ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా-యుఎఇ వర్చువల్ సమిట్

Posted On: 16 FEB 2022 7:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు అబు ధాబి క్రౌన్ ప్రిన్స్, ఇంకా యుఎఇ సాయుధ బలగాల డిప్యూటీ సుప్రీం కమాండర్ శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ 2022వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ నాడు ఒక వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు. భారతదేశం తన స్వాతంత్య్రాని కి 75 సంవత్సరాల ను ‘ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్’ గా జరుపుకొంటున్న మరియు యుఎఇ తన స్థాపన తాలూకు 50వ వార్షికోత్సవాన్ని వేడుక గా జరుపుకొంటన్న సందర్భం లో రెండు దేశాల మధ్య చరిత్రాత్మకమైనటువంటి మరియు మైత్రిపూర్ణమైనటువంటి సంబంధాల పట్ల వారి దృష్టి కోణాన్ని నేత లు ఇరువురు వెల్లడి చేసే అవకాశం ఉంది.


ఇరువురు నేత లు ద్వైపాక్షిక సహకారాన్ని గురించి చర్చించడం తో పాటు పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాల పైన మరియు అంతర్జాతీయ అంశాల పైన వారి అభిప్రాయాల ను కూడా ఒకరికి మరొకరు తెలియజేసుకోనున్నారు.


ఇటీవలి కొన్నేళ్ళ లో భారతదేశాని కి, యుఎఇ కి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అన్ని రంగాల లో సుదృఢం అయ్యాయి. అంతేకాక ఇరు పక్షాలు కలిసికట్టుగా ఒక విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మొదలుపెట్టాయి. ప్రధాన మంత్రి 2015వ సంవత్సరం లో, 2018వ సంవత్సరం లో మరియు 2019వ సంవత్సరం లో యుఎఇ ని సందర్శించారు; అబు ధాబి క్రౌన్ ప్రిన్స్ 2016వ సంవత్సరం లో మరియు 2017వ సంవత్సరం లో భారతదేశాన్ని సందర్శించారు. రెండు పక్షాల మధ్య మంత్రుల స్థాయి సంద్భనలు కూడా నిరంతరం సాగుతున్నాయి. వాటి లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జరిపిన మూడు యాత్ర లు, 2021వ సంవత్సరం లో వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ మంత్రి యుఎఇ సందర్శన భాగం గా ఉన్నాయి.

 

కోవిడ్-19 మహమ్మారి కాలం లో ఆరోగ్య సంరక్షణ, ఇంకా ఆహార భద్రత వంటి ముఖ్య రంగాల లో ఉభయ పక్షాలు సన్నిహిత సమన్వయం తో పని చేశాయి. ద్వైపాక్షిక వ్యాపారం, పెట్టుబడి, ఇంకా శక్తి సంబంధాలు నిరంతరం పటిష్టం గా ఉన్నాయి. దీనితో పాటు ఉభయ పక్షాలు నవీకరణ యోగ్య శక్తి, స్టార్ట్-అప్స్, ఫిన్ టెక్ వగైరా కొత్త రంగాల లో వాటి సహకారాన్ని బలపరచుకొంటున్నాయి. దుబయి ఎక్స్ పో 2020 లో అన్నిటికంటే పెద్ద మండపాల లో ఒక మండపం లేదా పెవిలియన్ లో భారతదేశం పాలుపంచుకొంటోంది.


ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమం ఏది అంటే అది కోంప్రిహెన్సివ్ ఇకానామిక్ పార్ట్ నర్ శిప్ అగ్రిమెంట్ (సిఇపిఎ) అనేదే. సిఇపిఎ సంబంధి సంప్రదింపులు 2021వ సంవత్సరం సెప్టెంబర్ లో మొదలై, అవి పూర్తి అయ్యాయి కూడాను. ఈ ఒప్పందం భారతదేశానికి, యుఎఇ కి మధ్య ఆర్థికపరమైన మరియు వాణిజ్యపరమైన బంధాన్ని తదుపరి స్థాయి కి తీసుకు పోనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిజానికి భారతదేశాని కి మూడో అతి పెద్ద వ్యాపార భాగస్వామి గా ఉంది. మరి ద్వైపాక్షిక వ్యాపారం, ఇంకా పెట్టుబడి సంబంధాల లో చెప్పుకోదగ్గ వృద్ధి చోటుచేసుకోగలదన్న అంచనా ఉంది.


యుఎఇ లో విశాలమైన భారతీయ సముదాయం నివసిస్తున్నది. ఈ సముదాయం సంఖ్య సుమారు 3.5 మిలియన్ గా లెక్క కు వస్తుంది. మహమ్మారి కాలం లో భారతదేశ సముదాయాని కి సమర్ధన ను అందించినందుకు గాను యుఎఇ నాయకత్వాని కి భారతదేశం పక్షాన ప్రశంస ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. యుఎఇ నాయకత్వం సైతం భారతదేశాని కి చెందిన సముదాయం అభివృద్ధి పరం గా అందించిన తోడ్పాటు ను అభినందించింది. మహమ్మారి కాలం లో ఇరు పక్షాలు ఒక ‘ఎయర్ బబుల్ అరేంజ్ మెంట్ ’ అంశం లో పరస్పరం అంగీకారాన్ని వ్యక్త పరచాయి. తత్ఫలితం గా, కోవిడ్-19 వివిధ సవాళ్ళ ను రువ్వినప్పటికీ ఉభయ దేశాల ప్రజల మధ్య రాక పోకలు సాధ్యపడ్డాయి.

 

***

 



(Release ID: 1799246) Visitor Counter : 87