ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2021 డిసెంబర్ 28 న మంగళవారం ఐఐటి, కాన్ పుర్ స్నాతకోత్సవాన్నిఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి ఉపన్యాసం కోసం ఆలోచనల ను వెల్లడించవలసింది గా ఐఐటి కాన్ పుర్, ఇతర ఐఐటి ల విద్యార్థుల కు మరియు ఐఐటిపూర్వ విద్యార్థుల కు ఆయన పిలుపునిచ్చారు

Posted On: 22 DEC 2021 10:17AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ న మంగళవారం నాడు జరుగనున్న ఐఐటి, కాన్ పుర్ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి ఉపన్యాసాని కి ఉపయోగపడేటటువంటి ఆలోచనల ను వెల్లడించవలసిందంటూ ఐఐటి కాన్ పుర్ విద్యార్థుల కు, ఇతర ఐఐటి ల కు చెందిన విద్యార్థుల కు మరియు ప్రపంచం అంతటా విస్తరించిన ఐఐటి పూర్వ విద్యార్థి సమూహాని కి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నేను స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించడం కోసం ఈ నెల 28వ తేదీ న @IITKanpur కు వెళ్తున్నాను. ఇది హుషారైనటువంటి సంస్థ. ఈ సంస్థ విజ్ఞానశాస్త్రం మరియు నూతన ఆవిష్కరణ ల దిశ లో మార్గదర్శకమైనటువంటి తోడ్పాటుల ను అందించింది.

మీ మీ సూచనల తో, సలహాల తో ముందుకు రండి అంటూ మీ అందరి ని నేను ఆహ్వానిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 


 

 

***

DS/SH

 


(Release ID: 1784134) Visitor Counter : 171