ప్రధాన మంత్రి కార్యాలయం
అహ్మదాబాద్ లోని నవభారత్ సాహిత్య మందదిర్ ఏర్పాటు చేసిన కలమ్ నో కార్నివాల్ పుస్తక ప్రదర్శనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి
ఈ పుస్తక ప్రదర్శన కొత్త, యువతరం రచయితలకు ఒక ప్లాట్‌ఫాంగా ఉపకరిస్తోంది, ఇది గుజరాత్ సాహిత్య విజ్ఞానాలను విస్తరింపచేయడానికి ఉపకరిస్తోంది.
పుస్తకాలు, సాహిత్యం ఇవన్నీ మన విద్యా ఉపాసన మౌలిక అంశాలు
స్వాతంత్ర పోరాటంలో మరిచిపోయిన అద్భుత ఘట్టాలను దేశం ముందుకు తెస్తున్నాం.
సాంకేతికత మనకు ముఖ్యమైన సమాచార ఖని. అయితే ఇది పుస్తకాలకు, అధ్యయనానికి ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాదు.
సమాచారం మన మనసులో ఉంటే, మన మెదడు ఆ సమాచారాన్ని అద్భుతంగా ప్రాసెస్ చేస్తుంది. అది కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది నూతన పరిశోధన ఆవిష్కరణకు దోహదం చేస్తుంది. పుస్తకాలు మన మంచి మిత్రులు.
Posted On:
08 SEP 2022 5:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , అహ్మదాబాద్‌లోని నవభారత్ సాహిత్య మందిర్ ఏర్పాటుచేసిన కలామ్ నో కార్నివాల్ పుస్తక ప్రదర్శన ఉత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి కలం నో కార్నివాల్ పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలుతెలిపారరు.అహ్మదాబాద్ నవభారత్ సాహిత్య మందిర్ ప్రారంభించిన పుస్తకమహోత్సవ సంస్కృతి పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలు ఏటికేడాది అద్భుతంగా సాగుతుండడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు.పుస్తక మహోత్సవం కొత్త, యువ రచయితలకు ఒక అద్భుత వేదికగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. అంతేకాకుండా ఇది గుజరాత్ సాహిత్యాన్ని విజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నదన్నారు. ఈ గొప్ప సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న నవభారత్ సాహిత్య మందిర్ సభ్యులను అభినందించారు.
కలం నో కార్నివాల్ అనేది భారీ పుస్తకమహోత్సవమని ఇందులో హిందీ , ఇంగ్లీషు, గుజరాతి భాషలకు చెందిన గ్రంథాలు ఉన్నాయన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు , రాష్ట్రప్రభుత్వం వాంచే గుజరాత్ ప్రచారాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారరు. ఇవాళ కలం నో కార్నివాల్ గుజరాత్ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నదని అన్నారు.పుస్తకాలు, గ్రంథాలు మన విద్యాఉపాసనకు మౌలిక అంశాలని ప్రధానమంత్రి గుర్తుచేస్తూ, గుజరాత్‌లో అత్యంత ప్రాచీన గ్రంథాలయ సంస్కృతి విలసిల్లింది అని అన్నారు. వడొదరా మహారాజ శాయాజీరావు గైక్వాడ్ జి ఈప్రాంతంలోని అన్ని గ్రామాలలో లైబ్రరీలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. గొండాల్ కు చెందిన మహారాజ భగవత్ సింగ్‌జి భగవత్ గోమండల్ పేరుతో బృహత్ పదకోశాన్ని రూపొందించారనిప్రధానమంత్రి గుర్తుచేశారరు. అలాగే వీరుల కవిత్వం నర్మద్‌ను నార్మ కోష్ పేరుతో ఎడిట్ చేశారన్నారు. గుజరాత్ వారసత్వం చరిత్ర, పుస్తకాలు, రచయితలు,సాహిత్యసృజనతో సుసంపన్నమైనదని ప్రధానమంత్రి అన్నారు. ఇలాంటి పుస్తక ప్రదర్శనులు గుజరాత్ లోని మారుమూల ప్రాంతాలకు చేరాలని, ప్రత్యేకించి యువతకు చేరాలని తద్వారా వారు గొప్ప చరిత్రను తెలుసుకుని ప్రేరణ పొందడానికి వీలు కలుగుతుందని ప్రధానమంత్రి చెప్పారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా పుస్తక ప్రదర్శన జరుగుతున్న విషయాన్ని ప్రధానమంత్రి అందరి దృష్టికి తెచ్చారు. మన స్వాతంత్ర పోరాట చరిత్రను పునరుజ్జీవింపజేయడం అమృత్ మహోత్సవ్‌లో కీలకమైన అంశాలలో ఒకటి అని ప్రధానమంత్రి అన్నారు.
‘‘స్వాతంత్య్ర పోరాటంలో మనం మరిచిన ఉజ్వల చారిత్రకఘట్టాల వైభవాన్ని దేశం ముందుకి తెస్తున్నాం. కలం నో కార్నివాల్' వంటి ప్రదర్శనలు దేశంలో ఈ ప్రచారానికి ఊపునిస్తాయి”, అని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్తకాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అలాంటి రచయితలకు బలమైన వేదికను అందించాలని సూచించారు. ఈ దిశగా ఈ పుస్తక మహోత్సవ కార్యక్రమం సానుకూల చర్య అని ప్రధాన మంత్రి అన్నారు.
మన పురాణాలు, గ్రంథాలు, పుస్తకాలను ప్రతివారూ అధ్యయనం చేయాలని, పదే పదే వాటిని చదవడం వల్ల వాటిని మరింత ఉపయోగంలోకి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సాయం
తీసుకుంటున్న రోజులలో ఈ గ్రంథాల అధ్యయనం ప్రాథాన్యత మరింత పెరిగిందన్నారు. సాంకేతికత గొప్ప వరం. సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఇది ఎన్నటికీ పుస్తకాలకు, గ్రంథ అధ్యయనానికి ప్రత్యామ్నాయం కాదు. అని ప్రధానమంత్రి అన్నారు. మన మనసులో సమాచారం ఉంటే మెదడు దానిని ప్రాసెస్ చేస్తుందని, ఇది కొత్త కోణాలను ఆవిష్కరిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఇది కొత్త పరిశోధన, ఆవిష్కరణలకు దారితీస్తుందన్నారు. పుస్తకాలు మనకు అత్యంత ఆత్మీయ మిత్రులని ప్రధానమంత్రి చెప్పారు.
పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకోవడం అవసరమని ప్రధానమంత్రి అన్నారు. ప్రత్యేకించి శరవేగంతో మరుతున్న సమాజంలో ఇది అవసరమని ఆయన చెప్పారు. పుస్తకాలు డిజిటల్ రూపంలో ఉన్నా, లేదా భౌతిక రూపంలో ఉన్నా సరే వాటిని చదవడం అలవరచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. ఇలాంటి పుస్తక ప్రదర్శనలు పుస్తకాల పట్ల యువతలో ఆసక్తి రేకెత్తించడానికి వారిని ఈ దిశగా ఆకర్షించడానికి ఎంతగానో ఉపకరిస్తాయని అలాగే పుస్తకాల ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని ప్రధానమంత్రి అన్నారు.
*****
DS/TS
(Release ID: 1857936)
Visitor Counter : 116
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam