ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

గుజరాత్‌లోని కేవడియాలోగల ఏక్తానగర్‌లో ఐక్యతా ప్రతిమ వద్ద ‘మిషన్‌ లైఫ్‌’ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గౌరవనీయ ఆంటోనియో
గుటెరెజ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్న ప్ర‌ధాన‌మంత్రి;

ప్ర‌ధానమంత్రి చొర‌వ‌కు ప్ర‌పంచ నేత‌ల అభినంద‌న‌… పూర్తి మ‌ద్ద‌తుకు హామీ;

పర్యావరణ హిత విధానాల అనుసరణపై భారత్ నిబద్ధత
ఎంతో ఉత్సాహమిచ్చింది:: ఐరాస ప్రధాన కార్యదర్శి;

గౌరవనీయ గుటెరెజ్‌ పూర్వికులకు గోవాతో సంబంధాలు.. గుజరాత్‌కు
ఆయనను ఆహ్వానించడం కుటుంబసభ్యుడిని స్వాగతించడమే: ప్ర‌ధాన‌మంత్రి;

“శీతోష్ణస్థితి మార్పు విధానాల రూపకల్పనకు అతీతమైనది”;

“శీతోష్ణస్థితి మార్పుపై ‘మిషన్‌ లైఫ్‌’ది ప్రజాస్వామ్యయుత పోరు…
ఇందులో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించవచ్చు”;

“మిషన్‌ లైఫ్‌’ మనందర్నీ పర్యావరణ ధర్మకర్తలను చేస్తుంది”;

“ప్రపంచ ప్రజానీకాన్ని ‘మిషన్‌ లైఫ్‌’ భూగోళ మిత్రులుగా ఏకం చేస్తుంది”;

“తగ్గింపు.. పునర్వినియోగం.. పునఃరూపకల్పన'.. వృత్తాకార
ఆర్థిక వ్యవస్థ వేల ఏళ్లుగా భారతీయుల జీవనశైలిలో భాగం”;

“ప్రగతి.. ప్రకృతి మమేకం కాగలవనేందుకు భారతదేశం ఒక విశిష్ట ఉదాహరణ”;

“భారత్‌… ఐరాస సంయుక్తంగా కృషి చేసినప్పుడల్లా ప్రపంచాన్ని
మెరుగైనదిగా మార్చే కొత్త మార్గాలు ఆవిష్కృతమయ్యాయి”

Posted On: 20 OCT 2022 1:12PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గౌరవనీయ ఆంటోనియో గుటెరెజ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం గుజరాత్‌లోని కేవడియాలోగల ఏక్తానగర్లో ఐక్యతా ప్రతిమ వద్ద ‘మిషన్‌ లైఫ్’ను ఆయన ప్రారంభించారు. అటుపైన వారిద్దరూ ఐక్యతా ప్రతిమవద్ద సర్దార్‌ పటేల్‌కు పుష్పాంజలితో నివాళి అర్పించారు. ‘మిషన్ లైఫ్‌’ ప్రారంభంపై ఐక్యరాజ్య సమితి పరిధిలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 దేశాల అధినేతలు అభినందన వీడియో సందేశాలు ఈ సందర్భంగా ప్రసారం చేయబడ్డాయి.

   ఈ కార్యక్రమాల తర్వాత ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- ఐరాస ప్రధాన కార్యదర్శికి భారత్‌ రెండో ఇల్లు వంటిదని, యువకుడుగా ఉన్నపుడు ఆయన పలుమార్లు మన దేశాన్ని సందర్శించారని గుర్తుచేశారు. గౌరవనీయ గుటెరెజ్‌ పూర్వికులకు గోవా రాష్ట్రంతో సంబంధాలు ఉండటమే ఇందుకు కారణమని ప్రధాని వివరించారు. ఆయన వీలు కల్పించుకుని భారత పర్యటనకు రావడంపై కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గుజరాత్‌కు ఆయనను స్వాగతించడం కుటుంబ సభ్యుడిని ఆహ్వానించినట్లేనని వ్యాఖ్యానించారు.

   మిషన్‌ లైఫ్‌ కార్యక్రమం చేపట్టడంలో భారతదేశానికి పూర్తి మద్దతు లభించడంపై ప్రధానమంత్రి హర్ష్యం వ్యక్తం చేశారు. అలాగే ఈ విశిష్ట కార్యక్రమంపై అభినందన సందేశాలు పంపిన అన్ని దేశాల అధినేతలకూ ధన్యవాదాలు తెలిపారు. శీతోష్ణస్థితి మార్పులపై పోరాటంలో ఐక్యతకుగల ప్రాముఖ్యాన్ని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. భారతదేశం గర్వించదగ్గ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ బృహత్తర ఐక్యతా ప్రతిమ సమక్షంలో ‘మిషన్ లైఫ్‌’కు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. “ఈ కార్యక్రమం కింద నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ విగ్రహం ఎంతో స్ఫూర్తినిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

   అలాగే “ప్రమాణాలు అసాధారణమైనపుడు రికార్డులు కూడా భారీగానే ఉంటాయి” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి గుజ‌రాత్‌లో శ్రీకారం చుట్టడంలోని ప్రాముఖ్యాన్ని ప్ర‌ధానమంత్రి వివరిస్తూ- దేశంలో పున‌రుత్పాద‌క ఇంధ‌నం, పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ దిశ‌గా చ‌ర్య‌లు చేపట్టిన తొలి రాష్ట్రం కావడమేనని వెల్లడించారు. కాలువలపై సౌర ఫలకాల ఏర్పాటులో లేదా కరువు పీడిత ప్రాంతాల కోసం జల సంరక్షణ ప్రాజెక్టులు ప్రారంభించడంలో గుజరాత్ సదా అగ్రగామిగా, కొత్త ఒరవడి సృష్టిస్తూ ముందడుగు వేసిందని చెప్పారు.

   శీతోష్ణస్థితి మార్పు కేవలం విధానాలకు సంబంధించినది కాబట్టి ఇంతటి కీలకాంశం గురించి మేధోమధనం బాధ్యతను ప్రభుత్వాలకు లేదా అంతర్జాతీయ సంస్థలకు వదిలివేయాలన్న ఆలోచన ధోరణిని ప్రధానమంత్రి ఎత్తిచూపారు. అయితే, కొన్ని దశాబ్దాలుగా అనూహ్య విపత్తులు సంభవించిన నేపథ్యంలో ప్రజలకు తమ పరిసరాలలో శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలు అనుభవంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. దీన్నిబట్టి శీతోష్ణస్థితి మార్పు విధాన రూపకల్పనకు అతీతమనే దృక్పథం ఏర్పడిందని చెప్పారు. అందువల్ల పర్యావరణ పరిరక్షణలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా ఎవరికివారు తమవంతు పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ప్రపంచ ప్రజానీకం గుర్తించిందని తెలిపారు.

   ‘పర్యావరణం కోసం జీవనశైలి’ అన్నదే ‘మిషన్‌ లైఫ్‌’ తారకమంత్రమని ప్రధాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఒనగూడే ప్రయోజనాలను వివరిస్తూ- ఇది ఈ భూగోళం రక్షణ కోసం ప్రజాశక్తిని అనుసంధానిస్తుందని, దాన్ని మెరుగైన మార్గంలో వినియోగించుకోవడంపై వారికి అవగాహన కల్పిస్తుందని ప్రధాని అన్నారు. శీతోష్ణస్థితి మార్పుపై ‘మిషన్‌ లైఫ్’ది ప్రజాస్వామ్యయుత పోరాటమని, ఇందులో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి తగిన రీతిలో తమదైన పాత్రను పోషించవచ్చునని ఆయన నొక్కిచెప్పారు. “దైనందిన జీవనంలో పర్యావరణ పరిరక్షణకు మనం చేయగలిగినదంతా చేసేవిధంగా ‘మిషన్ లైఫ్’ స్ఫూర్తినిస్తుంది. జీవనశైలిలో మార్పు ద్వారా కూడా పర్యావరణ పరిరక్షణ సాధ్యమేనని ఈ కార్యక్రమం విశ్వసిస్తుంది” అని ప్రధాని వివరించారు. కరెంటు బిల్లులు తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా భారత్‌లో ఎల్‌ఈడీ బల్బులు వాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. “ఇది భారీ పొదుపుతోపాటు పర్యావరణ ప్రయోజనాలకు దోహదం చేసింది.. అంతేకాకుండా ఇదొక శాశ్వత పునరావృత ప్రయోజనకారి” అని ఆయన పేర్కొన్నారు.

   హాత్మగాంధీకి జన్మనిచ్చిన నేలగా గుజరాత్‌కుగల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రకృతితో సహజీవనం ప్రాముఖ్యాన్ని ఏనాడో అర్థం చేసుకున్న దార్శనికులలో ఆయన ఒకరు. అందుకే ప్రకృతిపట్ల మానవాళికి ధర్మకర్తృత్వ భావన ఉండాలని ప్రబోధించారు. దీనికి అనుగుణంగానే ‘మిషన్ లైఫ్’ మనందర్నీ పర్యావరణానికి ధర్మకర్తలుగా మారుస్తుంది. ధర్మకర్త అంటే- వనరుల విచక్షణరహిత వాడకాన్ని అనుమతించని వ్యక్తి. అతడు ప్రకృతికి పోషకుడుగా ఉంటాడు తప్ప దోపిడీదారు కాబోడు.” అని నొక్కిచెబుతూ ప్రధానమంత్రి తన ఉపన్యాసం ముగించారు.

మిశన్ లైఫ్ అనేది మూడు పి ల (P3) నమూనా యొక్క భావన కు ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఆ మూడు పి లు ఏవేవి అంటే అవి ప్రో, ప్లానెట్, మరియు పీపల్ అనేవేనని ప్రధాన మంత్రి వివరించారు. మిశన్ లైఫ్ అనేది భూలోకం లో ప్రజల ను ధరిత్రి కి అనుకూలంగా ఉండేటట్లుగాను, మరియు వారిని వారి యొక్క ఆలోచనల పరంగానూ ఏకం చేస్తుంది అని ఆయన అన్నారు. ఇది భూగ్రహం యొక్క జీవన శైలి, భూ గ్రహం మనుగడ కోసం జీవన శైలి, మరియు భూ గ్రహం ద్వారా జీవన శైలి అనే మౌలిక సిద్ధాంతాల పై ఆధారపడి పనిచేస్తుంది అని ఆయన చెప్పారు. గతం యొక్క పొరపాటు ల నుండి నేర్చుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్తు కు దారి ఏర్పడుతుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం వేల కొద్ది సంవత్సరాలు గా ప్రకృతి ని ఆరాధించేటటువంటి ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చింది అని ఆయన గుర్తు చేశారు. వేదాలు ప్రకృతి యొక్క పంచ మూలకాలు అయినటువంటి నింగి, నేల, నీరు, నిప్పు, గాలి యొక్క ప్రాముఖ్యత లు ఖచ్చితం గా ప్రస్తావిస్తున్నాయి అని ఆయన అన్నారు. అధర్వ వేదాన్ని ప్రధాన మంత్రి ఉదహరిస్తూ ‘‘మాతా భుమియ:, పుత్రోహం పృథ్వియ:అని పలికారు. ఈ మాటల కు పృథ్వి మన మాత. మనం అందరం ఆమె యొక్క సంతానం అని ఆయన పేర్కొన్నారు.

తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, మరియు పునరుద్ధరించడం (రెడ్యూస్, రీయూస్ అండ్ రీసైకిల్) అనే భావన గురించి మరియు వర్తులాకార ఆర్థిక వ్యవస్థ ను గురించి ప్రధాన మంత్రి చెబుతూ, ఇది వేళ సంవత్సరాలు గా భారతీయుల యొక్క జీవన శైలి లో ఒక భాగం అయింది అని పేర్కొన్నారు. ప్రపంచం లోని ఇతర ప్రాంతాల ను గురించి ఆయన మాట్లాడుతూ, ఆ తరహా అభ్యాసాలు వాడుక లో ఉన్నాయని, మనలను ప్రకృతి తో సద్భావన యుక్తంగా మెలిగేటట్లు ప్రేరణ ను అందిస్తున్నాయని పేర్కొన్నారు. మిశన్ లైఫ్ ప్రకృతి యొక్క సంరక్షణ కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క జీవన శైలి ని ఆవరించి ఉంటుందని, మరి ఈ తరహా జీవన శైలి ని మన పూర్వికులు అవలంబించారని, దీనిని వర్తమానం లో మన జీవన శైలి లో ఒక భాగంగా చేర్చుకోవచ్చునని ఆయన వివరించారు.

జల, వాయు పరివర్తన తాలూకు భూతాని కి ఎదురొడ్డి పోరాడేందుకు భారతదేశం కంకణం కట్టుకున్నది.
తలసరి కర్బన పాదముద్ర పరం గా ప్రపంచ సగటు ప్రతి ఒక్క సంవత్సరాని కి 4 టన్నులుగా ఉండగా, దానితో పోలిస్తే భారతదేశం లో తలసరి కర్బన పాదముద్ర దాదాపు 1.3 టన్నులు గా మాత్రమే ఉంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఇది ఇలా ఉన్నప్పటికి కూడాను, జల వాయు పరివర్తన వంటి ప్రపంచ వ్యాప్త సమస్యల కు పరిష్కారాన్ని వెదకడం కోసం భారతదేశం అగ్రగామి గా ఉంటూ కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. ఉజ్జ్వల యోజన, ప్రతి జిల్లా లో 75 ‘అమృత సరోవరాలు’, మరియు చెత్త నుండి సంపద ను సృష్టించడానికి ఇది వరకు ఎన్నడూ లేనంత గా శ్రద్ధ తీసుకోవడం వంటి కార్యక్రమాల ను గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచం లో నవీకరణ యోగ్య శక్తి పరం గా నాలుగో అతి పెద్ద సామర్థ్యాన్ని సంపాదించుకొందని ఆయన అన్నారు. ఇవాళ మేం పవన శక్తి లో నాలుగో స్థానం లో ఉన్నాం. మరి అలాగే సౌర శక్తి లో అయిదో స్థానం లో ఉన్నాం. భారతదేశం యొక్క నవీకరణ యోగ్య శక్తి సామర్థ్యం గడచిన 7-8 సంవత్సరాల లో దాదాపు గా 290 శాతం మేరకు వృద్ధి చెందింది. మేం శిలాజ జనితేతర ఇంధన వనరుల నుండి విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యాన్ని 40 శాతం మేరకు సాధించుకోవాలన్న లక్ష్యాన్ని కూడా గడువు కంటే 9 సంవత్సరాలు ముందుగానే అందుకొన్నాం. పెట్రోలు లో 10 శాతం ఇథెనాల్ ను కలపాలి అనేటటువంటి లక్ష్యాన్ని కూడా మేం సాధించాం.. అదీ గడువు కంటే 5 నెలలు ముందుగానే సుమా.. అని ఆయన అన్నారు. నాశ్ నల్ హైడ్రోజన్ మిశన్ ద్వారా భారతదేశం పర్యావరణ మైత్రీపూర్వక శక్తి వనరు దిశ లో ముందుకు సాగింది అని ఆయన అన్నారు. ఇది భారతదేశం తో పాటు ప్రపంచం లోని అనేక దేశాలు ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని సాధించడం లో సహాయకారి కాగలదు అని కూడా ప్రధాన మంత్రి చెప్పారు. పురోగతి మరియు ప్రకృతి.. ఈ రెండు ఏ విధం గా చెట్టపట్టాల్ వేసుకొంటాయో అనే దానికి భారతదేశం ఒక ప్రముఖమైన ఉదాహరణ గా మారింది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచం లో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా సైతం నిలచింది, అదీ కాక మా అటవీ ప్రాంత పరిధి కూడా విస్తరిస్తున్నది. అలాగే వన్య ప్రాణి సంతతి యొక్క సంఖ్య కూడా అధికం అవుతోంది అని ఆయన అన్నారు.
‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’ అనేటటువంటి ప్రపంచ వ్యాప్త ప్రచారోద్యమాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భారతదేశం ఆ తరహా లక్ష్యాల వైపునకు పురోగమించడం లో తన సంకల్పాన్ని బలపరచుకొంటూనే ప్రపంచం తో తన భాగస్వామ్యాన్ని మరింత ఎక్కువ గా పెంచుకోవాలని ప్రస్తుతం కోరుకొంటున్నది అని పేర్కొన్నారు. కొయెలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడం లో నాయకత్వం వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల భారతదేశం తన ఆలోచనల ను ప్రపంచాని కి చేరవేసింది. ఈ పరంపర లో తదుపరి అడుగు ఏది అంటే గనక అది మిశన్ లైఫ్ యే అని ప్రధాన మంత్రి వివరించారు.

భారతదేశం మరియు ఐక్య రాజ్య సమితి (ఐ.రా.స.) కలసి పనిచేసినప్పుడల్లా ప్రపంచాన్ని ఒక ఉత్తమమైన ప్రదేశం గా తీర్చి దిద్దేందుకు కొత్త కొత్త దారులు కనిపించాయి అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం అంతర్జాతీయ యోగ దినాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ను ఐ.రా.స. సమర్థించింది. ప్రస్తుతం ఇది లక్షల కొద్ది ప్రజల కు ఒక ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడం కోసం ప్రేరణ ను ఇస్తోంది అని ఆయన అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని గురించి ఉదాహరిస్తూ, దీనికి ఐ.రా.స. పక్షాన బలమైన మద్దతు లభించిందన్నారు. భారతదేశం తన వద్ద ఉన్నటువంటి సాంప్రదాయికమైన, పర్యావరణాని కి అనుకూలమైన, ముతక తృణ ధాన్యాల ద్వారా ప్రపంచం తో జతపడాలి అని కోరుకొందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని గురించి ప్రపంచ అంతటా చర్చ జరుగనుంది అని ఆయన పేర్కొన్నారు. దీనిని ‘‘దీనిని ప్రపంచం లోని మూలమూల కు, ప్రతి ఒక్క దేశాని కి తీసుకుపోవడంలో మిశన్ లైఫ్ సఫలం అవుతుంది’’ అని ఆయన చెప్పారు. ‘‘మనం ‘ప్రకృతి రక్షతి రక్షిత:’ అనే మంత్రాన్ని గుర్తు పెట్టుకొని తీరాలి. ‘ప్రకృతి రక్షతి రక్షిత:’ అంటే ఈ మాటల కు.. ఎవరైతే ప్రకృతి ని కాపాడుతారో, వారిని ప్రకృతి కాపాడుతుంది.. అని భావం. మనం ‘మిశన్ లైఫ్’ ని అనుసరించడం ద్వారా ఒక ఉత్తమ ప్రపంచాన్ని నిర్మించగలుగుతాం అని నేను నమ్ముతున్నాను అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఐక్య  రాజ్య సమితి సెక్రట్రి జెనరల్ శ్రీ ఎంటోనియొ గుటెరెస్ మాట్లాడుతూ, మన భూ గ్రహాని కి ఈ అపాయకరమైన కాలం లో అందరి చేయూత మనకు అవసరం అన్నారు. లైఫ్ స్టైల్ ఫార్ ఎన్ వైరన్ మెంట్- ఎల్ఐఎఫ్ఇ కార్యక్రమాన్ని అనివార్యమైన మరియు ఆశాజనకమైన నిజాల ను గురించి నొక్కి చెప్పడం కోసం రూపొందించడం జరిగింది. మనం అందరం.. వ్యక్తులు, మరియు సముదాయాలు.. మన భూ గ్రహాన్ని మరియు మన సామూహిక భవితవ్యాల ను కాపాడుకొనేందుకు తోడ్పడేటటువంటి ఒక పరిష్కారం లో భాగస్థులం కాగలం, అంతేకాదు అలా మనం భాగస్థులం అయి తీరవలసిందే. జలవాయు పరివర్తన, జీవ వైవిధ్యం పరమైన నష్టం మరియు కాలుష్యం.. ఈ మూడు భూగ్రహ సంబంధి అత్యయిక స్థితి కి అంతిమం గా అతి వినియోగమే మూల కారణం అని చెప్పాలి. మనం మన జీవన శైలి ని సమర్థించుకోవడం కోసం 1.6 వంతు ల భూమి కి సమానమైన వినియోగాని కి పాల్పడుతున్నాం. ఈ విధమైన మితిమీరిన ధోరణి కి మహా అసమానత అనేది తోడవుతున్నది అని ఆయన అన్నారు. లైఫ్ ఉద్యమం తాలూకు కార్యక్రమాలు ప్రపంచం అంతటా విస్తరిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పర్యావరణ పరం గా చక్కని విధానాలను అవలంబించాలి అని భారతదేశం కంకణం కట్టుకోవడం తో పాటు గా నవీకరణ యోగ్య శక్తి లో పెట్టుబడి ని గణనీయం గా పెంచాలని ప్రతిన బూనడం, ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ కు సారథ్యాన్ని వహించడం అనే అంశాలు నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. మనం మళ్ళీ మళ్లీ ఉపయోగించుకొనే అంశాల తాలూకు ఒక విప్లవాన్ని తీసుకు రావలసిన అవసరం ఉన్నది. మరి ఈ కార్యాచరణ ప్రణాళిక ను ముందుకు తీసుకుపోవడం లో భారతదేశం తో కలసి పనిచేయాలి అని నేను ఆశపడుతున్నాను అని ఆయన అన్నారు. ఈజిప్టు లో త్వరలో జరుగబోయే సిఒపి-27 కార్యక్రమాన్ని గురించి సెక్రట్రి జెనరల్ ప్రస్తావించి, ఆ సమావేశం పేరిస్ ఒప్పందం తాలూకు అన్ని ముఖ్యాంశాల పైన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం తో పాటు గా కార్యాచరణ ను ముమ్మరం చేసేందుకు ఒక ముఖ్యమైన రాజకీయ అవకాశాన్ని ప్రసాదిస్తుంది అని పేర్కొన్నారు. జల వాయు అంశాల పరం గా తీవ్ర ప్రభావాలకు లోనయ్యే స్థితి లో ఉండడంతో పాటు చాలా పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థ ను కలిగివున్న భారతదేశం ఒక కీలకమైన వారిధి వంటి భూమిక ను నిర్వహించగలుగుతుంది అని ఆయన అన్నారు.

‘‘ఈ ప్రపంచం లో ప్రతి ఒక్కరి అవసరాల కు సరిపడ వనరులు ఉన్నాయి గాని ప్రతి ఒక్కరి పేరాశ కు సరిపడ వనరులు మాత్రం లేవు’’ అని మహాత్మ గాంధీ చెప్పిన మాటల ను శ్రీ గుటెరెస్ గుర్తు కు తీసుకు వచ్చారు. అంతేకాకుండా పృథ్వి లోని వనరుల ను మనం వివేకం తో మరియు గౌరవం తో ఉపయోగించుకోవలసిందే అని కూడా ఆయన అన్నారు. ఖర్చు పెట్టే అలవాటుల ను మరియు జీవన శైలుల ను మార్చుకొంటే గనక మనం భూమి యొక్క వనరుల ను చక్క గా అందుకోగలుగుతామని, మరి మనకు అవసరమైనంత వరకే తీసుకొందాం అంటూ ఐరాస సెక్రట్రి జెనరల్ ప్రతిజ్ఞ చేశారు. భారతదేశం జి20 అధ్యక్ష బాధ్యతల ను స్వీకరిస్తున్న సందర్భం లో, భారతదేశం తన చరిత్ర, తన సంస్కృతి మరియు తన సంప్రదాయాల కు అనుగుణం గా, సుస్థిరత్వం తాలూకు ఒక నవ శకాన్ని తీసుకు వస్తుందనే విశ్వాసాన్ని భారతదేశం పై ఉంచవలసిందంటూ ప్రతి ఒక్కరి కి ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం జయ్ శంకర్ తో పాటు ఐ.రా.స. సెక్రట్రి జెనరల్ శ్రీ ఎంటోనియొ గుటెరెస్ తదితరులు ఉన్నారు.

పూర్వ రంగం

దీర్ఘకాలం మనుగడ సాధించే దిశ లో మన సామూహిక దృష్టికోణాన్ని మార్చడం కోసం త్రిముఖ వ్యూహాన్ని అవలంభించేటట్లు చూడడం అనేది మిశన్ లైఫ్ ధ్యేయం గా ఉంది. దీనిలో అన్నింటి కంటే ముందు గా వ్యక్తుల కు వారి దైనందిన జీవనం లో సీదాసాదా గా ఉంటూనే ప్రభావశీలమైనటువంటి పర్యావరణ మైత్రీ పూర్వక కార్యాల ను అభ్యసించేటట్లు గా వారిలో స్ఫూర్తి ని రగిలించడం (డిమాండు); రెండోది, మారుతున్న డిమాండ్ పట్ల పరిశ్రమ లు మరియు బజారు లు శీఘ్రం గా ప్రతిస్పందించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడం (సప్లయ్); మూడో ది దీర్ఘకాలిక వినియోగం మరియు ఉత్పాదన.. ఈ రెంటి కి సమర్థన లభించేటట్లు గా ప్రభుత్వం మరియు పారిశ్రామిక విధానాన్ని ప్రభావితం చేయడం (పాలిసి).. కలిసి ఉన్నాయి.


*****

DS/TS

 

 

 (Release ID: 1869759) Visitor Counter : 243