ప్రధాన మంత్రి కార్యాలయం
2021 డిసెంబరు 26నాటి ‘మన్ కీ బాత్’ కోసం అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి పిలుపు
Posted On:
18 DEC 2021 10:14AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబరు 26న తాను నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కోసం అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“నేను ఈ సంవత్సరం చివరిదైన ‘మన్ కీ బాత్’ (#MannKiBaat) కార్యక్రమాన్ని ఈ నెల 26న నిర్వహించనున్న నేపథ్యంలో అనేక సూచనలు అందుతున్నాయి. ఇవన్నీ దేశంలోని అనేక విభిన్న ప్రాంతాలకు సంబంధించినవిగా ఉంటాయి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తుల జీవన యానాన్ని ప్రతిబింబిస్తాయి. ఇందులో భాగంగా మీ అభిప్రాయాలను పంచుకోవడం కొనసాగించండి” అని ఆయన అందులో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1783008)
Read this release in:
Tamil
,
Malayalam
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia