ప్రధాన మంత్రి కార్యాలయం

MyGov (మైగవ్) కు 7 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో మైగవ్ స్వచ్ఛంద సేవకుల ను, సహాయకుల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి 

Posted On: 26 JUL 2021 6:30PM by PIB Hyderabad

MyGov (మైగవ్) ప్లాట్ ఫార్మ్ ను తమ తోడ్పాటుల తో సమృద్ధం చేసినటువంటి వాలంటియర్ లను, కన్ ట్రిబ్యూటర్ లను అందరి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

MyGovIndia (మైగవ్ఇండియా) ద్వారా నమోదు అయినటువంటి ఒక ట్వీట్ కు ప్రతి గా ప్రధాన మంత్రి ఈ కింది విధం గా పేర్కొన్నారు:

‘‘ పాలన లో భాగస్వామ్యం పంచుకోవడం లోను, మన యువశక్తి కి ఒక స్వరం గా మారడం లోను ఒక సమర్థవంతమైనటువంటి ఉదాహరణ గా MyGov (మైగవ్) సమున్నతం గా నిలుస్తున్నది.

మనం #7YearsOfMyGov ను జరుపుకొంటున్న ఈ రోజు న, ఈ ప్లాట్ ఫార్మ్ ను తమ తోడ్పాటు తో సుసంపన్నం చేసిన స్వయంసేవకుల ను, సహాయకుల ను అందరి ని నేను మెచ్చుకొంటున్నాను. ’’

 

***

DS/SH


(Release ID: 1739377)