ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్య సభ లో రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కిప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం


‘‘దేశం 100 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని ఉత్సవం గా జరుపుకొనేటప్పటికల్లాదేశాన్ని ఎక్కడికి, ఏ విధం గా ముందుకు తీసుకు పోవాలో ఆలోచించడానికి ఇదిచాలా ముఖ్యమైన కాలం’’

‘‘భారతదేశ ప్రజానీకం టీకా మందు ను తీసుకొంది.  వారు కేవలం వారిని వారు కాపాడుకోవడానికే  కాకుండా ఇతరుల ను కూడా కాపాడడం కోసం ఈ పని నిచేశారు.  టీకా మందు కు వ్యతిరేకం గా ప్రపంచం లో అనేక ఉద్యమాలుజరుగుతూ ఉండగా ఈ తరహా నడవడిక అనేది ప్రశంసాపాత్రం’’

‘‘మహమ్మారి ప్రబలిన ఈ కాలం లో, భారతదేశం యొక్క పురోగతి ని గురించి ప్రజలుప్రశ్నలు వేస్తూనే ఉన్నారు; అయితే, 80 కోట్ల మంది పౌరులు ఆహార పదార్థాల ను ఉచితం గాఅందుకొనేటట్లు గా భారతదేశం చూసింది’’

‘‘అధికారం లో ఉన్నా, లేకపోయినా ప్రజల కోసం మనం కృషి చేయాల్సిందే.  ప్రతిపక్షం లోఉన్నాం కాబట్టి ప్రజల సమస్యల ను పరిష్కరించేందుకు కృషి చేయడం ఆపేయాలి అనే  మనస్తత్వం అనుచితమైనటువంటిది’’

‘‘కోవిడ్-19 తో పోరాడటం అనేది కూడా ఒక బలమైన మరియు స్నేహపూర్ణమైనసమాఖ్య స్వరూపమే.  ఈ అంశం పై గౌరవనీయ ముఖ్యమంత్రుల తో 23 సమావేశాలు జరిగాయి’’

‘‘మేము జాతీయ పురోగతి కి మరియు ప్రాంతీయ ఆకాంక్షల కుమధ్య ఎటువంటి సంఘర్షణల ను గమనించడం లేదు’’

Posted On: 08 FEB 2022 4:12PM by PIB Hyderabad

పార్లమెంటు ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్య సభ లో సమాధానం ఇచ్చారు. ‘‘స్వాతంత్య్రం అనంతరం 100 సంవత్సరాల ను దేశం జరుపుకొనేటప్పటికల్లా దేశ ప్రజల ను ఎక్కడి కి, ఏ విధం గా తీసుకు పోవాలో ఆలోచించడాని కి ఇది చాలా ముఖ్యమైనటువంటి కాలం’’ అని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పేర్కొన్నారు. దీనికి గాను తీసుకొన్న సంకల్పాన్ని నెరవేర్చడం కోసం మనం సమష్టి భాగస్వామ్యాన్ని, సమష్టి స్వామిత్వాన్ని చేపట్టవలసిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను అన్నారు.

 

 

ప్రపంచం ఇప్పటికీ కూడా కోవిడ్-19తో పోరాడుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన 100 సంవత్సరాల లో మానవాళి ఈ తరహా సవాలు ను మరి దేనిని కూడా ఎదుర్కొననే లేదు. భారతదేశ ప్రజానీకం టీకామందు ను వేయించుకొంది. మరి వారు ఈ పని ని కేవలం వారి ని వారు కాపాడుకోవడానికే చేయలేదు, ఇతరుల ను కాపాడుకోవడాని కి కూడా వారు ఈ పని ని చేశారు. ఎప్పుడైతే ప్రపంచం లో టీకామందు కు వ్యతిరేకం గా ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉన్న వేళ లో ఈ తరహా నడవడిక వ్యక్తం కావడం ప్రశంసనీయం అని ఆయన అన్నారు.

 

 

  • కాలం లో భారతదేశం పురోగతి ని గురించి ప్రజలు ప్రశ్నల ను లేవనెత్తడం చేస్తూ వచ్చారు. అయితే, భారతదేశం 80 కోట్ల మంది పౌరుల కు ఉచితం గా ఆహార పదార్థాలు అందించేందుకు పూచీ పడింది అని ప్రధాన మంత్రి అన్నారు. పేద ప్రజల కోసం రికార్డు సంఖ్య లో ఇళ్ళ ను నిర్మించేందుకు కూడా భారతదేశం పూచీ పడింది. ఈ గృహాల లో నీటి సరఫరా సదుపాయాన్ని జత చేయడం జరిగింది. ఈ కాలం లో మేం 5 కోట్ల మంది ప్రజల కు నీటి ని నల్లా ద్వారా అందించాం. మరి ఒక కొత్త రికార్డు ను నెలకొల్పాం. మా యొక్క హేతుబద్ధమైన దృష్టి కోణం కారణం గా మన రైతులు కాలం లో దండి గా పంటల ను పండించారు. కాలం లో మౌలిక సదుపాయాల కు సంబంధించిన పథకాల ను ఎన్నిటినో మేము పూర్తి చేశాం. దీనికి కారణం ఆ కోవ కు చెందిన మౌలిక సదుపాయాల కు సంబంధించిన పథకాలు సవాలు తో నిండిన కాలాల్లో ఉద్యోగాల కు పూచీ పడతాయి అని మేము విశ్వసించడమే. కాలం లో మన యువత క్రీడల లో పెద్ద పెద్ద అడుగుల ను వేశారు. మరి వారు దేశాని కి కీర్తి ని సంపాదించి పెట్టారు. భారతీయ యువజనులు వారి స్టార్ట్-అప్స్ తో భారతదేశాన్ని ప్రపంచం లో అగ్రగామి మూడు స్టార్ట్-అప్స్ నిలయాల లో ఒకటి గా తీర్చిదిద్దారు అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

మహమ్మారి కాలం లో అది సిఒపి 26 కావచ్చు, లేదా జి20 కి సంబంధించిన అంశం కావచ్చు, లేదా 150కి పైగా దేశాల లో ఔషధ ఎగుమతి కి సంబంధించిన విషయం కావచ్చు.. భారతదేశం ఒక నాయకత్వ పాత్ర ను పోషించింది. మరి దీనిని గురించి యావత్తు ప్రపంచం చర్చిస్తోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మేము మహమ్మారి కాలం లో వ్యవసాయ రంగంపైన, ఎమ్ఎస్ఎమ్ఇ రంగం పైన మరింత శ్రద్ధ తీసుకొన్నాం అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

 

 

ఉపాధి కల్పన కు సంబంధించిన సమాచారాన్ని ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, 2021వ సంవత్సరం లో సుమారు గా ఒక కోటి ఇరవై లక్షల మంది ఇపిఎఫ్ఒ పోర్టల్ లో వారి పేర్ల ను నమోదు చేసుకొన్నారని ఇపిఎఫ్ఒ పేరోల్ డేటా తెలియ జేస్తోంది అని పేర్కొన్నారు. ఇవి అన్నీ కూడాను వ్యవస్థీకృత రంగం లో ఉద్యోగాలు గా ఉన్నాయి. మరి వీటిలో ఇంచుమించు 60 లక్షల నుంచి 65 లక్షల మంది వరకు చూస్తే వారి వయస్సు 18 ఏళ్ళు మొదలుకొని 25 ఏళ్ళ మధ్య ఉంటుంది, దీనికి అర్థం అది వారికి ఒకటో కొలువు అన్నదే అని ఆయన వివరించారు. ధర ల పెరుగుదల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం మేము మా యొక్క అత్యుత్తమమైనటువంటి ప్రయత్నాల ను చేశాం. మరి ఇతర దేశాల కు చెందిన ఆర్థిక వ్యవస్థల తో ఈ విషయాన్ని మనము పోల్చి చూసినప్పుడు ప్రస్తుతం భారతదేశం అధిక వృద్ధి ని, మధ్యస్థ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేస్తున్న ఒకే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉంది అని చెప్పుకోవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు.

అధికార పక్షం లో ఉన్నామా లేక అవతలి వైపున ఉన్నామా అనే దానితో సంబంధం లేకుండా ప్రజల కోసం మనం కృషి చేయవలసిందే అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతిపక్షం లో ఉన్నందువల్ల ప్రజల సమస్యల ను పరిష్కరించే దిశ గా కృషి చేయడం మానేయాలి అనే మనస్తత్వం పొరపాటు అని ఆయన అన్నారు. భారతదేశం పౌరులందరికీ టీకా మందు ను ఇప్పించే కార్యక్రమం తీసుకోవడం ఘనకార్యం ఏమీ కాదు అని కొంత మంది గౌరవనీయ సభ్యులు వ్యాఖ్యానించడం తో తాను ఆశ్చర్యాని కి లోనైనట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మహమ్మారి మొదలైనప్పటి నుంచే దేశం లోను, ప్రపంచం లోను అందుబాటు లో ఉన్న ప్రతి వనరు ను కూడగట్టేందుకు ప్రభుత్వం సకల ప్రయాసల కు నడుం కట్టింది అని ఆయన అన్నారు. మహమ్మారి ప్రాబల్యం కొనసాగినంత కాలం దేశం లో పేదల ను మేము రక్షిస్తూనే ఉంటాము అంటూ ప్రతి ఒక్కరి కి ఆయన హామీ ఇచ్చారు.

కోవిడ్-19తో పోరాటం అంటే అది కూడా ఒక బలమైనటువంటి మరియు స్నేహపూర్ణమైనటువంటి సమాఖ్య స్వరూపం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ విషయం లో గౌరవనీయ ముఖ్యమంత్రుల తో 23 సమావేశాలు జరిగాయి అని ఆయన చెప్పారు. కోవిడ్-19 అంశం పై జరిగిన అఖిల పక్ష సమావేశాని కి హాజరు కాకుండా ప్రతిపక్షాలు ఆ సమావేశాన్ని బహిష్కరించినందుకు ఆయన దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దేశం లో 80 వేల కు పైగా హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లు ఆయుష్మాన్ భారత్ లో భాగం గా విధుల ను నిర్వర్తిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సెంటర్ లు గ్రామం సమీపంలోను, ఇంటి వద్ద ఉచితం గా పరీక్షల ను నిర్వహించడం సహా ఉత్తమమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ను అందిస్తున్నాయి అని ఆయన వివరించారు.

ప్రజాస్వామ్యం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 1975వ సంవత్సరం లో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కిన వారి వద్ద నుంచి ప్రజాస్వామ్యం లో పాఠాల ను మేము ఎన్నటికీ నేర్చుకోబోము అని పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యాని కి ఉన్న అతి ప్రధానమైన బెదరింపు ఏదీ అంటే అది వంశవాద పక్షాలే. ఎప్పుడైతే ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ లో అతి ప్రాబల్యాన్ని కలిగి ఉంటుందో, అప్పుడు రాజకీయ ప్రతిభ కు నష్టం వాటిల్లుతుంది అని ఆయన అన్నారు.

కొంత మంది సభ్యులు ‘‘ఒక వేళ కాంగ్రెస్ లేకపోయినట్లయితే ఏమి అవుతుంది?’’ అని అడిగారు అని ప్రధాన మంత్రి అన్నారు. దీనికి సమాధానం గా నేను ఏమని చెబుతాను అంటే, ‘‘ఒకవేళ కాంగ్రెస్ లేకపోతే.. అప్పుడు ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉండదు, కుల రాజకీయాలు చోటు చేసుకోవు, సిఖ్కుల సామూహిక హత్య ఎన్నటికీ జరిగి ఉండేదే కాదు, కశ్మీర్ లోని పండితుల సమస్య లు తలెత్తేవే కావు’’ అని పేర్కొన్నారు.

దేశ పురోగతి కి మరియు ప్రాంతీయ ఆకాంక్షల కు మధ్య మేము ఎలాంటి విరోధాల ను గమనించడం లేదు అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. దేశం యొక్క అభివృద్ధి ని దృష్టి లో పెట్టుకొని ప్రాంతీయ ఆకాంక్షల ను నెరవేర్చినప్పుడు, భారతదేశం వికాసం మరింత బలాన్ని పుంజుకొంటుంది. ఎప్పుడైతే మన రాష్ట్రాలు ముందుకు పోతాయో, దేశం కూడా అప్పుడు ముందడుగు వేస్తుంది అని ఆయన అన్నారు.

భేదం చూపే సంప్రదాయాని కి మనం ముగించాలి; ఇంకా అటువంటి మనస్తత్వం తో కలసి నడవడం అనేది తక్షణావసరం అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. యావత్తు ప్రపంచం, మరి అలాగే ఒక సువర్ణ కాలం అనేవి ఒక ఆశ తో భారతదేశానికేసి చూస్తున్నాయి, ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు అని ఆయన అన్నారు.

*****

DS/AKJ/LP

 


(Release ID: 1796584) Visitor Counter : 174