ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లెక్కలేనంత మంది భారతీయుల వ్యవస్థాపక నైపుణ్య ప్రదర్శనకు.. వారు ఉపాధి సృష్టికర్తలు కావడానికి ముద్ర యోజన ఒక అవకాశమిచ్చింది: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 08 APR 2022 6:31PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎవై)ను ప్రారంభించింది మొదలు లెక్కలేనంత మంది భారతీయులు తమ వ్యవస్థాపక నైపుణ్యం ప్రదర్శించడంతోపాటు ఉపాధి సృష్టికర్తలుగా అవతరించడానికి అవకాశం కల్పించిందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గత ఏడేళ్ల కాలంలో భారతీయుల ఆత్మగౌరవం పెంపుతోపాటు వారికి భాగ్యప్రదాతగా ముద్ర యోజన ఎనలేని పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ‘మైగవ్‌ఇండియా’ ట్వీట్‌పై స్పందిస్తూ ట్విట్టర్‌ద్వారా పంపిన సందేశంలో-

   “#సాయం అందనివారికి నిధులు” సూత్రం ప్రాతిపదికగా ముద్రా యోజన అసంఖ్యాక భారతీయులు తమ వ్యవస్థాపక నైపుణ్యం ప్రదర్శించడంసహా ఉద్యోగ సృష్టికర్తలుగా మారే  అవకాశం కల్పించింది. ఈ మేరకు మేం #’ఏడేళ్ల పీఎంఎంవై’ని గుర్తుచేసుకుంటున్న వేళ ఇది భారతీయుల ఆత్మగౌరవం పెంపుతోపాటు వారికి భాగ్యప్రదాతగా ఎనలేని పాత్ర పోషించిందని స్పష్టమవుతోంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు.


(रिलीज़ आईडी: 1815128) आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam