ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన పౌరుల కు టీకామందును ఇప్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషి లో ఈ రోజుఒక ముఖ్యమైన రోజు గా ఉందని పేర్కొన్న ప్రధాన మంత్రి


12 ఏళ్ళు మొదలుకొని 14 ఏళ్ళ వయస్సు వారు మరియు 60 ఏళ్ళ పైబడిన వారందరు టీకామందు నుఇప్పించుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు

Posted On: 16 MAR 2022 10:12AM by PIB Hyderabad

మన పౌరుల కు టీకామందు ను ఇప్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషి లో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 12 ఏళ్ళు మొదలుకొని 14 ఏళ్ళ వయస్సు వారు మరియు 60 ఏళ్ళ పైబడిన వారంతా టీకామందు ను ఇప్పించుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘మన పౌరుల కు టీకామందు ను ఇప్పించడం కోసం భారతదేశం చేస్తున్న కృషి లో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజుగా ఉంది. ఇక మీదట, 12 ఏళ్ళ వయస్సు మొదలుకొని 14 ఏళ్ళ వయస్సు ఉన్న వారు మరియు టీకామందు ను వేయించుకోవడానికి, 60 ఏళ్ళ పైబడిన వయస్సు వారంతా ప్రికాశన్ డోజుల ను తీసుకోవడాని కి అర్హులు. ఈ వయోవర్గాలకు చెందిన వారు అందరు టీకామందు ను ఇప్పించుకోవాలి అంటూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

 

‘‘యావత్తు భూ గ్రహం సంరక్షణ కు సంబంధించి భారతదేశం యొక్క సభ్యత కు అనుగుణం గా మనం వేక్సీన్ మైత్రి కార్యక్రమం లో భాగం గా అనేక దేశాల కు టీకా మందు ను పంపించాం. భారతదేశం యొక్క వేక్సినేశన్ ప్రయాస లు కోవిడ్-19 కి వ్యతిరేకం గా ప్రపంచం జరుపుతున్న యుద్ధాన్ని శక్తివంతం గా మార్చివేసినందుకు నేను సంతోషిస్తున్నాను.’’

 

‘‘ప్రస్తుతం, భారతదేశం లో మేడ్ ఇన్ ఇండియావేక్సీన్ లు అనేకం ఉన్నాయి. సముచితమైనటువంటి మదింపు ప్రక్రియ ను చేపట్టిన తరువాత ఇతర టీకామందుల కు కూడాను ఆమోదాన్ని మంజూరు చేశాం. ఈ ప్రాణాంతక మహమ్మారి తో పోరాడడం లో మనం ఎంతో మెరుగైనటువంటి స్థితి లో ఉన్నాం. అదే కాలం లో, కోవిడ్ కు సంబంధించిన ముందు జాగ్రత చర్యల ను అన్నిటి ని మనం తప్పక అనుసరించాలి’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(Release ID: 1806582) Visitor Counter : 181