ప్రధాన మంత్రి కార్యాలయం
మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు సాగే వేడుకలకు ఫిబ్రవరి 12న ప్రధాని శ్రీకారం
సాంఘిక అసమానతలను రూపుమాపేందుకు 1875లో
ఆర్య సమాజ్‌ను స్థాపించిన సంఘ సంస్కర్త మహర్షి దయానంద;
దేశంలో సామాజిక-సాంస్కృతిక చైతన్యం రగిల్చిన ఆర్యసమాజ్;
అఖిలభారత స్థాయిలో తమ సేవలకు నేటికీ తగిన గుర్తింపు దక్కని
సంఘ సంస్కర్తలు.. విశిష్ట వ్యక్తులకు సముచిత గౌరవమర్యాదలు
కల్పించడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది
Posted On:
11 FEB 2023 10:40AM by PIB Hyderabad
మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు సాగే వేడుకలను 2023 ఫిబ్రవరి 12న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించి, ప్రసంగిస్తారు. సంఘ సంస్కర్త మహర్షి దయానంద సరస్వతి 1824 ఫిబ్రవరి 12న జన్మించారు. ఆనాటి సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఆయన 1875లో ఆర్యసమాజ్‌ను ఏర్పాటు చేసి విశేషంగా కృషి చేశారు. ఈ మేరకు విద్యకు, సాంఘిక సంస్కరణలకు ప్రాధాన్యమిస్తూ దేశంలో సామాజిక-సాంస్కృతిక చైతన్యం తేవడంలో ఆర్యసమాజ్ కీలక పాత్ర పోషించింది.
అఖిలభారత స్థాయిలో తమ సేవలకు నేటికీ తగిన గుర్తింపు దక్కని... ప్రతేకించి సంఘ సంస్కర్తలు, విశిష్ట వ్యక్తులకు సముచిత గౌరవమర్యాదలు కల్పించడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించింది. అలాగే శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా ప్రధాని పాల్గొన్నారు. ఆ విధంగా ఆదినుంచీ ఆయన ఇటువంటి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు.
***
(Release ID: 1898459)
Visitor Counter : 206
Read this release in:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam