ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యుపిఎస్‌సి సివిల్ స‌ర్వీసుల ప‌రీక్ష‌ల‌లో విజ‌యం సాధించిన వారికి అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 25 SEP 2021 4:42AM by PIB Hyderabad

యుపిఎస్‌సి సివిల్ స‌ర్వీసుల‌లో విజ‌యం సాధించిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.
ఇందుకు సంబంధించి ట్విట్ట‌ర్‌ద్వారా ప‌లు సందేశాలు ఇస్తూ ఆయన‌,
యుపిఎస్ సి సివిల్ స‌ర్వీసు ప‌రీక్ష‌ల‌లో విజ‌యం సాధించిన విద్యార్ధుల‌కు అభినంద‌న‌లు. సంతృప్తిక‌ర‌మైన‌, ఉత్తేజ‌భ‌రిత‌మైన ప్రజాసేవ కెరీర్ మీకోసం ఎదురుచూస్తోంది. ఈ ప‌రీక్ష‌ల‌లో విజయం సాధించిన వారు కీల‌క పాల‌నాప‌ర‌మైన పాత్ర‌ల‌లో ప‌నిచేయ‌నున్నారు. అది కూడా దేశ కీల‌క ప్ర‌యాణంలో మీరు ఈ బాధ్య‌తలు నిర్వ‌ర్తించ‌నున్నారు.
యుపిఎస్‌సి ప‌రీక్ష‌లలో విజ‌యం సాధించ‌లేక‌పోయిన  యువ మిత్రుల‌కు నేను ఒక విష‌యం చెప్ప‌ద‌ల‌చుకున్నాను. అదేమంటే, మీరంతా ఎంతో ప్ర‌తిభ క‌ల‌వారు.మ‌రిన్ని ప్ర‌య‌త్నాలు ఉండ‌నే ఉన్నాయి.
అదే స‌మ‌యంలో ఇండియాలో వైవిధ్యంతోకూడిన అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. మీరు ఏం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాదానికి నా అభినంద‌న‌లు. అని ప్ర‌ధాన‌మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***

DS/SH


(Release ID: 1757923) Visitor Counter : 188