ప్రధాన మంత్రి కార్యాలయం
బెంగళూరు లో బాశ్ స్మార్ట్ కేంపస్ ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగంపాఠం
Posted On:
30 JUN 2022 12:55PM by PIB Hyderabad
బాశ్ ఇండియా కు చెందిన జట్టు సభ్యులు అందరు,
ప్రియ మిత్రులారా, నమస్కారం.
బాశ్ ఇండియా 100 సంవత్సరాల ను పూర్తి చేసుకొన్న సందర్భం లో ఇవే అభినందన లు. ఇది భారతదేశాని కి మరియు బాశ్ ఇండియా కు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం. మన దేశ ప్రజలు స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 75 సంవత్సరాల ఘట్టాన్ని వేడుక గా జరుపుకొంటున్నారు. మరి మీరు భారతదేశం లో మీరు ప్రవేశించి శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకొంటున్నారు. బాశ్ స్మార్ట్ కేంపస్ ను ప్రారంభిస్తున్నందుకు నాకు కూడా సంతోషం గా ఉంది. ఈ కేంపస్ భారతదేశాని కి, ప్రపంచాని కి అవసరమైన భావి కాలం ఉత్పాదనల ను మరియు పరిష్కారాల ను మలచడం లో తప్పక దారి ని చూపుతుంది. 2015వ సంవత్సరం అక్టోబరు లో చాన్స్ లర్ మర్కెల్ గారి తో కలసి బెంగళూరు లోని బాశ్ కేంద్రాన్ని సందర్శించే అవకాశం నాకు లభించింది. అక్కడ వినూత్నమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉండటాన్ని నేను చూశాను. యువత కు నైపుణ్యాల ను బోధించడానికి బాశ్ అనుసరిస్తున్నటువంటి రెండు విధాలైన వైఖరి సైతం అంతే హర్షాన్ని కలుగజేసింది.
మిత్రులారా,
ఇది సాంకేతిక విజ్ఞాన యుగం. మనం గత రెండు సంవత్సరాల లో, ఎప్పుడైతే ప్రపంచం ఒక శతాబ్ది కాలం లో ఎదురైన అతి పెద్ద మహమ్మారి తో పోరాడుతూ ఉందో, ఆ కాలం లో సాంకేతిక విజ్ఞానం యొక్క లాభాలు ఎలా ఉన్నదీ మనమంతా గమనించాం. అందుకని, సాంకేతికత లో మరియు నూతన ఆవిష్కరణల లో మరిన్ని పెట్టుబడుల ను పెట్టడం అనేది ముఖ్యం. బాశ్ ఇండియా ఒక్క నూతన ఆవిష్కరణల పై కృషి చేయడమే అని కాకుండా, ఆ కృషి కి స్థాయి ని కూడా సంతరిస్తుండడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. దీనిలో నిలకడతనం అనేది మరో ముఖ్య స్తంభం గా కాగలదు. గత ఎనిమిది సంవత్సరాల లో స్థాపిత సౌర శక్తి సామర్థ్యం సుమారు 20 రెట్ల మేర కు పెరగడం తో, భారతదేశం లో వృద్ధి మరింత హరితమైంది గా మారుతోంది. బాశ్ భారతదేశం లోను, బయటా కార్బన్ న్యూట్రాలిటీ ని సాధించింది అని నాతో చెప్పారు. ఇది చాలా ప్రేరణను ఇచ్చేది గా ఉంది.
మిత్రులారా,
ప్రస్తుతం, భారతదేశం అత్యంత వేగం గా వృద్ధి చెందుతూ ఉన్న ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ ల సరసన నిలచింది. గడచిన రెండు సంవత్సరాల లో పెట్టుబడులు జోరందుకొన్నాయి. మన యువత సౌజన్యం తో మన స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ ప్రపంచం లో అతి పెద్దవైన స్టార్ట్-అప్ ఇకో-సిస్టమ్ లలో ఒకటి గా ఉంది. ఒక్క సాంకేతిక జగతి లోనే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామాని కి అధిక వేగవంతమైన ఇంటర్ నెట్ సదుపాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వం లో ప్రతి ఒక్క దశ ను సాంకేతికత తో ఏకీకరించడం డిజిటల్ ఇండియా తాలూకు మా దృష్టి కోణం లో భాగం గా ఉంది. ఈ అవకాశాల ను వినియోగించుకొమ్మని మరి మా దేశం లో పెట్టుబడి పెట్టవలసిందని ప్రపంచ దేశాల కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రులారా,
మైలు రాళ్ళు అనేవి కీలకమైనవి. అవి ఒక వేడుక గా జరుపుకొనే సందర్భం మాత్రమే కాక ముందుచూపు తో నడుచుకొనే సందర్భం కూడాను. భారతదేశం లో మరింత ఎక్కువ గా కృషి చేయడం గురించి ఆలోచించవలసిందంటూ బాశ్ ను నేను కోరుతున్నాను. రాబోయే 25 సంవత్సరాల లో మీ జట్టు ఏమి చేయగలుగుతుంది అనే విషయం లో లక్ష్యాల ను నిర్దేశించుకోండి. 100 సంవత్సరాల కిందట బాశ్ ఒక జర్మన్ కంపనీ గా భారతదేశాని కి వచ్చింది. అయితే, ఈ రోజు న అది ఎలా అయితే ఒక జర్మన్ కంపెనీ యో అలాగే ఒక భారతీయ కంపెనీ గా కూడా ఉంది. జర్మనీ యొక్క ఇంజినీరింగ్ పరిజ్ఞానాని కి, భారతదేశం యొక్క శక్తి కి ఒక మహత్తర ఉదాహరణ గా ఈ కంపెనీ నిలచింది. ఈ సంబంధం మరింత బలవత్తరం గా వృద్ధి చెందుతూనే ఉంటుంది. మరొక్క మారు బాశ్ ఇండియా యొక్క యావన్మంది కుటుంబ సభ్యుల ను నేను అభినందిస్తూ, మీకు శుభాకాంక్షల ను అందిస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
మీకు అనేకానేక ధన్యవాదాలు.
***
(Release ID: 1838231)
Visitor Counter : 117
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam