ఆర్థిక మంత్రిత్వ శాఖ
నమూనా మార్పు కోసం పట్టణ అభివృద్ధిని మెరుగుపరచడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన
Posted On:
01 FEB 2022 1:17PM by PIB Hyderabad
పట్టణ రంగ విధానాలు, సామర్ధ్య నిర్మాణం, ప్రణాళిక, అమలు, పాలనపై సిఫార్సులు చేసి, రూపావళిలో మార్పును తెచ్చేందుకు ప్రముఖ పట్టణ ప్రణాళికావేత్తలు, పట్టణ ఆర్థికవేత్తలు, సంస్థలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నేడు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2022-23ను ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
భారతదేశం స్వాతంత్ర్యం సాధించి @100 అయ్యే సమయానికి, జనాభాలో దాదాపు సగంమంది పట్టణ ప్రాంతాల్లో నివసించే అవకాశం ఉన్నందున పట్టణ ప్రణాళికను సాధారణ పద్ధతిలో కొనసాగించలేమని, శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు తయారయ్యేందుకు, క్రమబద్ధమైన పట్టణాభివృద్ధి కీలక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని, ఎందుకంటే, జీవనోపాధి అవకాశాలను జనాభా ప్రాతిపదికను కల్పించడం సహా దేశ ఆర్థిక సంభావ్యతను సాధించడంలో ఇది తోడ్పడుతుందని అన్నారు. ఇందుకోసం, ఒకవైపు, మనం మెగా సిటీలను పోషిస్తూ, వాటి పృష్టభూములు ఆర్థిక వృద్ధికి ప్రస్తుత కేంద్రాలు అవుతాయని, మరోవైపు టైర్ 2 - 3 నగరాలు భవిష్యత్తులో నాయకత్వాన్ని అందిపుచ్చుకునేందుకు వాటికి మార్గాన్ని సుగమం చేయాలన్నారు.
మహిళలు, యువత సహా అందరికీ అవకాశాలను కల్పించే సుస్థిర జీవన కేంద్రాలుగా భారతదేశ నగరాలను పునర్నిర్మించాలని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1794283)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam