ప్రధాన మంత్రి కార్యాలయం

క‌ర్ణాట‌క‌లోని మైసూరులో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


మైసూరులో నాగ‌నహ‌ళ్ళి వ‌ద్ద స‌బ‌ర్బ‌న్ ట్రాఫిక్‌ను చ‌క్క‌దిద్దేందుకు కోచింగ్‌టెర్మిన‌ల్‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి

క‌మ్యూనికేష‌న్ వైక‌ల్యాలు క‌లిగిన వారికోసం మైసూరు ఎఐఐఎస్‌హెచ్ లో ఏర్పాటైన సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి.

మ‌న ప్రాచీన సంస్కృతిని సుసంప‌న్నం చేసుకుంటూ 21వ శ‌తాబ్ద‌పు తీర్మానాల‌ను సాకారం చేసుకోవ‌డంలో క‌ర్ణాట‌క ఒక అద్భుత ఉదాహ‌ర‌ణ : ప్ర‌ధాన‌మంత్రి

డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మౌలిక‌స‌దుపాయాలు, ఆత్మ‌గౌర‌వంతో కూడిన జీవితాన్ని ఇచ్చేందుకు సామాన్య‌ప్ర‌జ‌ల‌తో పూర్తి సామ‌ర్ధ్యంతో అనుసంధానమౌతోంది

గ‌త 8సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వం , స‌మాజంలోని చిట్ట‌చివ‌రి వ్య‌క్తి వ‌ర‌కు ప్ర‌భుత్వం సామాజిక న్యాయ సాధికార‌త క‌ల్పించింది.

మ‌నం దివ్యాంగ ప్ర‌జ‌ల‌కు అవ‌కాశాలు, ఆత్మ‌గౌర‌వం క‌ల్పించాం. అలాగే దేశ‌పురోగ‌తిలో దివ్యాంగ మాన‌వ వ‌న‌రుల‌ను కీల‌కమైన‌విగా చేసేందుకు కృషి చేస్తున్నాం.

Posted On: 20 JUN 2022 8:45PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ ఈరోజు మైసూరు మ‌హారాజ కాలేజ్ గ్రౌండ్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో నాగ‌న్‌హ‌ల్లి రై్ల్వే స్టేష‌న్ వ‌ద్ద స‌బ‌ర్బ‌న్‌ట్రాఫిక్ కోసం ఏర్పాటు చేయ‌నున్న కోచింగ్ టెర్మిన‌ల్ కు శంకుస్థాప‌న చేశారు. 480 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఈ కోచింగ్ టెర్మిన‌ల్ ను నిర్మంచ‌నున్నారు. ఈ కోచింగ్ టెర్మిన‌ల్‌లో మెముషెడ్ ఉంటుంది. ఇది మైసూరు యార్డ్‌లో ర‌ద్దీ త‌గ్గిస్తుంది. అలాగే ఈ ప్రాంత అనుసంధాన‌త , ప‌ర్యాట‌కానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది రోజువారి ప్ర‌యాణికుల‌కు, దూర ప్రాంత ప్ర‌యాణాలు చేసేవారికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి, క‌మ్యూనికేష‌న్ వైక‌ల్యాలుక‌ల‌గిన వారికోసం  ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియ‌రింగ్‌(ఎఐఐఎస్ హెచ్‌) వ‌ద్ద ఏర్పాటైన సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సును జాతికి అంకితం చేశారు. ఇందులో అత్యుధునాత‌న ప‌రిశోధ‌న శాల‌లు, స‌మ‌స్య‌ నిర్ధార‌ణ స‌దుపాయాలు, క‌మ్యూనికేష‌న్ వైక‌ల్యాలు క‌లిగిన వ్య‌క్తుల పున‌రావాసానికి త‌గిన అంచ‌నా త‌దిత‌ర స‌దుపాయాలు ఉన్నాయి. క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌త‌వార్‌చంద్ గెహ్లాట్, ముఖ్య‌మంత్రి శ్రీ బ‌స‌వ‌రాజ్ బొమ్మ‌య్‌, కేంద్ర మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్‌జోషి త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా ఏర్పాటుచేసిన స‌భ‌లో ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, దేశ ఆర్థిక‌, ఆధ్యాత్మిక సుసంప‌న్న‌త ఉమ్మ‌డి మేళ‌వింపుగా క‌నిపించే రాష్ట్రం క‌ర్ణాట‌క అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. మ‌న ప్రాచీన సంస్కృతి ని సుసంప‌న్నం చేసుకుంటూ,  21 వ శ‌తాబ్ద‌పు క‌ల‌ల‌నుసాకారం చేసుకోవ‌డంలో అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ‌గా క‌ర్ణాట‌క నిలుస్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

      ఈ గ‌డ్డ ఎంద‌రో మ‌హ‌నీయుల‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, న‌ల్వాడి కృష్ణ వ‌డ‌యార్‌, స‌ర్ మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌, రాష్ట్ర‌క‌వి కువెంపు వంటి మ‌హ‌నీయుల‌ను దేశానికి అందించిందని చెప్పారు.ఇటువంటి మ‌హ‌నీయులు భార‌త‌దేశ అభివృద్ధికి, దేశ వార‌స‌త్వ ప‌రిర‌క్ష‌ణ‌కు ఎంతో కృషి చేశార‌న్నారు. డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం , సామాన్యుడితో అనుసంధాన‌మై, వారి ఆత్మ‌గౌర‌వాన్నికాపాడుతూ వారికి మౌలిక‌స‌దుపాయాలు క‌లిపించి , మ‌హ‌నీయుల దార్శ‌నిక‌త‌ను మ‌రింత ముందుకు తీసుకుపోయేందుకు కృషిచేస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

    గ‌తంలో సంక్షేమానికి సంబంధించి కొద్ది వ‌ర్గాల విష‌యంలో ప‌రిమిత స్థాయిలో ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. గ‌త 8 సంవ‌త్స‌రాల‌లో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లుచేసిన ప‌థ‌కాలలో , స‌మాజంలోని అన్ని వ‌ర్గాల వారికి అవి అందాల‌న్న‌స్ఫూర్తికి ప్రాధాన్య‌త నివ్వ‌డం జ‌రిగింద‌న్నారు. ఒక‌వైపు స్టార్ట‌ప్ పాల‌సీ కింద మేం యువ‌త‌కు ప్రోత్సాహ‌కాలు ఇచ్చాం. మ‌రోవైపు పి.ఎం. కిసాన్ స‌మ్మాన్ నిధికింద రైతుల‌కు న‌గ‌దు చెల్లిస్తున్నాం. క‌ర్ణాట‌కలోని 56 ల‌క్ష‌ల మంది చిన్న‌రైతులు ఈ ప‌థ‌కం కింద ప్ర‌యోజ‌నం పొందారు . ప‌ది వేల కోట్ల రూపాయ‌లు వారి ఖాతాల‌లో జ‌మ అయ్యాయి అని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఒక దేశం, ఒక రేష‌న్‌కార్డ్‌వంటి  ప‌థకం దేశం మొత్తం అమ‌లుజ‌రుగుతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా క‌ర్ణాట‌క‌లోని 4.25 కోట్ల మంది పేద ప్ర‌జ‌లు ఉచిత రేష‌న్ ను పొందుతున్నార‌న్నారు. ఆయుష్మాన్ ప‌థ‌కం కింద 29 ల‌క్ష‌ల పేద ప్ర‌జ‌లు రాష్ట్రం నుంచి చికిత్స పొందారన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముందు ప్ర‌ధాన‌మంత్రి, వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌భుత్వం వెచ్చిస్తున్న‌ప్ర‌తి పైసా ప్ర‌జ‌ల‌లో ఆత్మివిశ్వాసం నింపుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి సంతృప్తి వ్య‌క్తం చేశారు.

 గ‌త 8 సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వం , చిట్ట చివ‌రి వ్య‌క్తి వ‌ర‌కు స‌మ‌ర్దంగా ప్ర‌భుత్వ ప‌థకాల‌ను తీసుకువెళ్ల‌డం ద్వారా సామాజిక న్యాయ సాధికార‌త సాధించిన‌ట్టు తెలిపారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను పూర్తి స్థాయిలో అమ‌లుచేసేందుకు కృషి జ‌ర‌గ‌డం వ‌ల్ల , ఎలాంటి వివ‌క్ష‌కుతావు లేకుండా, ఎలాంటి లోటుపాట్లులేకుండా ప‌థ‌కాలు త‌మ‌కుఅందుతాయ‌న్న విశ్వాసం దేశ సామాన్య‌ప్ర‌జ‌ల‌లో బ‌ల‌ప‌డింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. దివ్యాంగులు ఇత‌రుల‌మీద ఆధార‌ప‌డే ప‌రిస్థితులను క‌నీస‌స్థాయికి తెచ్చేందుకు ప్ర‌భుత్వం నిరంత‌రం కృషిచేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఇందుకు అనుగుణంగా మ‌న క‌రెన్సీలో కొత్త ఫీచ‌ర్ ల‌నుతీసుకువ‌చ్చామ‌ని, నాణేల‌నుదివ్యాంగులుసైతం గుర్తుప‌ట్టే విధంగా రూపొందించామ‌న్నారు. దివ్యాంగుల విద్య‌కుసంబంధించి కోర్సుల‌ను దేశ‌వ్యాప్తంగా ఉన్న‌త స్థాయికి తీసుకువెళ్ల‌డం జ‌రుగుతోంది. సుగ‌మ్య భార‌త్ ట్రాన్స్‌పోర్టు, ఆఫీసుల‌నువార‌కి అందుబాటులో ఉంచుతున్న‌ది. దివ్యాంగుల స‌మ‌స్య లకు ప‌రిష్కారాలు సాధించ‌డానికి స్టార్ట‌ప్‌లు కృషిచేయాల‌న్నారు. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్‌, హియ‌రింగ్‌(ఎఐఐఎస్‌హెచ్‌) దివ్యాంగ మాన‌వ వ‌న‌రుల‌ను దేశ ప్ర‌గ‌తికి కీల‌కంగా మారుస్తున్న‌ద‌న్నారు.  క‌మ్యూనికేష‌న్ వైక‌ల్యాలుక‌ల‌గిన వారికి ఉప‌యోగ‌ప‌డే సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స‌లెన్స్‌ను ప్ర‌ధాన‌మంత్రి ఈరోజు జాతికి అంకితం చేశారు.

గ‌త 8 సంవ‌త్స‌రాల‌లో  కేంద్ర ప్ర‌భుత్వం, క‌ర్ణాట‌క‌లో 70 వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యం కాగ‌ల‌, 5 వేల కిలోమీట‌ర్ల మేర జాతీయ ర‌హ‌దారుల‌ను మంజూరు చేసింద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఇవాళ మ‌రో 7,000 కోట్ల రూపాయ‌లకు పైగా విలువ చేసే జాతీయ‌ర‌హ‌దారుల ప్రాజెక్టుల‌కు బెంగ‌ళూరులో శంకుస్థాప‌న చేసిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. డ‌బుల్ ఇంజ‌న్‌ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టుల‌ను స‌త్వ‌రం పూర్తి చేసి, ప్ర‌జ‌లకుసుల‌భ‌త‌ర జీవ‌నాన్ని క‌ల్పించేందుకు కృషి చేస్తున్న‌ట్టుచెప్పారు.

2014 కు ముందు క‌ర్ణాట‌క‌లో రైల్వేకి స‌గ‌టున 800 కోట్ల రూపాయ‌లు కేటాయించ‌డంతో పోలిస్తే, ఈ ఏడాది 7000 కోట్ల రూపాయ‌లు కేటాయించ‌డం జ‌రిగింద‌ని , రాష్ట్రంలో 3,400 కోట్ల రూపాయ‌ల విలువ‌గల రైల్వే ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. 2014 కు ముందు 10 సంవ‌త్స‌రాల కాలంలో కేవ‌లం  16కిలోమీట‌ర్ల రైల్వే లైన్‌విద్యుదీక‌ర‌ణ ప‌నులు జ‌ర‌గ‌గా, గ‌త 8 సంవ‌త్స‌రాల‌లో 1600 కిలోమీట‌ర్ల విద్యుదీక‌ర‌ణ ప‌నులుజ‌రిగిన‌ట్టు తెలిపారు. క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల దీవెన‌లు డ‌బుల్ ఇంజ‌న్‌ప్ర‌భుత్వం మ‌రింత‌గా నిర్విరామంగా రాష్ట్రఅభివృద్ధికి ప‌నిచేయ‌డానికి ఎంత‌గానో ఉప‌క‌రిస్తాయ‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి త‌మ ప్ర‌సంగాన్ని ముగించారు.

 

***

 

DS/AKP/AK

 



(Release ID: 1835887) Visitor Counter : 132