ప్రధాన మంత్రి కార్యాలయం
భుజ్ లో కె.కె. పటేల్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
Posted On:
15 APR 2022 2:04PM by PIB Hyderabad
భూకంపం కారణంగా జరిగిన దారుణ నష్టం నుంచి కోలుకుని భుజ్, కచ్ ప్రాంత ప్రజలు కష్టించి పనిచేసి సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు.
మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కేవలం వ్యాధులను నయం చేయడానికే కాకుండా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తాయి.
సరసమైన ధరకు , అత్యుత్తమ చికిత్సా సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టయితే ,వ్యవస్థపట్ల వారి నమ్మకం విశ్వాసం మరింత బలపడుతుంది. చికిత్సకు అయ్యే ఖర్చు విషయంలో వారు కలతచెందే పరిస్థితి లేకుంటే , పేదరికం నుంచి బయటపడడంపై వారు మరింత పట్టుదలతో కృషిచేయడానికి వీలు కలుగుతుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని భుజ్ లో ఈరోజు కె.కె.పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ ఆస్పత్రిని భుజ్ లోని శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ నిర్మించింది. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ , తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, భూకంపం మిగిల్చిన విషాదాన్ని వెనక్కినెట్టి భుజ్, కచ్ ప్రాంత ప్రజలు కష్టించి పనిచేస్తూ ప్రస్తుతం ఈ ప్రాంతానికి కొత్త గమ్యాన్ని నిర్దేశిస్తున్నారని అన్నారు. ఇవాళ ఈ ప్రాంతంలో ఎన్నో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ దిశగా భుజ్ ఆధునిక, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలను అందుకుంటున్నది. అని ప్రధానమంత్రి అన్నారు. . ఈ ప్రాంతంలో ఏర్పడుతున్న తొలి ఛారిటబుల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఇది అని ఆయన అన్నారు. ఇది కచ్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సలకు హామీ ఇస్తుందని , ఇది లక్షలాదిమంది సైనికులు, పారా మిలటరీ సిబ్బంది, వ్యాపారులకు చికిత్సలను అందుబాటులోకి తెస్తుందని ఆయన అన్నారు.
మెరుగైన వైద్య సదుపాయాలు కేవలం వ్యాధులకు చికిత్స అందించడానికి మాత్రమే పరిమితం కాదని, ఇది సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు. పేదలకు తక్కువధరకు, మెరుగైన చికిత్స అందుబాటులో ఉంటే , వ్యవస్థపై వారి నమ్మకం బలపడుతుందని ఆయన అన్నారు. చికిత్సకు అయ్యే ఖర్చుపై ఆలోచించే పరిస్థితినుంచి విముక్తి పొందితే, పేదరికం నుంచి బయటపడడానికి మరింత పట్టుదలతో వారు కృషి చేయడానికి వీలు కలుగుతుంది అని ప్రధానమంత్రి అన్నారు. గత సంవత్సరాలలో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పథకాలను , ఈ ఆలోచనను పక్కనపెట్టి అమలు చేశారని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ పథకం, పేదలు, మధ్యతరగతి ప్రజలకు చికిత్సకు సంబంధించి ఏటా లక్షల కోట్ల రూపాయలను ఆదా చేస్తున్నదని, జన ఔషధి యోజన కూడా వారికి ఎంతో ఉపయోగపడుతున్నదని ఆయన అన్నారు. హెల్త్, వెల్‌నెస్ కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల పథకం వంటివి ప్రజలందరికీ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతున్నదని అన్నారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ , పేషెంట్లకు తమ సదుపాయాలను విస్తరిస్తోన్నది. ఆధునిక , కీలక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ఆయుష్మాన్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా జిల్లాలలో అభివృద్ధి చేయడం జరుగుతోంది. వీటిని బ్లాక్ స్థాయికి తీసుకెళ్లడం జరుగుతోంది. ప్రతి జిల్లాలో ఆస్పత్రులను నిర్మించడం జరుగుతోంది. అలాగే ఎఐఐఎంఎస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వైద్య కళాశాలలను విస్తరిస్తున్నారు. దేశంలో వైద్య విద్య రాగల 10 సంవత్సరాలలో రికార్డు స్థాయిలో వైద్యులను తయారు చేయనుంది.
గుజరాత్ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, నేను కచ్‌ను వదిలపెట్టను లేదా కచ్ నన్ను వదిలిపెట్టదు అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. గుజరాత్ లో ఇటీవలి కాలంలో వైద్య మౌలిక సదుపాయాల విస్తరణ గురించి మాట్లాడారు. ప్రస్తుతం 9 ఎఐఐఎంఎస్ లు, మూడు డజన్లకు పైగా వైద్య కళాశాలలు ఉన్నాయన్నారు. 9 వైద్య కళాశాలలనుంచి ఈ స్థాయికి చేరినట్టు చెప్పారు. వైద్య విద్యా సీట్లు 1100 నుంచి 6000కు పెరిగాయన్నారు. రాజ్ కోట్ ఎఐఐఎంఎస్ పనిచేయడం ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి 1500 పడకల వైద్య మౌలికసదుపాయాలు మాతా శిశు సంరక్షణకు కలిగి ఉందన్నారు. కార్డియాలజీ, డయాలసిస్ వంటి వాటికి సదుపాయాలు ఎన్నోరెట్లుపెరిగాయని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆరోగ్య రంగంలో ముందస్తు గా వ్యాధులను గుర్తింపు ప్రాధాన్యతపై పునరుద్ఘాటించారు. పారిశుధ్యంపైన, యోగా , ఎక్సర్ సైజులపై శ్రద్ధ పెట్టాలన్నారు. మంచి ఆహారం, పరిశుభ్రమైన నీరు, పౌష్టికాహారం ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవలసిందిగా ప్రధానమంత్రి కచ్ ప్రాంత ప్రజలకు సూచించారు. పటేల్ కమ్యూనిటీ, కచ్‌ఫెస్టివల్‌ను విదేశాలలో కూడా నిర్వహించాలని, ఈ ఉత్సవాలకువిదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చేట్లు చూడాలన్నారు. ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాల ఏర్పాటుకు ప్రధానమంత్రి తన పిలుపును పునరుద్ఘాటించారు.
***********
DS
(Release ID: 1817523)
Visitor Counter : 158
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam