సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సందర్శనీయ వారోత్సవాలను ( 'ఐకానిక్ వీక్' ) ప్రారంభించనున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

ప్రజా భాగస్వామ్యం ప్రాధాన్యత తెలియజేసే ఈ- పుస్తకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లఘు ప్రదర్శనల నిర్వహణ

' నూతన భారత నిర్మాణ దిశగా ప్రయాణం' అనే అంశంపై డాక్యుమెంటరీ చిత్రాలు, ప్రదర్శనలను ప్రసారం చేయనున్న డీడీ నెట్ వర్క్

దేశభక్తి/ప్రాచీన చిత్రాలను ప్రదర్శించడానికి చలన చిత్రోత్సవాల నిర్వహణ

యువత కోసం సామాజిక మాధ్యమాల ద్వారా చర్చలు, క్విజ్‌లు, పోటీలు

Posted On: 22 AUG 2021 5:28PM by PIB Hyderabad

ఆజాది కా అమృత్ మహోత్సవంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ 2021 ఆగస్ట్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సందర్శనీయ వారోత్సవాలను ( 'ఐకానిక్ వీక్' ) నిర్వహించనున్నది.  మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న కార్యక్రమాలను  కేంద్ర సమాచార ప్రసార శాఖ  మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ప్రారంభిస్తారు. ప్రజా భాగస్వామ్యం, సామజిక ఉద్యమ స్ఫూర్తికి ప్రాధాన్యత ఇస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన కార్యక్రమాలను ఈ వారోత్సవాల్లో ప్రదర్శిస్తారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గుర్తింపు పొందని వీరులను ప్రజలకు పరిచయం చేస్తూ నవ భారత నిర్మాణంలో స్వాతంత్ర్య సమరయోధుల పాత్ర ఈ దిశలో సాగుతున్న దేశ ప్రయాణాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. సాంస్కృతిక ప్రదర్శనలు, వీధి నాటకాలు లాంటి సంప్రదాయ విధానాలతో పాటు టీవీ కార్యక్రమాలు డిజిటల్/సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాలను ప్రజలందరికి చేరేలా నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. వివిధ రాష్ట్రాల సమాచార మరియు ప్రజా సంబంధాల డైరెక్టరేట్ మరియు మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయాల సహకారంతో భారతదేశంలో అన్ని  పాఠశాలలు మరియు కళాశాలలకు సందేశం చేరేలా చూడడానికి ఆకాశవాణి ప్రతి రోజూ "ఆజాది కా సఫర్ఆకాశవాణి కే సాథ్"  కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నది. ధరోహర్ (స్వాతంత్య్ర నాయకుల ప్రసంగాలు) మరియు నిషాన్ (75 సందర్శనీయ ప్రాంతాలు )అపరాజిత (మహిళా నాయకులు) పేరిట ఆకాశవాణి ప్రత్యేక ప్రసారాలను ప్రారంభించనున్నది.  "నవ భారత నవ ప్రయాణం " మరియు "నూతన భారత ప్రయాణం" శీర్షికలతో దూరదర్శన్ దౌత్య నీతి డిజిటల్ ఇండియాశాసన సంస్కరణలు మొదలైన అంశాలతో పాటు స్వాతంత్ర్య సమర యుద్ధంలో గుర్తింపుకు నోచుకోని వీరులు  స్వాతంత్ర్య పోరాటాల పై రోజువారీ ప్రత్యేక వార్తలు ప్రసారం చేస్తుంది. 

సందర్శనీయ వారోత్సవాల్లో భాగంగా ' నేతాజీ','రాచరిక రాష్ట్రాల విలీనం' లాంటి డాక్యుమెంటరీ చిత్రాలతో పాటు '"రాజీ" వంటి ప్రముఖ భారతీయ చిత్రాలను దూరదర్శన్ తన నెట్ వర్క్ లో ప్రసారం చేస్తుంది.  జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ  తన ఓటీటీ  ప్లాట్‌ఫామ్ www.cinemasofindia.com లో చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తుంది. దీనిలో "ఐలాండ్ సిటీ", "క్రాసింగ్ బ్రిడ్జెస్ " వంటి ప్రత్యేకంగా ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శిస్తారు.  విద్యార్థులు, ఔత్సాహికుల కోసం ఆన్ లైన్ లో చర్చా కార్యక్రమాలను కూడా జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ  నిర్వహించనున్నది.  ' చలన చిత్ర నిర్మాణంలో చోటుచేసుకున్న ఆధునిక మార్పులు" అనే అంశంపై ఫిల్మ్స్ డివిజన్ వెబినార్ ను నిర్వహిస్తుంది.   

కార్యక్రమాల్లో ఉత్సాహం నింపడానికి ఫిల్మ్స్ డివిజన్ 2021 ఆగస్టు 23 నుంచి 25 వరకు "ఇండియా@75: వాయేజ్ ఆఫ్ ప్రోగ్రెస్" 26 నుంచి 28 ఆగస్టు 28 వరకు  "ఇండియా@75: ఐకాన్స్ ఆఫ్ ఇండియా"  అంశాలపై  ఆన్‌లైన్ లో  చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తుంది. దేశంలో ఉన్న ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తో కలిసి డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చిత్రాలను ప్రదర్శిస్తుంది. అందరిని అలరించే విధంగా క్లాసిక్ సినిమా లైవ్ వర్చువల్ ఫిల్మ్ పోస్టర్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడానికి  నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. 

  వీధి నాటకాలుహాస్య ప్రదర్శన మ్యాజిక్ షోలుతోలుబొమ్మలాటజానపద గీతాల  ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సాంగ్  డ్రామా డివిజన్ కి చెందిన  50 కి పైగా సమీకృత సమాచార, 1000 కి పైగా ఆర్వోబీ పీఆర్టీ  ల ద్వారా  బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్  మరియు కమ్యూనికేషన్   కార్యక్రమాలను ప్రజలకు చేరువలోకి తీసుకుని వెళ్తుంది.  బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్  మరియు కమ్యూనికేషన్   తన వెబ్‌సైట్‌లో  'రాజ్యాంగ నిర్మాణంఅనే ఈ-బుక్‌ను ప్రారంభిస్తుంది.  భారతదేశం వివిధ ప్రాంతాల్లో ఉన్న  పబ్లికేషన్ డివిజన్ ప్రదర్శనల్లో ఔత్సాహిక పాఠకులు వివిధ  అంశాలపై సమాచార మరియు ఉత్తేజకరమైన పుస్తకాలను చూడవచ్చును. 

  స్వాతంత్ర్య పోరాటం, నవ భారత నిర్మాణం పై యువత  దృశ్య శ్రవణ విధానంలో వివరాలను తెలుసుకుంటూ  మంత్రిత్వ శాఖ  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నిర్వహించనున్న చర్చా కార్యక్రమాలు క్విజ్‌లు మరియు పోటీలలో పాల్గోవడానికి అవకాశం ఉంటుంది. 

ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న  ఐకానిక్ వీక్ ను ఘనంగా భారీ ఎత్తున నిర్వహించడానికి  సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.  స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని విలువలను ప్రదర్శించడంతో పాటు నవ భారత నిర్మాణంపై యువత ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిబింబించే విధంగా  ఈ కార్యక్రమాలను రూపొందించారు.

 

***



(Release ID: 1748182) Visitor Counter : 258