ప్రధాన మంత్రి కార్యాలయం
దీపావళి నాడు కార్గిల్‌లో జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
Posted On:
24 OCT 2022 2:23PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
శౌర్యానికి, ధైర్యానికి ప్రసిద్ధి చెందిన ఈ కార్గిల్ భూమికి నమస్కరించాలనే కోరిక, నా ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెల వద్దకు నన్ను పదేపదే రావడానికి ఆకర్షిస్తుంది. మీరు అందరూ నా కుటుంబం. మీ అందరి మధ్య దీపావళి మధురంగా మారుతుంది. ఇక్కడ ఉద్భవించిన దీపావళి కాంతి, వచ్చే దీపావళి వరకు నాకు మార్గనిర్దేశం చేస్తుంది. నాకు దీపావళి ఆనందం మరియు ఉత్సాహం అంటే మీతో ఉండటమే. సరిహద్దు వద్ద మీతో కలిసి దీపావళిని జరుపుకునే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఒకవైపు దేశానికి ఈ సార్వభౌమ సరిహద్దు, మరోవైపు దాని అంకితభావం కలిగిన సైనికులు ఉన్నారు! ఒకవైపు మాతృభూమిలోని అందమైన మట్టి మనకు ఉండగా, మరోవైపు ఈ మట్టిని తమ నుదుటిపై గంధపు చెక్క 'తిలకం'గా పూసే నా ధైర్యవంతులైన యువ స్నేహితులు ఉన్నారు! నా ధైర్యవంతులైన సైనికులు! నేను నా దీపావళిని ఇంతకంటే మెరుగ్గా ఎక్కడ జరుపుకోగలుగుతాను ? దీపావళి రోజున మాలాంటి పౌరుల బాణసంచా, మీ బాణసంచా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ రెండింటినీ ఎప్పటికీ పోల్చలేం!
మిత్రులారా,
ధైర్యసాహసాల కథతో పాటు, మన సంప్రదాయం దాని మాధుర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. అందువల్ల, భారతదేశం తన పండుగలను ప్రేమతో జరుపుకుంటుంది. భారతదేశం మొత్తం ప్రపంచంతో కలిసి సంబరాలు చేసుకుంటుంది. ఈ రోజు, దీపావళి సందర్భంగా దేశ ప్రజలందరికీ, ఈ విజయవంతమైన భూమి అయిన కార్గిల్ నుండి జవాన్లందరి మధ్య ప్రపంచం మొత్తానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. పాకిస్తాన్ పై ఒక్క యుద్ధం కూడా జరగలేదు, ఇందులో కార్గిల్ విజయ పతాకాన్ని ఎగురవేయలేదు. నేటి ప్రపంచ దృష్టాంతంలో, ఈ కాంతి పండుగ మొత్తం ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించాలి. భారతదేశం కోరుకునేది అదే.
మిత్రులారా,
దీపావళి అంటే ఉగ్రవాదాన్ని ఓడించిన తర్వాత జరుపుకునే వేడుక! ఇది ఉగ్రవాదం అంతం తర్వాత జరిగే వేడుక! కార్గిల్ కూడా అదే పని చేసింది. కార్గిల్ లో, మన సైన్యం ఉగ్రవాదాన్ని అణిచివేసింది, ఆ విజయంపై దేశం దీపావళిని జరుపుకున్న విధానం, ప్రజలు ఇప్పటికీ దానిని గుర్తుంచుకుంటారు. ఆ విజయానికి నేను కూడా సాక్షిగా ఉండటం నా అదృష్టం, నేను ఆ యుద్ధాన్ని కూడా దగ్గరగా చూశాను. నేను మా అధికారులకు కృతజ్ఞుడను, ఎ౦దుక౦టే నేను ఇక్కడికి వచ్చిన వె౦టనే, అనేక స౦వత్సరాల నాటి నా చిత్రాలను నాకు చూపి౦చారు. అవి నేను మీతో సమయం గడుపుతున్న చిత్రాలు. నేను ఆ చిత్రాలను చూస్తున్నప్పుడు, నేను చాలా భావోద్వేగాలతో మునిగిపోయాను. ధైర్యవంతులైన సైనికుల మధ్య నేను గడిపిన క్షణాలను నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు మీ అందరికీ నేను చాలా కృతజ్ఞుడిని. నేను మీకు నిజంగా చాలా కృతజ్ఞుడిని. కార్గిల్ యుద్ధ సమయంలో మన జవాన్లు శత్రువులకు ధీటుగా జవాబిచ్చేటప్పుడు, వారి మధ్య ఉండే అవకాశం నాకు లభించింది. ఒక సాధారణ దేశ పౌరుడిగా నా కర్తవ్యం నన్ను యుద్ధభూమికి తీసుకువచ్చింది. దేశం తన సైనికుల కోసం పంపిన సహాయ సామగ్రిని మేము తీసుకువచ్చాము. ఇది మా అందరికీ పుణ్యం. ప్రజలు దేవుని పట్ల తమ భక్తిని ప్రదర్శిస్తారు. కానీ దేశభక్తి రంగులలో చిత్రించబడిన మీలాంటి సైనికులను ఆరాధించే అవకాశం నాకు లభించింది. ఆ సమయం నుండి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, వాటిని నేను ఎప్పటికీ మరచిపోలేను. నాలుగు దిక్కుల్లోనూ విజయభేరి మోగించినట్లు అనిపించింది. ఒకే ఒక్క పిలుపు- ' मन समर्पित, तन समर्पित। और यह जीवन समर्पित। चाहता हूँ देश की धरती तुझे कुछ और भी दूं! ('అంకితభావంతో కూడిన మనస్సు, అంకితభావంతో కూడిన శరీరం, అంకితభావంతో కూడిన జీవితం. నేను మాతృభూమికి ఇంకేదైనా ఇవ్వాలనుకుంటున్నాను'!)
మిత్రులారా,
మనం ఆరాధించే దేశం అంటే మన భారతదేశం కేవలం భౌగోళిక భూమి మాత్రమే కాదు. మన భారతదేశం ఒక సజీవ అస్తిత్వం, శాశ్వతమైన ఉనికితో కూడిన శాశ్వత చైతన్యం. మనం భారతదేశం అని చెప్పినప్పుడు, ఒక శాశ్వత సంస్కృతి కి చెందిన ప్రతిబింబం మన ముందు ఉద్భవిస్తుంది; ధైర్యసాహసాల వారసత్వం మన ముందు కనిపిస్తుంది; ఒక శక్తివంతమైన శక్తి యొక్క సంప్రదాయం మన ముందు ప్రకాశిస్తుంది. ఇది ఆపలేని ప్రవాహం, ఇది ఒక వైపు శక్తివంతమైన హిమాలయాల నుండి ఉద్భవించి, మరొక వైపు హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. గత౦లో, అనంతమైన తుఫానులు విస్ఫోటన౦ చె౦దినవి, అవి ప్రప౦చ౦లోని వర్ధిల్లుతున్న నాగరికతలను నాశన౦ చేశాయి, అవి చివరికి కనుమరుగయ్యాయి. కానీ భారతదేశ ఉనికి, ఈ సాంస్కృతిక ప్రవాహం ఇప్పటికీ విచ్ఛిన్నం కానిది, శాశ్వతమైనది. ప్రియమైన నా సైనికులారా, ఒక దేశం ఎప్పుడు అమరమవుతుంది? ఒక దేశం దాని పిల్లలు మరియు దాని వీర కుమారులు, కుమార్తెలు తమ శక్తి మరియు వనరులపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు అమరత్వం పొందుతుంది. ఒక దేశం తన సైనికుల శిరస్సులు హిమాలయాల వలె శక్తివంతమైన శిఖరాలంత ఎత్తులో ఉన్నప్పుడు అమరత్వం పొందుతుంది. ఒక దేశం తన సంతానం గురించి చెప్పగలిగినప్పుడు - चलन्तु गिरयः कामं युगान्त पवनाहताः। कृच्छेरपि न चलत्येव धीराणां निश्चलं मनः॥ అంటే ప్రళయకాలపు తుఫానుల వల్ల మహా పర్వతాలు నేలకూలవచ్చు, కానీ మీలాంటి ధైర్యవంతుల మనస్సులు దృఢంగా, అచంచలంగా మరియు స్థిరంగా ఉంటాయి. అందువల్ల, మీ శక్తివంతమైన ఆయుధాలు హిమాలయాల యొక్క అధిగమించలేని ఎత్తులను సవాలు చేస్తాయి; మీ సత్ప్రవర్తనగల మనస్సు ఎడారి కష్టాలను విజయంతో పోరాడుతుంది, అనంతమైన ఆకాశం మరియు అపరిమితమైన సముద్రం మీ అనంత శౌర్యం ముందు మోకరిల్లుతాయి. కార్గిల్ యుద్ధభూమి భారత సైన్య ఈ శౌర్యానికి బలమైన సాక్షిగా మారింది. ద్రాస్, బటాలిక్ మరియు టైగర్ హిల్ భారత సైన్య ధైర్యసాహసాలు మరియు పరాక్రమం ముందు పర్వతాల శిఖరాల వద్ద కూడా శత్రువు చిన్నగా కనిపిస్తాడనే వాస్తవానికి సాక్ష్యాలు. అనంతమైన శౌర్యం కలిగిన సైనికులను కలిగి ఉన్న దేశం, దాని ఉనికి శాశ్వతంగా, అమరమైనదిగా మరియు అస్థిరంగా మారుతుంది.
మిత్రులారా,
మీరందరూ మన సరిహద్దులను కాపలా కాస్తున్నారు, మీరు దేశానికి రక్షణకు బలమైన స్తంభాలు. మీ వల్ల దేశప్రజలు దేశంలో శాంతియుతంగా జీవించగలుగుతున్నారు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. కానీ ప్రతి భారతీయుడు దేశ రక్షణ కవచానికి పూర్తి భద్రతను అందించడానికి శాయశక్తులా కృషి చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. సరిహద్దులు భద్రంగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు, సమాజం ఆత్మవిశ్వాసంతో నిండినప్పుడు మాత్రమే దేశం సురక్షితంగా ఉంటుంది. ఈ రోజు సరిహద్దుల్లో దేశం బలం గురించి మీరు వార్తలు విన్నప్పుడు, మీ ధైర్యం రెట్టింపు అవుతుంది. దేశ ప్రజలు పరిశుభ్రత మిషన్ లో చేరినప్పుడు, నిరుపేదలలో నిరుపేదలు తమ పక్కా గృహాలు, తాగునీరు, విద్యుత్తు మరియు గ్యాస్ సౌకర్యాలను రికార్డు సమయంలో పొందినప్పుడు, ప్రతి జవాను కూడా గర్వంగా భావిస్తాడు. అతను సరిహద్దులో ఉన్నప్పుడు ఈ సౌకర్యాలు తన ఇల్లు, గ్రామం లేదా నగరానికి చేరుకుంటున్నాయని తెలుసుకున్నప్పుడు అతను గర్వపడతాడు. కనెక్టివిటీ మెరుగవుతోందని మరియు ఇంటి వద్ద కాల్స్ చేయడం మరియు సెలవుల్లో ఇంటికి చేరుకోవడం సులభం అని చూసినప్పుడు అతడు సంతోషంగా ఉంటాడు.
మిత్రులారా,
నాకు తెలుసు, 7-8 సంవత్సరాలలో దేశ ఆర్థిక వ్యవస్థ 10 వ స్థానం నుండి 5 వ స్థానానికి మారినప్పుడు, మీరు కూడా నిజంగా గర్వపడతారు. ఒకవైపు మీలాంటి యువకులు సరిహద్దును జాగ్రత్తగా చూసుకుంటుంటే, మరోవైపు మీ యువ స్నేహితులు 80 వేలకు పైగా స్టార్టప్ లను సృష్టించి, సృజనాత్మకతను ఆవిష్కరిస్తున్నప్పుడు మీరు కూడా ఉప్పొంగిపోతారు. రెండు రోజుల క్రితం బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ను విస్తరించడానికి 36 ఉపగ్రహాలను కలిపి ప్రయోగించి ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. భారతదేశం అంతరిక్షంలో అటువంటి విజయాన్ని సాధించినప్పుడల్లా, నా ధైర్యవంతులైన సైనికులు గర్వంగా భావిస్తారు. కొన్ని నెలల క్రితం ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు, అక్కడ చిక్కుకున్న భారతీయులకు మన ప్రియమైన త్రివర్ణ పతాకం ఎలా రక్షణ కవచంగా మారిందో మనమందరం చూశాము. భారతదేశ కీర్తి మరియు పాత్ర నేడు ప్రపంచంలో మెరుగుపడుతోంది. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసినది.
మిత్రులారా,
భారతదేశం తన బాహ్య మరియు అంతర్గత శత్రువులకు వ్యతిరేకంగా విజయవంతంగా పోరాడుతున్నందున ఈ రోజు ఈ విషయాలు సాధ్యమయ్యాయి. ఒక వైపు మీరు సరిహద్దులో కవచంగా నిలబడితే, మరోవైపు దేశంలోని శత్రువులపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆవిర్భవించిన ఉగ్రవాదం, నక్సలిజం, తీవ్రవాదాన్ని రూపుమాపడానికి దేశం నిరంతరం విజయవంతమైన ప్రయత్నాలు చేస్తోంది. నక్సలిజం ఒకప్పుడు దేశంలోని చాలా భాగాన్ని చుట్టుముట్టింది. కానీ ఈ రోజు అది నిరంతరం కుంచించుకుపోతోంది. నేడు దేశం కూడా అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక యుద్ధం చేస్తోంది. అవినీతిపరుడు ఎంత శక్తిమంతుడైనా, అతను ఇప్పుడు తప్పించుకోలేడు. దుష్పరిపాలన చాలా కాలం పాటు దేశ సామర్థ్యాన్ని పరిమితం చేసి, మన అభివృద్ధికి అడ్డంకిగా మారింది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్' అనే మంత్రంతో, మనం గతంలోని అన్ని లోపాలను వేగంగా తొలగిస్తున్నాం. ఈ రోజు అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు వేగంగా తీసుకోబడుతున్నాయి,జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వేగంగా అమలు కూడా చేయబడుతున్నాయి.
మిత్రులారా,
వేగంగా మారుతున్న కాలంలో, సాంకేతిక పరిజ్ఞానపు ఈ యుగంలో భవిష్యత్తు యుద్ధాల స్వభావం కూడా మారబోతోంది. కొత్త యుగంలో కొత్త సవాళ్లు, కొత్త పద్ధతులు, మారుతున్న జాతీయ రక్షణ అవసరాలకు అనుగుణంగా ఈ రోజు మనం దేశం సైనిక బలాన్ని సిద్ధం చేస్తున్నాము. దశాబ్దాలుగా భావించిన, సైన్యంలో ప్రధాన సంస్కరణల ఆవశ్యకతను నేడు అమలు చేస్తున్నారు. మన దళాల మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా మరియు ప్రతి సవాలుకు వ్యతిరేకంగా మేము వేగంగా చర్యలు తీసుకోవడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి. దీనికోసం సీడీఎస్ లాంటి అత్యున్నత పదవిని ఏర్పాటు చేయడం జరిగినది . సరిహద్దులో ఆధునిక మౌలిక సదుపాయాల నెట్ వర్క్ అభివృద్ధి చేయబడుతోంది, తద్వారా మీలాంటి మా స్నేహితులు విధులను నిర్వర్తించడంలో మరింత సౌకర్యవంతంగా ఉంటారు. నేడు దేశంలో అనేక సైనిక్ పాఠశాలలు తెరవబడుతున్నాయి. సైనిక్ స్కూల్స్ లో, ఆడపిల్లల కొరకు మిలటరీ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లు తెరవబడ్డాయి మరియు నా ముందు ఇంతమంది కుమార్తెలను చూడటం నాకు గర్వంగా ఉంది. నన్ను నమ్మండి, భారత సైన్యంలో కుమార్తెల ప్రవేశంతో, మా బలం పెరుగుతుంది; మన శక్తి పెరుగుతుంది.
మిత్రులారా,
దేశ భద్రతలో అత్యంత ముఖ్యమైన అంశం 'ఆత్మనిర్భర భారతదేశం'; భారత సైన్యాలు ఆధునిక స్వదేశీ ఆయుధాలను కలిగి ఉండేలా చూసుకుంటుంది. విదేశీ ఆయుధాలు, విదేశీ వ్యవస్థలపై మనం ఆధారపడటాన్ని తగ్గించడానికి, మూడు సాయుధ దళాలు స్వావలంబన సాధిస్తామని ప్రతిజ్ఞ చేశాయి. విదేశాల నుంచి 400కు పైగా రక్షణ సామగ్రిని కొనుగోలు చేయద్దని నిర్ణయించిన మా మూడు సాయుధ దళాలను నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు ఈ 400 ఆయుధాలు భారతదేశంలోనే తయారు చేయబడతాయి, భారతదేశ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇది మరొక అతిపెద్ద ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. భారత జవాను తన దేశంలో తయారు చేసిన ఆయుధాలతో పోరాడితే అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అతని దాడిలో, శత్రువుకు ఆశ్చర్యకరమైన అంశం ఉంటుంది, అది శత్రువు మనోధైర్యాన్ని అణిచివేసేందుకు అతని ధైర్యాన్ని పెంచుతుంది. ఈ రోజు మన సేనలు ఒక వైపు మరింత ఎక్కువ 'మేడ్ ఇన్ ఇండియా' ఆయుధాల ను అవలంబిస్తుంటే, మరోవైపు సామాన్య భారతీయుడు కూడా 'వాయిస్ ఫర్ లోకల్ ' అంటూ ముందుకు సాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అతను స్థానికతను గ్లోబల్ గా మార్చాలని కలలు కంటున్నాడు.
మిత్రులారా,
నేడు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు, 'ప్రచండ్' లైట్ కంబాట్ హెలికాప్టర్లు మరియు తేజస్ యుద్ధ విమానాలు వంటి రక్షణ పరికరాలు భారతదేశ శక్తికి పర్యాయపదంగా మారుతున్నాయి. నేడు, భారతదేశం సువిశాలమైన సముద్రంలో ఫైటర్ 'విక్రాంత్' ను కలిగి ఉంది. నీటి అడుగున యుద్ధాలు చేయడానికి, మాకు 'అరిహంత్' ఉంది. భారత్ వద్ద 'పృథ్వీ'తో పాటు 'ఆకాశ్' క్షిపణులు ఉన్నాయి. వినాశనానికి 'తాండవ్' వంటి క్షిపణులు, అలాగే శివుని 'త్రిశూల్', 'పినాక' వంటి క్షిపణులు మన వద్ద ఉన్నాయి. యుద్ధం ఎంత దూకుడుగా సాగినా భారత అర్జునుడు ఎప్పుడూ లక్ష్యాన్ని ఛేదించేస్తాడు. నేడు భారతదేశం తన సైన్యం అవసరాలను తీర్చడమే కాకుండా, రక్షణ పరికరాల ప్రధాన ఎగుమతిదారుగా కూడా మారుతోంది. నేడు, భారతదేశం తన క్షిపణి రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. అదే సమయంలో, డ్రోన్లు వంటి ఆధునిక, సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాలపై కూడా ఇది వేగంగా పనిచేస్తోంది.
సోదర సోదరీమణులారా,
సాంస్కృతికంగా, మేము యుద్ధాన్ని మొదటి ఎంపికగా ఎన్నడూ పరిగణించలేదు. మన శౌర్యం, పరాక్రమం, సామాజిక విలువల కారణంగా, మేము ఎల్లప్పుడూ యుద్ధాన్ని చివరి ఎంపికగా పరిగణించాము. లంకలోనో, కురుక్షేత్రంలోనో యుద్ధం జరిగినా, చివరి వరకు దాన్ని నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అందుకే మేము ప్రపంచ శాంతికి అనుకూలంగా ఉన్నాము. మేము యుద్ధానికి వ్యతిరేకం. కానీ బలం లేకుండా శాంతి కూడా సాధ్యం కాదు. మన దళాలకు సామర్థ్యంతో పాటు వ్యూహం కూడా ఉంది. ఎవరైనా మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, మన మూడు సాయుధ దళాలకు శత్రువులకు వారి భాషలో తగిన సమాధానం ఎలా ఇవ్వాలో బాగా తెలుసు.
మిత్రులారా,
దేశం తో పాటు మన సైన్యాల ముందు ఒక అడ్డంకిగా నిలబడటానికి మరొక విషయం, అది బానిస మనస్తత్వం. ఈ రోజు దేశం ఈ మనస్తత్వాన్ని కూడా వదిలించుకుంటుంది. చాలా కాలం పాటు దేశ రాజధానిలోని రాజ్ పథ్ బానిసత్వానికి చిహ్నంగా ఉండేది. ఈ రోజు దీనికి 'కర్తవ్య మార్గం' అని పేరు పెట్టడం ద్వారా, మేము నవ భారతదేశంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాము. ఒకప్పుడు ఇండియా గేట్ సమీపంలో వలస పాలనకు చిహ్నం ఉండేది, కానీ నేడు మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహం ఉంది, అది ఇప్పుడు మనకు మార్గనిర్దేశం చేస్తోంది. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం కావచ్చు, జాతీయ పోలీసు స్మారక చిహ్నం కావచ్చు, దేశ రక్షణ కోసం ఏదైనా చేయడానికి మనల్ని ప్రేరేపించే ఈ స్మారక చిహ్నాలు కూడా నవ భారతదేశానికి చిహ్నాలు. కొంతకాలం క్రితం, దేశం బానిసత్వానికి చిహ్నం నుండి భారత నావికాదళాన్ని కూడా విముక్తం చేసింది. ఇప్పుడు ధైర్యవంతుడైన శివాజీ నుండి ప్రేరణ పొంది, నావికాదళ పతాకానికి ఒక కొత్త నౌకాదళ చిహ్నం జోడించబడింది.
మిత్రులారా,
ఈ రోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు మరియు దాని పెరుగుతున్న సామర్థ్యం వైపు చూస్తోంది. భారతదేశ బలం పెరిగినప్పుడు, శాంతి కోసం ఆశ కూడా పెరుగుతుంది. భారతదేశ బలం పెరిగినప్పుడు, శ్రేయస్సు కు సంబంధించి అవకాశం కూడా పెరుగుతుంది. భారతదేశం బలం పెరిగినప్పుడు, ప్రపంచంలో ఒక సమతుల్యత ఉంటుంది. 'ఆజాదీ కా అమృత్కాల్' భారతదేశ ఈ శక్తికి నిజమైన సాక్షి కాబోతోంది. మీలాంటి ధైర్యవంతులైన సైనికులందరూ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, ఎందుకంటే మీరు దేశానికి గర్వ కారణం ("ప్రైడ్ ఆఫ్ ఇండియా").
మిత్రులారా,
"మీ శరీరం, మనస్సు, కోరిక మరియు మార్గం త్రివర్ణ పతాకానికి పర్యాయపదాలు; విజయం కోసం మీకు గర్జించే ఆత్మవిశ్వాసం ఉంది; మీ ఛాతీ సరిహద్దు కంటే వెడల్పుగా ఉంటుంది; మీ సంకల్పం కలల్లో కూడా ప్రతిబింబిస్తుంది, అడుగడుగునా బలాన్ని చూపిస్తుంది; మీరు భారతదేశానికి గర్వకారణం; ప్రతి భారతీయుడు మిమ్మల్ని చూసి గర్వపడతాడు; మీ వీరోచిత గాథ ప్రతి ఇంటిలో ప్రతిధ్వనిస్తుంది; స్త్రీపురుషులు మీకు నమస్కరిస్తారు; సముద్రం కంటే లోతైన మీ పట్ల మా అందరికీ అభిమానం ఉంది; మీకు మీ కుటుంబం ఉంది; మీకు మీ కలలు కూడా ఉన్నాయి; అయినా మీరు వీటన్నిటినీ దేశానికి అంకితం చేశారు; ఇప్పుడు ఆ దేశపు శత్రువులు నీ ఇనుప సంకల్పమును ఎరిగియున్నారు; మీరు భారతదేశానికి గర్వకారణం; ప్రతి భారతీయుడు మిమ్మల్ని చూసి గర్వపడతాడు! ప్రేమ విషయానికి వస్తే, మీరు సముద్రపు ప్రశాంతతను పోలి ఉంటారు, కానీ ఎవరైనా దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ధైర్యం చేస్తే, మీరు ధైర్యం-దెయ్యం 'వజ్ర' మరియు 'విక్రాంత్' మరియు నిర్భయమైన 'అగ్ని'ను పోలి ఉంటారు! మీరు 'నిర్భయ్', 'ప్రచండ్' మరియు 'నాగ్' (క్షిపణులు) వంటివారు; మీరు 'అర్జున్', 'పృథ్వీ' మరియు 'అరిహంత్'; మీరు ప్రతి చీకటిని అంతం చేసేవారు; ఇక్కడ నీ తపస్సు దేశాన్ని కృతజ్ఞతగా చేస్తుంది; మీరు భారతదేశానికి గర్వకారణం; ప్రతి భారతీయుడు నిన్ను చూసి గర్వపడుతున్నాడు; మీ శిరస్సు ఆత్మగౌరవంతో ఎత్తుగా ఉంటుంది; నువ్వు ఆకాశంలో 'తేజస్' గర్జన; శత్రువు కనుగుడ్డును కనుబొమ్మను ఎదుర్కొనే 'బ్రహ్మోస్' యొక్క అజేయమైన గొంతుక నీవు; ప్రతి క్షణం మేము మీకు రుణపడి ఉంటాము అనే సత్యాన్ని దేశం పునరుద్ఘాటిస్తుంది; మీరు భారతదేశానికి గర్వకారణం; ప్రతి భారతీయుడు నిన్ను చూసి గర్వపడుతున్నాడు!
నా కార్గిల్ వీరులు ఉన్న హిమాలయాల ఒడి నుంచి, నా వైపు నుంచి, నా వీర సైనికుల తరఫున మీ అందరితో పాటు దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం హిమాలయాల్లో మీ స్వరం ప్రతిధ్వనించే విధంగా నాతో పాటు బిగ్గరగా చెప్పండి!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
(Release ID: 1871026)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam