ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిబ్రవరి 12వ తేదీన రాజస్తాన్, 13వ తేదీన కర్ణాటకలో పర్యటించనున్న ప్రధానమంత్రి
రాజస్తాన్ లోని దౌసాలో రూ.18,100 కోట్లకు పైబడిన విలువ గల రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి ఢిల్లీ ముంబై ఎక్స్ ప్రెస్ వేలో ఢిల్లీ-దౌసా-లాల్ సాట్ సెక్షన్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి; ఢిల్లీ నుంచి జైపూర్ కి ప్రయాణ దూరం 5 గంటల నుంచి 3.5 గంటలకు తగ్గుదల బెంగళూరులో 2023 ఏరో ఇండియా 14వ ప్రదర్శనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి ఏరో ఇండియా 2023లో దేశీయ పరికరాలు/టెక్నాలజీల ప్రదర్శన; పిఎం ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్’ విజన్ కు అనుగుణంగా విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు
Posted On:
11 FEB 2023 10:14AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 12వ తేదీన రాజస్తాన్, 13వ తేదీన కర్ణాటక సందర్శిస్తారు.
ఫిబ్రవరి 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయానికి ప్రధానమంత్రి దౌసా చేరుకుని రూ.18,100 కోట్లకు పై బడిన జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభిస్తారు.
ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని యెలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా 2023 ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు.
దౌసాలో ప్రధానమంత్రి
నవ భారతంలో అద్భుతమైన మౌలిక వసతుల నిర్మాణాన్ని వృద్ధి, అభివృద్ధి, కనెక్టివిటీకి చోదకశక్తిగా ప్రధానమంత్రి పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా ప్రపంచ శ్రేణి ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం ద్వారా దాన్ని సాకారం చేస్తున్నారు. అలాంటి ప్రాజెక్టుల్లో ఒకటి ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే. ఇందులో ఇప్పటివరకు పూర్తయిన ఢిల్లీ-దౌసా-లాల్ సాట్ సెక్షన్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో ఢిల్లీ-దౌసా-లాల్ సాట్ సెక్షన్ ను రూ.12,150 కోట్లతో నిర్మించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సెక్షన్ కారణంగా ఢిల్లీ-జైపూర్ మధ్య ప్రయాణ దూరం 5 గంటల నుంచి 3.5 గంటలకు తగ్గుతుంది. మొత్తం ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఉత్తేజం ఇస్తుంది.
1386 కిలోమీటర్ల నిడివి గల ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే దేశంలోనే అతి పొడవైన ఎక్స్ ప్రెస్ వే. దీని వల్ల ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ దూరం 1424 కిలోమీటర్ల నుంచి 1242 కిలోమీటర్లకు అంటే 12 శాతం మేరకు తగ్గుతుంది. ప్రయాణ దూరం 50% అంటే 24 గంటల నుంచి 12 గంటలకు తగ్గుతుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే ఆరు రాష్ర్టాలు -ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ర్ట- మీదుగా సాగుతుంది. కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదర, సూరత్ నగరాలను అనుసంధానం చేస్తుంది. అలాగే 93 పిఎం గతిశక్తి ఆర్థిక కేంద్రాలు, 13 పోర్టులు, 8 ప్రధాన విమానాశ్రయాలు, 8 బహుళ నమూనా లాజిస్టిక్ పార్కులు (ఎంఎంఎల్ పి), కొత్తగా నిర్మిస్తున్న జెవార్ విమానాశ్రయం, నవీ ముంబై విమానాశ్రయాలు, జెఎన్ పిటి పోర్టులను కలుపుతుంది. సమీప ప్రాంతాల అభివృద్ధిపై కూడా ఈ ఎక్స్ ప్రెస్ వే ప్రభావం ఉంటుంది. తద్వారా దేశ ఆర్థిక పరివర్తనను వేగవంతం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా రూ.5940 కోట్ల పైబడిన వ్యయంతో నిర్మించతలపెట్టిన 247 కిలోమీటర్ల నిడివి గల జాతీయరహదారి ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ.2000 కోట్ల పైబడిన వ్యయంతో బందిక్యూ-జైపూర్ 67 కిలోమీటర్ల నిడివి గల నాలుగు లేనర్ల స్పర్ రోడ్డు; రూ.3775 కోట్ల వ్యయంతో కోట్ పుట్లి-బరావోదనియో ఆరు లేన్ల స్పర్ రోడ్డు; రూ.150 కోట్లతో నిర్మించనున్న రెండు లేన్ల లాల్ సాట్-కరోలీ సెక్షన్ ఇందులో ఉన్నాయి.
బెంగళూరులో ప్రధానమంత్రి
బెంగళూరులోని యెలహంక వైమానిక స్థావరంలో 2023 ఏరో ఇండియా 14వ ప్రదర్శనను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఏరో ఇండియా 2023 ప్రధాన థీమ్ ‘‘బిలియన్ అవకాశాలకు రన్ వే’’.
ప్రధానమంత్రి ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్’ విజన్ కు విజన్ కు దీటుగా ఈ కార్యక్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన పరికరాలు/టెక్నాలజీలను ప్రదర్శించడంతో పాటు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటారు. భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు ప్రధానమంత్రి కల్పిస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా డిజైన్ లీడర్ షిప్, యుఏవి విభాగంలో వృద్ధి; రక్షణ, భవిష్యత్ టెక్నాలజీల విభాగంలో దేశ పురోగతిని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తుంది. తేలిక రకం యుద్ధ విమానం (ఎసిఏ) – తేజస్, హెచ్ టిటి-40, డోర్నియెర్ లైట్ యుటిలిటీ హెలీకాప్టర్ (ఎల్ యుహెచ్), తేలిక రకం యుద్ధ హెలీకాప్టర్ (ఎల్ సిహెచ్), అడ్వాన్స్ డ్ లైట్ హెలీకాప్టర్ (ఎఎల్ హెచ్) ఎగుమతుల వృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది. అలాగే దేశీయ ఎంఎస్ఎంఇలు, స్టార్టప్ లను ప్రపంచ సరఫరా వ్యవస్థతో అనుసంధానం చేయడానికి, వివిధ పరికరాలను ఉమ్మడిగా అభివృద్ధి, ఉమ్మడిగా ఉత్పత్తి చేయడంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు వేదిక అవుతుంది.
ఏరో ఇండియా 2023లో 80కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. 30 దేశాల మంత్రులు, 65 ప్రపంచ దేశీయ ఒఇఎంల సిఇఓలు ఏరో ఇండియా 2023లో పాల్గొంటున్నారు.
ఏరో ఇండియా 2023 ప్రదర్శనలో 800 పైగా రక్షణ రంగ కంపెనీలు పాల్గొంటున్నాయి. వాటిలో 100 విదేశీ, 700 దేశీయ కంపెనీలున్నాయి. ప్రదర్శనలో పాల్గొంటున్న భారత కంపెనీల్లో ఎంఎస్ఎంఇలు, స్టార్టప్ లు కూడా ఉన్నాయి. అవి ప్రధాన టెక్నాలజీల రంగంలో దేశం సాధించిన పురోగతి, దేశంలో ఏరోస్పేస్, రక్షణ సామర్థ్యాల్లో పురోగతికి కూడా ప్రదర్శన దర్పణం పడుతుంది. ఏరో ఇండియా 2023లో ప్రదర్శనకు వచ్చిన కంపెనీల్లో ఎయిర్ బస్, బోయింగ్, దాసో ఏవియేషన్, లాక్ హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ పరిశ్రమ, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్ సి రోబోటిక్స్, ఎస్ఏఏబి, సఫ్రాన్, రోల్స్ రాయిస్, లార్సెన్ అండ్ టూబ్రో, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్), బిఇఎంఎల్ ఉన్నాయి.
***
(Release ID: 1898680)
|