ప్రధాన మంత్రి కార్యాలయం
కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
ఇది ఆయన కు నాలుగో కామన్ వెల్థ్ గేమ్స్ పతకం; అంటే ఇది ఆయననైపుణ్యాన్ని మరియు నిలకడతనాన్ని చాటి చెబుతోందన్నమాట: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 AUG 2022 8:25AM by PIB Hyderabad
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. కామన్ వెల్థ్ గేమ్స్ లో శ్రీ శ్రీకాంత్ కిదాంబి నాలుగో పతకం సాధించడం పట్ల కూడా ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశం బాడ్ మింటన్ క్రీడారంగ ప్రముఖల లో ఒకరు అయినటువంటి @srikidambi కామన్ వెల్థ్ గేమ్స్ వ్యక్తిగత మ్యాచ్ లో కాంస్య పతకాన్ని గెలిచారు. ఈ పతకం కామన్ వెల్థ్ గేమ్స్ లో ఆయన గెలుచుకొన్నటువంటి నాలుగో పతకంగా ఉన్నది; ఈ పతకం ఆయన నైపుణ్యాన్ని, ఆయన యొక్క నిలకడతనాన్ని చాటుతోంది. ఆయన కు ఇవే అభినందన లు. వర్థమాన క్రీడాకారుల కు/ క్రీడాకారిణుల కు ఆయన ఇదే విధం గా ప్రేరణ ను అందిస్తూను, భారతదేశాన్ని మరింత గా గర్వపడేటట్లూను చేస్తూ ఉందురు గాక. #Cheer4India’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1849883)
आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam