ప్రధాన మంత్రి కార్యాలయం
యుకె కి చెందిన రాయల్ గోల్డ్ మెడల్ 2022 ను ప్రసిద్ధ భవన శిల్పి శ్రీ బాలకృష్ణదోశీ కి ఇస్తున్న సందర్భం లో ఆయన కు అభినందనలు తెలియజేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 DEC 2021 2:18PM by PIB Hyderabad
ప్రసిద్ధ భవన శిల్పి శ్రీ బాలకృష్ణ దోశీ కి రాయల్ గోల్డ్ మెడల్ 2022 ను ఇస్తున్న సందర్భం లో ఆయన తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడి, అభినందనలు తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రసిద్ధ భవన శిల్పి శ్రీ బాలకృష్ణ దోశీ గారి తో మాట్లాడాను; రాయల్ గోల్డ్ మెడల్ 2022 ను ఆయన కు ఇవ్వనున్నారని తెలిసి అభినందనలు తెలియజేశాను. భవన నిర్మాణ జగతి కి ఆయన అందించిన తోడ్పాటు లు ఎంతో ప్రతిష్ఠితమైనటువంటివి. ఆయన కృతులను వాటి రచనాత్మకత కు, వాటి అద్వితీయత కు మరియు వాటి వైవిధ్యభరితమైన స్వరూపానికి గాను ప్రపంచవ్యాప్తం గా ప్రశంసించడం జరుగుతోంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1780084)
సందర్శకుల సూచీ సంఖ్య : : 157
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam