ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అరవిందుల ను ఆయన జయంతి నాడు స్మరించుకొన్నప్రధాన మంత్రి

Posted On: 15 AUG 2022 3:52PM by PIB Hyderabad

ఈ రోజు న శ్రీ అరవిందుల జయంతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొంటూ, ‘‘ఆయన సునిశిత బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆయన కు మన దేశం పట్ల ఒక స్పష్టమైన దృష్టికోణమంటూ ఉండింది. విద్య, మేధోపరమైన కౌశలం మరియు బలం.. వీటి కి ఆయన కట్టబెట్టినటువంటి ప్రాధాన్యం మనకు సదా ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

 

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు న శ్రీ అరవిందుల జయంతి. ఆయన సునిశిత బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆయన కు మన దేశం పట్ల ఒక స్పష్టమైన దృష్టికోణమంటూ ఉండింది. విద్య, మేధోపరమైన కౌశలం మరియు బలం.. వీటి కి ఆయన కట్టబెట్టినటువంటి ప్రాధాన్యం మనకు సదా ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి. పుదుచ్చేరి లో మరియు తమిళ నాడు లో ఆయన తో ముడిపడ్డ కొన్ని ప్రదేశాల ను నేను సందర్శించినప్పటి చిత్రాల ను కొన్నిటి ని శేర్ చేస్తున్నాను.’’

‘‘శ్రీ అరవిందుల యొక్క ఆలోచన ల తాలూకు గొప్పతనాన్ని, ఇంకా ఆ ఆలోచన లు మనకు స్వావలంబన ను గురించి, జ్ఞ‌ాన ప్రాప్తి ని గురించి ఏమని బోధిస్తున్నాయనే అంశాల ను #MannKiBaat (‘మనసు లో మాట’ కార్యక్రమం) ఎపిసోడ్ ల లోని ఒక ఎపిసోడ్ లో నేను ప్రముఖం గా ప్రస్తావించాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 

 



(Release ID: 1852122) Visitor Counter : 129