ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశ స్వాతంత్య్రాని కి 75 సంవత్సరాలు సందర్భాన్ని స్మరించుకోవడం కోసం  ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఎకెఎఎమ్)’’ నిర్వహిస్తున్న ఎమ్ఒఎస్ పిఐ


ఈ కార్యక్రమాన్ని రావ్ ఇంద్రజీత్ సింహ్ ప్రారంభించారు

Posted On: 28 JUN 2022 8:08PM by PIB Hyderabad

గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (ఎమ్ఒఎస్ పిఐ) 2022వ సంవత్సరం జూన్ 27వ తేదీ మొదలుకొని అనేక కార్యక్రమాల ను ఏర్పాటు చేయడం ద్వారా ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఎకెఎఎమ్)’’ వారాన్ని జరుపుతున్నది. ఈ ఉత్సవం లో ఓ భాగం గా, ఎమ్ఒఎస్ పిఐ అనేక కార్యక్రమాల ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంత్రిత్వ శాఖ లోని ఎమ్ పిఎల్ఎడిఎస్ మరియు ఐపిఎమ్ విభాగం 2022 జూన్ 28 న న్యూ ఢిల్లీ లోని ఎన్ డిఎమ్ సి, కన్ వెన్శన్ సెంటర్ లో ఒక సగం రోజు పాటు కొనసాగిన కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమాన్ని గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, (స్వతంత్ర బాధ్యత) శ్రీ రావ్ ఇంద్రజీత్ సింహ్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంతం అభివృద్ధి పథకం (ఎమ్ పిఎల్ఎడిఎస్) పై ఒక లఘు నాటిక ప్రత్యక్ష ప్రసారం తో పాటు గా ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించడమే కాకుండా ఒక ప్రదర్శన ను కూడా చేపట్టడం ద్వారా ఎమ్ పిఎల్ఎడిఎస్ తాలూకు వివిధ ప్రత్యేకత లను, భూమిక ను మరియు తోడ్పాటుల ను వివరించడం జరిగింది.

***

 



(Release ID: 1837870) Visitor Counter : 91