ప్రధాన మంత్రి కార్యాలయం
బిఆర్ఐసిఎస్14వ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
Posted On:
21 JUN 2022 3:00PM by PIB Hyderabad
చైనా ఆతిథ్యం ఇవ్వనున్న 14వ బిఆర్ఐసిఎస్ ( ‘బ్రిక్స్’ ) శిఖర సమ్మేళనం 2022వ సంవత్సరం లో జూన్ 23వ మరియు 24వ తేదీల లో వర్చువల్ మాధ్యమం ద్వారా జరుగనుండగా, చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ ఆహ్వానాన్ని అందుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాని కి హాజరు కానున్నారు. అతిథి దేశాల తో ఒక ఉన్నత స్థాయి ప్రపంచ అభివృద్ధి సంబంధి సంభాషణ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం లో భాగం గా జూన్ 24వ తేదీ నాడు ఏర్పాటైంది.
2. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటి కి ఉమ్మడి ఆందోళనకారకం అయిన అంశాల ను గురించి చర్చోపచర్చల ను సాగించడం కోసం ఒక వేదిక గా బ్రిక్స్ రూపొందింది. బహుళ పక్షీయ వ్యవస్థ లో మరింత ఎక్కువ ప్రాతినిథ్యం లభించడం తో పాటు అది అన్ని వర్గాల కు స్థానం లభించేటట్టు గా ఉండేవిధం గా దాని లో సంస్కరణ అవసరమని బ్రిక్స్ దేశాలు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి
3. బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) పద్నాలుగో శిఖర సమ్మేళనం లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటాన్ని జరపడం, వ్యాపారం, ఆరోగ్యం, సాంప్రదాయక ఔషధాలు, పర్యావరణం, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, వ్యవసాయం, సాంకేతిక విద్య మరియు వృత్తి విద్యలు & శిక్షణ, ఎమ్ఎస్ఎమ్ఇ లు వంటి రంగాల లో బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య సహకారం ప్రస్తావన కు వచ్చే ఆస్కారం ఉంది. బహుళ పక్షీయ వ్యవస్థ లో సంస్కరణ, కోవిడ్-19 మహమ్మారి కి ఎదురొడ్డి పోరాడడం మరియు ప్రపంచ వ్యాప్తం గా ఆర్థిక సంబంధి మెరుగుదల తదతర అంశాల పై సైతం చర్చలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి.
4. శిఖర సమ్మేళనాని కంటే పూర్వం, ప్రధాన మంత్రి 2022వ సంవత్సరం జూన్ 22 న జరుగనున్న ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’ యొక్క ప్రారంభ కార్యక్రమం లో ముందస్తు గా రికార్డు చేసిన ప్రధానోపన్యాసాన్ని ఇవ్వడం ద్వారా పాలుపంచుకోనున్నారు.
***
(Release ID: 1836722)
Visitor Counter : 113
Read this release in:
Marathi
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia