ప్రధాన మంత్రి కార్యాలయం

హాకీ ప్రపంచ కప్-2023 నేపథ్యంలో అన్ని దేశాల జట్లకూ ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 11 JAN 2023 6:35PM by PIB Hyderabad

   డిషాలో హాకీ ప్రపంచ కప్‌-2023 పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని దేశాల జట్లకూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

   “ఒడిషాలో హాకీ ప్రపంచ కప్-2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో పాల్గొనే జట్లన్నిటికీ నా శుభాకాంక్షలు. ఈ టోర్నమెంటు క్రీడా స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని, చూడచక్కని హాకీ క్రీడకు ఇది మరింత ప్రాచుర్యం తేవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పోటీలను నిర్వహిస్తుండటంపై భారతదేశం ఎంతో గర్విస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1890593) Visitor Counter : 147