ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ 150 వజయంతి ఉత్సవం సందర్భంగా వీడియో ద్వారా సందేశమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


“ అపరిగ్రహం అంటే త్యజించడమే కాదు, అన్ని రకాల బంధాలను నియంత్రించడం’’

శాంతి విగ్రహం, ఐక్యతా విగ్రహం అనేవి కేవలం భారీ విగ్రహాలు కాదు, అవి ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ కు గొప్ప చిహ్నాలు, ‘‘ఏ దేశపు శ్రేయస్సు అయినా ఆదేశ ఆర్థిక సుసంపన్నతపైన,దేశీయ ఉత్పత్తులను ఆదరించడంపైన, దేశ, కళలు, సంస్కృతి నాగరికతలను సజీవంగా ఉంచడంపైన ఆధారపడి ఉంటుంది.’’

“ఆజాదీ కా అమృత్ కాల్లో స్వదేశీ, స్వావలంబన అనేవి అత్యంత అనువైనవి’’

“ఆజాదీ కా అమృత్ కాల్, మనం అభివృద్ధి చెందిన భారత్ దిశగా ముందుకు వెళుతున్నాం’’

‘‘పౌర బాధ్యతల సాధికారతలో మహాపురుషుల మార్గనిర్దేశం ఎల్లప్పుడూ ముఖ్యమైనది’’

Posted On: 26 OCT 2022 7:41PM by PIB Hyderabad

శ్రీ విజయ్ వల్లభ్ సురేశ్వర్ జీ 150 వ జయంతి సందర్భ:గా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరైన వారని ఉద్దేశించి వీడియో ద్వారా ప్రసంగించారు. భారతదేశంలో సాధు సంప్రదయాన్ని ముందుకు తీసుకుపోతున్న వారికి, ప్రపంచవ్యాప్తంగా జైన విశ్వాసాన్ని అనుసరిస్తున్న వారికి శిరసు వంచి నమస్కరించారు. ఎంతో మంది సాధువుల మధ్య ఈ సమావేశంలో పాల్గోని వారి ఆశీస్సులు పొందే అవకాశం వచ్చినందుకు ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తాను గుజరాత్ లో ఉన్నప్పుడు వడోదర, ఛోటా ఉదయ్పూర్లోని కన్వత్ గ్రామంలో సంత్ వాణి వినేందుకు అవకాశం వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆచార్య శ్రీ విజయ్ వల్లబ్ సురీశ్వర్ జీ 150 వ జయంతి వార్షికోత్సవాల ప్రారంభాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి, ఆచార్య జీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు కలిగినట్టు చెప్పారు. “ఇవాళ మరోసారి నేను సాంకేతికత సహాయంతో మీ మధ్య ఉన్నాను” అని ప్రధానమంత్రి అన్నారు.

ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ స్మారక తపాలా బిళ్లను, నాణాన్ని విడుదల చేసుకున్నామని, ఇది ప్రజలను ఆచార్య శ్రీ విజయ్ వల్లబ్ సురీశ్వర్ మహరాజ్ ఆథ్యాత్మిక చైతన్యాన్ని, ఆయన జీవన తాత్వికతను ప్రజలతో అనుసంధానం చేసేందుకు ఇది దోహదపడుతుందని ప్రధానమంత్రి అన్నారు.

గత రెండు సంత్సరాలుగా జరుగుతున్న ఉత్సవాలు ముగింపునకు వచ్చాయని,ఈ సందర్భంగా ఈ విశ్వాసం , ఆథ్యాత్మికత, దేశభక్తి, జాతీయ శక్తిని పెంపొందించేందుకు సాగిన ప్రచారం అద్భుతమని ప్రధానమంత్రి కొనియాడారు.

ప్రపంచంలోని ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను గుర్తుచేస్తూ ప్రధానమంత్రి,“ ఇవాళ ప్రపంచం యుద్ధ సంక్షోభాన్ని , ఉగ్రవాదం, హింసను ఎదుర్కొంటున్నది. ఈ విషవలయాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తగిన ప్రేరణ, ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నది” అని ఆయన అన్నారు.

 ఇలాంటి పరిస్థితులలో భారతీయ ప్రాచీన సం ప్రదాయాలు, తాత్వికత,ఇవాల్టి భారతదేశపు శక్తి ప్రపంచానికి కొత్త ఆశను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ చూపిన మార్గం, జైన గురువుల ప్రబోధాలు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారాలని ప్రధానమమంత్రి అన్నారు.

 “ ఆచార్యుల వారు అహింసాయుత , “ఆచార్య జీ అహింసాయుత, ఏకాంత,సర్వత్యాగమయ జీవితాన్ని అనుసరించడంతోపాటు ఈ భావనలపట్ల ప్రజలలోఓ విశ్వాసాన్ని పెంచేందుకు వారు నిరంతరం కృషి చేయడం మనందరికీ స్ఫూర్తి దాయకం ” అని ప్రధానమంత్రి అన్నారు.

 దేశవిభజన సమయంలో జరిగిన దారుణాల సందర్భంగానూ ఆచార్యులవారు శాంతి, సామరస్యం ప్రాధాన్యత గురించి పదే పదే నొక్కి చెప్పారని ప్రధానమంత్రి అన్నారు. దీనితో ఆచార్యుల వారు చాతుర్మాస దీక్షకు విరామం ప్రకటించాల్సి వచ్చిందన్నారు. మహాత్మాగాంధీ సైతం స్వాతంత్రోద్యమ సమయంలో

ఆచార్యులవారు సూచించిన అపరిగ్రహ మార్గాన్ని అనుసరించారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అపరిగ్రహ అనేది త్యజించడం మాత్రమే కాదని, అన్ని రకాల బంధాలను నియంత్రించడమని ఆయన అన్నారు.

 జైనాచార్య శ్రీ విజయ నిత్యానంద సురీశ్వర జీ ప్రస్తావించినట్టు, గుజరాత్ దేశానికి ఇద్దరు వల్లభ్లను అందించిందని ప్రధానమంత్రి అన్నారు. ఇవాళ ఆచర్యుల వారి 150 వ జయంతి ఉత్సవాలు పూర్తి అవుతున్నాయి. మరి కొద్ది రోజులలో మనం సర్దార్ పటేల్ గారి జయంతి ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోబోతున్నాం అని ఆయన అన్నారు. శాంతి విగ్రహం సాధువుల విగ్రహాలలో అతిపెద్దదని, ఐక్యతా విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదని ప్రధానమంత్రి అన్నారు. ఇవి కేవలం పెద్ద విగ్రహాలు మాత్రమే కాదని, ఇవి ఏక్ భారత్ , శ్రేష్ఠ్ భారత్కు గొప్ప చిహ్నాలని ప్రధానమంత్రి అన్నారు.

ఇద్దరు వల్లభ్ల సేవలను గురించి ప్రస్తావిస్తూ ప్రధానంత్రి, సర్దార్ సాహెబ్ వివిధ సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారత్ ను ఏకం చేశారని అన్నారు. అలాగే ఆచార్యులవారు దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి భారత సంస్కృతి, ఐక్యత, సమగ్రతలను సుసంపన్నం చేశారని ప్రధానమంత్రి అన్నారు.

మన సంప్రదాయాలు, దేశీయ ఉత్పత్తులను ఏకకాలంలో ఎలా ప్రోత్సహించవచ్చో ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,ఆచార్యజీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ . “ దేశ శ్రేయస్సు దాని ఆర్థిక సుసంపన్నతపైన, దేశీయ ఉత్పత్తుల వాడకంపైన,దేశ సంస్కృతి

కళలు, నాగరికతను పరిరక్షించడంలోనూ ఆధారపడి ఉంటుంది” అని అన్నారు . ఆచార్యులవారు ఎల్లప్పుడూ తెల్లటి ఖాదీ దుస్తులే ధరించేవారని చెప్పారు. ఆజాదీకా అమృత్ కాల్లో స్వదేశీ, స్వావలంబన అనేవి ఎంతో ప్రాముఖ్యత కలిగినవని అన్నారు.

స్వావలంబిత భారతదేశం పురోగతికి ఇదే మంత్రమని ఆయన అన్నారు. అందువల్ల ఆచార్య విజయ్ వల్లభ్ సురీశ్వర్జి నుంచి ప్రస్తుత ఆచార్య శ్రీ నిత్యానంద సురీశ్వర్ జి వరకు ఈ మార్గాన్ని బలోపేతం చేశారని, మనం దీనిని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపుని చ్ఛా రు.

 

సామాజిక సంక్షేమం, మానవ సేవ, విద్య, ప్రజాచైతన్యం వంటి వాటిని ఆచార్యులు అభివృద్ధి చేశారని , సమాజ సంక్షేమానికి సంబంధించిన ఆ గొప్ప సంప్రదాయాన్ని

మరింత ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

 “ఆజాదీ కా అమృత్ కాల్ లో మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతున్నాం ’’అని ప్రధానమంత్రి అన్నారు. ఇందుకు దేశం ఐదు సంకల్పాలను చెప్పుకున్నదని ప్రధానమంత్రి అన్నారు.

మని, దీని సాధనలో సాధువుల మార్గనిర్దేశం ముందుకు తీసుకువెళుతున్నదని అన్నారు. . పౌరుల విధుల కు సంబంధించి న సాధికారతలో సాధువుల మార్గనిర్దేశం ఎన్నటికీ కీలకమైనదని ప్రధానమంత్రి అన్నారు.

వోకల్ ఫర్ లోకల్ ప్రచారంలో ఆచార్యుల పాత్రను వారు ప్రముఖంగా ప్రస్తావించారు.వారివైపు నుంచి ఇది గొప్ప సేవ అని ఆయన అన్నారు. మీలో ఎంతో మంది వ్యాపార రంగంలో ఉన్నారు. మీరు భారత్ లో తయారైన వస్తువులను మాత్రమే వ్యాపారం చేయడానికి సంకల్పం చెప్పుకోండి , ఇది మహారాజ్ సాహిబ్కుగొప్ప నివాళి అవుతుంది అని ఆయన అన్నారు. ఆచార్యశ్రీ మనకు ఈ ప్రగతి మార్గాన్ని చూపారు. మనం దీనిని భవిష్యత్తుకు కు మార్గంగా కొనసాగిద్దాం అని ప్రధానమంత్రి అన్నారు.

 



(Release ID: 1871142) Visitor Counter : 108