ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రజల కుటీకా మందు ను ఇప్పించే కార్యక్రమం అల్ప స్థాయి లో ఉన్నటువంటి జిల్లాల తో నవంబరు 3న సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్న ప్రధాన మంత్రి

Posted On: 31 OCT 2021 1:38PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జి20 శిఖర సమ్మేళనానికి, సిఒపి26 కు హాజరై స్వదేశాని కి తిరిగి వచ్చిన వెంటనే, నవంబరు 3 న మధ్యాహ్నం 12 గంటల వేళ కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా, టీకాకరణ కార్యక్రమం మందకొడిగా సాగుతూ ఉన్న జిల్లాల తో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.
 
ఈ సమావేశం లో కోవిడ్ టీకా మందు తాలూకు ఒకటో డోజు ను 50 శాతం కన్నా తక్కువ గా ఇచ్చిన జిల్లాల తో పాటు ఆ టీకా మందు తాలూకు రెండో డోజు ను ఇప్పించడం లో మందకొడి గా ఉన్న జిల్లా లు పాల్గొంటాయి. ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఝార్ ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర , మేఘాలయ, ఇంకా ఇతర రాష్ట్రాల లో వ్యాక్సీనేశన్ కవరేజి అల్పం గా ఉన్న 40కి పైగా జిల్లాల కు చెందిన జిల్లా మేజిస్ట్రేట్ లతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమం లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు.
 

 

 

***



(Release ID: 1768613) Visitor Counter : 138