ప్రధాన మంత్రి కార్యాలయం

జైడ‌స్ యూనివ‌ర్స్ కు చెందిన‌ ప్రపంచంలోనే తొలి డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ "జైకోవ్‌-డి"కి అనుమ‌తి న‌వ‌క‌ల్ప‌న‌ల‌పై భార‌త శాస్త్రవేత్త‌ల అన్వేష‌ణాత్మ‌క కాంక్ష‌కు ఒక నిద‌ర్శ‌నం : ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 20 AUG 2021 10:07PM by PIB Hyderabad
జైడ‌స్ యూనివ‌ర్స్ కు చెందిన ప్ర‌పంచంలోనే తొలి డిఎన్ఏ ఆధారిత జైకోవ్‌-డి వ్యాక్సిన్ కు అనుమ‌తి న‌వ‌క‌ల్ప‌న‌ల‌పై భార‌త శాస్త్రవేత్త‌ల అన్వేష‌ణాత్మ‌క కాంక్ష‌కు ఒక నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

సిడిఎస్ సిఓ ఇండియా ఇన్ఫో చేసిన ట్వీట్ కు స్పందిస్తూ "భార‌తదేశం సంపూర్ణ శ‌క్తిని కేంద్రీక‌రించి కోవిడ్‌-19పై పోరాటం సాగిస్తోంది. @జైడ‌స్ యూనివ‌ర్స్ కు చెందిన‌ ప్ర‌పంచంలోనే తొలి డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ జైకోవ్‌-డికి ల‌భించిన అనుమ‌తి న‌వ‌క‌ల్ప‌న‌ల‌పై భార‌త శాస్త్రవేత్త‌ల అన్వేష‌ణాత్మ‌క ఆకాంక్ష‌కు ఒక నిద‌ర్శ‌నం. ఇది నిజంగా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న" అని ట్వీట్ చేశారు.

***(Release ID: 1747930) Visitor Counter : 52