ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, జపాన్ ప్రధాని శ్రీ సుగా యోశీహిదే కుమధ్య జరిగిన సమావేశం 

Posted On: 24 SEP 2021 5:15AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్వాడ్ లీడర్స్ సమిట్ సందర్భం లో 2021, సెప్టెంబర్ 23 న వాశింగ్ టన్ డిసి లో జపాన్ ప్రధాని శ్రీ సుగా యోశీహిదే తో సమావేశమయ్యారు.

ప్రధానులు ఇరువురు తాము తొలిసారి గా ముఖాముఖి సమావేశం అవుతూ ఉండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2020 సెప్టెంబర్ లో జపాన్ ప్రధాన మంత్రి గా శ్రీ సుగా పదవీ బాధ్యతల ను స్వీకరించిన అప్పటి నుంచి వారు ఇరువురి మధ్య మూడుసార్లు జరిగిన టెలిఫోన్ సంభాషణల ను వారు ఎంతో మక్కువ గా గుర్తు కు తెచ్చుకొన్నారు. ప్రధాని గాను, అంతక్రితం చీఫ్ కేబినెట్ సెక్రటరి గాను గత కొన్ని సంవత్సరాల లో భారతదేశానికి, జపాన్ కు మధ్య ప్రత్యేకమైన, వ్యూహాత్మకమైన మరియు ప్రపంచ పరమైన భాగస్వామ్యం విషయాల లో గొప్ప ప్రగతి చోటు చేసుకొనేటట్లు చూడటం లో శ్రీ సుగా వ్యక్తిగత నిబద్ధత కు, ఆయన నాయకత్వ పటిమ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ సుగా కు ధన్యవాదాలు పలికారు. ప్రపంచ మహమ్మారి నడుమ టోక్యో ఒలింపిక్ క్రీడోత్సవాల ను, పారాలింపిక్ గేమ్స్ ను సఫలతపూర్వకం గా ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గాను ప్రధాని శ్రీ సుగా కు ఆయన అభినందనలు తెలిపారు.

ప్రధానులు ఇద్దరు ఉభయ దేశాల మధ్య గల బహుముఖీన సంబంధాలను సమీక్షించారు. అఫ్ గానిస్తాన్ తో సహా ఇటీవలి ప్రాంతీయ పరిణామాల పై, ప్రపంచ పరిణామాల పై వారు వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకొన్నారు. ఒక స్వతంత్రమైనటవంటి, బాహాటమైనటువంటి, అన్ని పక్షాల ను కలుపుకుపోయేటటువంటి ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ఆవిష్కరించే దిశ లో కృషి చేయాలని వారు వారి వచన బద్ధత ను పునరుద్ఘాటించారు. రక్షణ ఉపకరణాలు, సాంకేతికతల రంగం లో ద్వైపాక్షిక రక్షణ, భద్రత పరమైన సహకారాన్ని పెంపొందించుకోవాలి అనే విషయం లో వారు అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం పెరుగుతూ ఉండడాన్ని ప్రధానులు ఇద్దరు స్వాగతించారు. జపాన్, భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య ఈ సంవత్సరం మొదట్లో ఆటుపోటుల కు తట్టుకొని నిలచేటటువంటి, వైవిధ్యభరితమైనటువంటి, బరోసా తో కూడినటువంటి సప్లయి చైన్ ఏర్పాటు చేసే ఉద్దేశ్యం తో ఒక సమన్వయ పూరిత యంత్రాంగం రూపం లో సప్లయ్ చైన్ రెజిలియన్స్ ఇనిశియేటివ్ (ఎస్ సిఆర్ఐ) ని ప్రవేశపెట్టడాన్ని స్వాగతించారు. తయారీ రంగం, సూక్ష్మ, లఘు, మధ్య తరహా వాణిజ్య సంస్థ లు (ఎమ్ఎస్ఎమ్ఇ) రంగం, ఇంకా నైపుణ్యాభివృద్ధి రంగం లలో ద్వైపాక్షిక భాగస్వామ్యాల ను అభివృద్ధి పరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ సంవత్సరం మొదట్లో సంతకాలు అయిన స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ (ఎస్ఎస్ డబ్ల్యు) అగ్రిమెంట్ ను ఆచరణ లోకి తీసుకు రావడం కోసం 2022 సంవత్సరం ఆరంభ కాలం నుంచి భారతదేశం లో నైపుణ్య పరీక్షల ను, భాష సంబంధి పరీక్షల ను జపాన్ చేపట్టనుంది అని ప్రధాని శ్రీ సుగా ఈ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టి కి తీసుకు వచ్చారు.

కోవిడ్ -19 మహమ్మారి ని గురించి, ఆ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడం కోసం చేస్తున్న ప్రయత్నాల ను గురించి ప్రధాన మంత్రులు ఇద్దరు చర్చించారు. డిజిటల్ టెక్నాలజీ ల ప్రాముఖ్యం పెరగడం గురించి వారు ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ విషయం లో భారతదేశం-జపాన్ డిజిటల్ భాగస్వామ్యం లో, ప్రత్యేకించి స్టార్ట్-అప్స్ లో ప్రగతి ని వారు సానుకూల దృక్పథం తో మూల్యాంకనం చేశారు. కొత్త గా రూపొందుతున్న వివిధ సాంకేతికత లలో మరింత సహకారాన్ని అందించుకోవాలి అనే విషయం లో వారు వారి ఆలోచన లను వెల్లడి చేసుకొన్నారు. జల వాయు పరివర్తన తో ముడిపడ్డ అంశాల పైన, గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిశన్ పైన కూడా చర్చలు జరిగాయి. భారతదేశం సంకల్పించిన నేశనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిశన్ కు జపాన్ సహకారాన్ని అందించే అవకాశం పైన సైతం చర్చ జరిగింది.

ముంబయి-అహమదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎమ్ఎహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు ను అనుకున్న కాలానికే అమలు లోకి తీసుకు రావడం కోసం చేయవలసిన కృషి ని వేగిర పరచాలని ప్రధాన మంత్రులు ఇద్దరు వారి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.

ఇండియా-జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ ద్వారా భారతదేశం లోని ఈశాన్య ప్రాంతం లో తలపెట్టిన ద్వైపాక్షిక అభివృద్ధి పథకాల లో ప్రగతి ని నేతలు ఇద్దరు స్వాగతించారు. ఆ తరహా సహకారాన్ని మరింత గా పెంచడానికి గల అవకాశాల ను గురించి వారు మాట్లాడుకొన్నారు.

గత కొన్నేళ్ళ లో భారతదేశం-జపాన్ భాగస్వామ్యం ద్వారా లభించిన బలమైన గతి జపాన్ లో కొత్త పాలన యంత్రాంగం హయాం లో సైతం కొనసాగ గలదన్న విశ్వాసాన్ని ప్రధాని శ్రీ సుగా వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తు లో జరిగే ఇండియా-జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం కోసం జపాన్ తదుపరి ప్రధాని ని భారతదేశం లోకి స్వాగతించడానికి ఎదురుచూస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

 

 

***


(Release ID: 1757698) Visitor Counter : 254