ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సామాజిక కార్యకర్త మరియు పద్మ పురస్కార గ్రహీత శాంతి దేవి జీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 JAN 2022 5:59PM by PIB Hyderabad

ప్రఖ్యాత సామాజిక కార్యకర్త మరియు పద్మ పురస్కార గ్రహీత అయిన శ్రీమతి శాంతి దేవి జీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘శాంతి దేవి జీ ని పేదల వాణి గాను, ఆదరణ కు నోచుకోని వర్గాల వారి వాణి గాను స్మరించుకోవడం జరుగుతుంది.  కష్టాల ను దూరం చేయడం కోసం మరియు ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని, అలాగే న్యాయపూర్ణమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దడం కోసం ఆవిడ నిస్వార్థ భావం తో పాటుపడ్డారు.  ఆమె మరణించారని తెలిసి దు:ఖం కలిగింది.  ఆమె కుటుంబానికి మరియు అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఆమె ప్రశంసకుల కు కలిగిన దు:ఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 

*****

DS/AK


(रिलीज़ आईडी: 1790740) आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam