ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మార్చి నెల 29వ తేదీ న మధ్య ప్రదేశ్ లో 5 లక్షల మందికి పైగా పిఎమ్ఎవై-జిలబ్ధిదారుల ‘గృహ ప్రవేశం’ కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి


దేశం లో ప్రతి పేద కుటుంబాని కి ఒక పక్కా ఇంటి ని సమకూర్చడం కోసం ప్రధానమంత్రి చేస్తున్న కృషి లో ఇది మరొక అడుగు

प्रविष्टि तिथि: 28 MAR 2022 2:00PM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ్ (పిఎమ్ఎవై-జి) లబ్ధిదారులైన దాదాపు 5.21 లక్షల మంది జరుపుకొనే ‘గృహ ప్రవేశంకార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 29వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటల వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకోనున్నారు. సభికుల ను ఉద్దేశించి ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

 

దేశం లో లేమి లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాని కి అన్ని మౌలిక సౌకర్యాల తో ఒక పక్కా ఇంటి ని సమకూర్చాలన్నదే ప్రధాన మంత్రి నిరంతర కృషి గా ఉంటూ వస్తోంది. ఈ దిశ లో తాజా కార్యక్రమం మరో అడుగు కానుంది.

 

ఇదే కార్యక్రమం లో మధ్య ప్రదేశ్ వ్యాప్తం గా కొత్త ఇళ్ళ లో శంఖం, దీపం, పూలు మరియు రంగవల్లుల తో సాంప్రదాయిక వేడుకల ను కూడా నిర్వహించడం జరుగుతుంది.

 

మధ్య ప్రదేశ్ లో పిఎమ్ఎవై-జి అమలు సందర్భం లో మహిళా తాపీమేస్త్రీ లు సహా వేల కొద్దీ తాపీమేస్త్రీల కు శిక్షణ, ఫ్లయ్ యాష్ ఇటుకల ను ఉపయోగించడం, సెంట్రింగ్ మెటీరియల్ కోసం రుణాల ను ఇవ్వడం ద్వారా మహిళా స్వయంసహాయ సమూహాల (ఎస్ హెచ్ జి స్) సశక్తీకరణ, ప్రాజెక్టు ల పర్యవేక్షణ మరియు ఉత్తమ నిర్వహణ ల కోసం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడం వంటి అనేకమైన విశిష్ట మరియు కొత్త కొత్త చర్యల ను తీసుకోవడం జరుగుతోంది.

 

 

***


(रिलीज़ आईडी: 1810509) आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam