ఞప్తి చేస్తాను.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 



(Release ID: 1904876) Visitor Counter : 157